
ఢిల్లీ : న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం తెల్లవారుజామున 2గంటకు టర్మినెల్ 3 దగ్గర అనుమానాస్పదంగా లభించిన బ్యాగు కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్ అధికారులు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ టీంతో కలిసి పోలీసులు ఎయిరపోర్టుకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు ప్రయాణికులెవరిని లోపలికి అనుమతించలేదు. అనుమానాస్పదంగా దొరికిన బ్యాగును పరిశీలిస్తున్నారు. కాగా, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment