ఇండిగో విమానంలో బాంబు కలకలం... కొద్దినిమిషాల్లో టేక్‌ ఆఫ్‌ అవుతుందనంగా.. | Threat Email Warning Bomb On IndiGo Flight At Mumbai Airport | Sakshi
Sakshi News home page

ఇండిగో విమానంలో బాంబు కలకలం... కొద్దినిమిషాల్లో టేక్‌ ఆఫ్‌ అవుతుందనంగా..

Published Sun, Oct 2 2022 2:46 PM | Last Updated on Sun, Oct 2 2022 2:49 PM

Threat Email Warning Bomb On IndiGo Flight At Mumbai Airport - Sakshi

ముంబై: ఇండిగో విమానం టేక్‌ ఆఫ్‌ అవుతుందనగా విమానంలో బాంబు ఉందంటూ వార్నింగ్‌ మెసేజ్‌ వచ్చింది. దెబ్బకు సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా హైఅలర్ట్‌ విధించి తనిఖీలు నిర్వహించారు. ఈ ఘటన ముంబైలోని చత్రపతి శివాజి మహారాజ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంది. అయితే సిబ్బంది అప్రమత్తమై హుటాహుటినా తనిఖీలు నిర్వహించగా... అలాంటిదేమీ జరగలేదని అధికారులు తెలిపారు. కరక్ట్‌గా ఫ్లైట్‌ టేక్‌ఆఫ్‌ అయ్యే సమయానికి శనివారం రాత్రి ఈ గాలి వార్త వచ్చింది.

దీంతో ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది ఒక్కసారిగా షాక్‌ అ‍య్యి వెంటనే విమానాన్ని ఆపీ తనిఖీలు చేశారు. దీంతో ఫ్లైట్‌ ఆలస్యంగా బయలుదేరాల్సి వచ్చింది. ఆ ఇండిగో విమానం ముంబై ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవాల్సిన విమానం. అయితే ఆ ఈమెయిల్‌ మెసేజ్‌లో ఇండోగో విమానం ఫలాన ఫ్లైట్‌ నెంబర్‌లో బాంబు ఉందని చాలా క్లియర్‌గా సందేశం పంపిచడంతో అధికారులు సీరియస్‌గా తీసుకుని వెంటనే తనిఖీలు నిర్వహించామని తెలిపారు. అసలు ఎక్కడ నుంచి ఈ గాలి వార్త వచ్చిందని పోలీసులు దర్యాప్త చేయడం ప్రారంభించారు.

(చదవండి: విషాదంలో ఎంత ఘోరం.. రీల్స్‌ తీస్తుండగా..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement