Indiragandhi International airport
-
పొగమంచు ఎఫెక్ట్‌తో పలు విమానాలు దారి మళ్లింపు
సాక్షి,న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీలో విమానాల రాకపోకలకు పొగ మంచు అడ్డం పడింది. ప్రతికూల వాతావరణం దృష్ట్యా విమానాలు ల్యాండ్ కాలేకపోతున్నాయి. దీంతో పలు విమానాలను దారి మళ్లించినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే దారి మళ్లించిన విమానాల సమాచారాన్ని అధికారులు తెలియజేశారు. మరోవైపు హైదరాబాద్ నుంచి ఉదయం 6.15కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని(AI559) జైపూర్‌కు దారి మళ్లించారు. ఈ విమానంలోనే వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఉన్నారు. దీంతో ఆయన 11 గంటలకు జరుగనున్న పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌కు ఆలస్యంగా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేడు అఖిలపక్ష సమావేశం పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ సమావేశం ఏర్పాటు చేసింది కేంద్రం. ఉదయం 11గం.లకు పార్లమెంటు లైబ్రరీ భవనంలో ఈ భేటీ జరగనుంది. వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరు అవుతుండగా.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ఎజెండాగా ఈ భేటీ జరుతోంది. ఇదిలా ఉంటే.. డిసెంబర్ 4 నుంచి 22 వరకూ కొనసాగనున్నాయి పార్లమెంటు శీతాకాల సమావేశాలు. -
లాక్డౌన్ : 55 రోజుల పాటు ఎయిర్‌పోర్ట్‌లోనే
ఢిల్లీ : కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో జర్మన్ జాతీయుడు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే 55 రోజుల పాటు ఉండిపోవాల్సి వచ్చింది. కాగా మంగళవారం ఉదయం ఎయిర్పోర్ట్ అధికారులు అన్ని పరీక్షలు నిర్వహించగా కరోనా నెగెటివ్ రావడంతో జర్మనీకి చెందిన కెఎల్ఎమ్ విమానంలో ఆ వ్యక్తిని ఆమ్స్టర్డామ్కు పంపించారు. వివరాలు.. జర్మనీకి చెందిన ఎడ్గార్డ్ జీబాట్ దేశంలో లాక్డౌన్ విధించకముందు మార్చి 18న వియత్నాం నుంచి ఢిల్లీకి వచ్చాడు. ఇంతలో కరోనా మహమ్మారి విజృంభించడంతో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దీంతో చేసేదేంలేక జీబాట్ అధికారులను ఆశ్రయించాడు. వారు విమానాశ్రయంలోనే విదేశీయుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వసతిలో జీబాట్‌ను ఉంచారు.ముందస్తుగా అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని తేలింది. (కరోనా : ఎయిరిండియా ఉద్యోగికి పాజిటివ్) అయితే లాక్డౌన్ నేపథ్యంలో విమాన సేవలు నిలిచిపోవడంతో జీబాట్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. జీబాట్‌కు అన్ని వసతులు కల్పించిన అధికారులు అతనిపై విచారణ చేపట్టారు. విచారణ సమయంలో జీబాట్ మాట్లాడుతూ.. తాను వియత్నాం నుంచి మార్చి 18న వియత్జెట్ విమానం ద్వారా ఢిల్లీకి వచ్చానని పేర్కొన్నాడు. ఢిల్లీ నుంచి టర్కీలోని ఇస్తాంబుల్‌కు అనుసంధానంగా విమానంలో బయలుదేరాల్సిన సమయంలో ఇండియాలో లాక్డౌన్ విధించారు. లాక్డౌన్ కారణంగా వాణిజ్య, పౌర విమానాయాన సేవలు నిలిచిపోవడంతో ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని తెలిపాడు. దాదాపు 55 రోజుల పాటు ఎయిర్‌పోర్ట్‌లోనే గడపాల్సి వచ్చిందని, అయితే అధికారులు తనకు అన్ని వసతులు కల్పించారని జీబాట్ పేర్కొన్నాడు. (లాక్డౌన్: కేజ్రీవాల్ వినూత్న నిర్ణయం) -
పల్లీల్లో పట్టుబడ్డ విదేశీ కరెన్సీ..
-
వేరుశెనక్కాయల్లో డబ్బులే డబ్బులు
సాక్షి, న్యూఢిల్లీ: బంగారం, విలువైజ వజ్రాలను అక్రమంగా తరలించేందుకు దళారులు వివిధ మార్గాలు ఎంచుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ వ్యక్తి రూ.45 లక్షల విలువైన విదేశీ కరెన్సీని అక్రమంగా తీసుకు వచ్చిన తీరు చూసి ఆశ్చర్యపోవడం అధికారుల వంతైంది. అయ్యగారి పనితనం చూసి ‘వాట్ యాన్ ఐడియా’ అంటూ అవాక్క అయ్యారు. ఆ వ్యక్తి వినూత్న రీతిలో విదేశీ కరెన్సీని తీసుకువచ్చినా ...చివరికి అధికారులకు చిక్కిన సంఘటన ఢిల్లీ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) సిబ్బందికి పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే... ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-3 వద్దకు మంగళవారం సాయంత్రం వచ్చిన మురాద్ అలీ (25) అనుమానాస్పదంగా వ్యవహరిస్తుండడంతో అధికారులు అతడి లగేజీని తనిఖీ చేశారు. దుబాయ్‌కు వెళ్లనున్న అతడి దగ్గర బిస్కెట్ పాకెట్లు, పల్లీలు, ఉడికించిన మాంసపుముద్దలు ఉన్నాయి. అధికారులు వాటిని తెరచి చూడగా అందులో చిన్నగా చుట్టిన విదేశీ కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. మొత్తం 508 నోట్లు ఉన్నాయని, వాటి విలువ భారత కరెన్సీలో రూ. 45 లక్షలు ఉంటుందని చెప్పారు. వేరుశనక్కాయల పైపొరను పగులగొట్టి అందులో నోట్లను ఉంచి, దాన్ని మళ్లీ జిగురుతో అంటించినట్లు కనుగొన్నారు. బిస్కెట్ పాకెట్లో ప్రతి బిస్కెట్ తర్వాత ఓ నోటును ఉంచి ఆపై దాన్ని సీల్ చేసినట్లు ఆధికారులు గుర్తించారు. ఆ కరెన్సీని కస్టమ్స్ అధికారులకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మురాద్ ఇప్పటికే పలుమార్లు దుబాయ్‌కి వెళ్లినట్లు గుర్తించారు. అయితే మురాద్ సాధారణ కూలీ అని, అతడి చేత ఎవరో ఈ పని చేయించినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను అధికారులు ట్విటర్లో పోస్ట్ చేశారు. మురాద్‌ను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగు కలకలం
ఢిల్లీ : న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం తెల్లవారుజామున 2గంటకు టర్మినెల్ 3 దగ్గర అనుమానాస్పదంగా లభించిన బ్యాగు కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అధికారులు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ టీంతో కలిసి పోలీసులు ఎయిరపోర్టుకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు ప్రయాణికులెవరిని లోపలికి అనుమతించలేదు. అనుమానాస్పదంగా దొరికిన బ్యాగును పరిశీలిస్తున్నారు. కాగా, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
ఎయిర్‌పోర్టులోకి అక్రమంగా ప్రవేశం.. అరెస్ట్
న్యూఢిల్లీ : విమానాశ్రయంలోకి అక్రమంగా ప్రవేశించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. విమానాశ్రయంలోని టెర్మినల్ 3 వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరించడాన్ని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) సిబ్బంది గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా ...తన పేరు ఉబైద్ లాల్ అని, శ్రీనగర్‌కు వెళ్తున్న తన తల్లిని చూడటానికి వచ్చినట్లు పోలీసుల విచారణలో తెలిపాడు. టెర్మినల్ 3 లోకి ఎలా ప్రవేశించావని పోలీసులు ప్రశ్నించగా అతను సవరించిన విమాన టికెట్‌ను చూపించి లోనికి ప్రవేశించినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఉబైద్ లాల్‌ను ఢిల్లీ పోలీసులకు అప్పగించి... అతనిపై మోసం, నేరపూరిత దుర్వినియోగం కేసు నమోదు చేశారు. కాగా రద్దు అయిన టికెట్‌ను చూపించి టెర్మినల్‌లోకి ప్రవేశించిన ఓ వ్యక్తిని అంతకు మందే సీఐఎస్ఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రిటిష్ జాతీయుడైన రాజ్ధనోటా రద్దు అయిన టికెట్‌ను చూపించి టెర్మినల్ లోపలికి వచ్చేశాడు. అతను తన భార్య, కుమారుడిని చూడటానికే ఇలా చేశానని విచారణలో ఒప్పుకున్నాడు. అతనిపైన కూడా కేసు నమోదు చేశారు. ఒకే రోజు రెండు సంఘటనలు జరగడంతో విమనాశ్రయంలో తనిఖీలను మరింత కట్టుదిట్టం చేశారు. చదవండి : విమానంలోనే తుది శ్వాస విడిచిన ప్రయాణికుడు -
బంగ్లా హోంమంత్రిని సాధరంగా ఆహ్వానించిన కిషన్‌రెడ్డి
ఢిల్లీ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి మంగళవారం ఉన్నతాధికారులతో కలిసి బంగ్లాదేశ్ హోంమంత్రి అసద్దుజుమాన్ ఖాన్‌కు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానశ్రాయంలో సాధర స్వాగతం పలికారు. బుధవారం అసద్దుజుమాన్ ఉన్నత స్థాయి ప్రతినిధుల బృంధం హోంమంత్రి అమిత్ షాతో భేటి అయి వివిధ విషయాలను చర్చించనున్నారు. జమ్మూ కశ్యీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370 రద్దు తర్వాత వీరి భేటి జరగనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా కిషన్ రెడ్డి వెంట జాయింట్ సెక్రటరీ సత్యేంద్ర గార్గ్, బంగ్లాదేశ్ హై కమిషనర్ సైయ్యద్ మౌజెమ్ అలీ, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. -
తనిఖీల్లో పట్టుబడ్డ ఎమ్మెల్యే.. అరెస్ట్..!
సాక్షి, న్యూఢిల్లీ : విమాన ప్రయాణం సందర్భంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన తనిఖీల్లో బిహార్ ఎమ్మెల్యే పట్టుబడ్డారు. అక్రమంగా బుల్లెట్లు కలిగి ఉండడంతో ఆర్జేడీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ను పోలీసు అరెస్టు చేశారు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఢిల్లీ విమానాశ్రయం నుంచి పట్నాకు బయలుదేరారు. అక్కడ సీఐఎస్ఎఫ్ సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో.. ఎమ్మెల్యే లగేజీలో 3.15 బోర్ సైజుతో గల 10 బుల్లెట్లు బయటపడ్డాయి. ఎమ్మెల్యే వాటికి సంబంధించిన పత్రాలేవీ సమర్పించకపోవడంతో ఆయుధ, మందుగుండు సామాగ్రి చట్టం ప్రకారం పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. చంద్రశేఖర్ మధేపుర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
రూ.58 లక్షల విలువైన బంగారం స్వాధీనం
సాక్షి, న్యూఢిల్లీ: విదేశాల నుంచి అక్రమంగా బంగారం తెస్తూ ఓ ప్రయాణికుడు దొరికిపోయాడు. ఇందిరా గాంధీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి బంగారాన్ని తీసుకువచ్చేందుకు అతగాడు చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. అధికారుల తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే... దుబాయ్ నుంచి ఢిల్లీ వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి సుమారు రూ.58 లక్షల విలువ చేసే 1930 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆ ప్రయాణికుడు బంగారాన్ని .. పలుచని రేకులుగా తయారు చేసి వాటిని అట్ట పెట్టెలు, స్కూలు బ్యాగ్‌ల మధ్య కూర్చి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేశాడు. కానీ అతడిని అడ్డగించిన విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకుని, విచారణ జరుపుతున్నారు. -
ఢిల్లీలో విమానాలకు పొగమంచు దెబ్బ
న్యూఢిల్లీ: దేశరాజధానిలో ఆదివారం ఉదయం భారీగా పొగమంచు కురిసింది. దీంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 350కిపైగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దట్టంగా అలుముకున్న పొగమంచు ప్రభావంతో 270 విమానాలు ఆలస్యంగా నడవగా, 50 విమానాలను అధికారులు దారి మళ్లించారు. దీంతోపాటు మరో 35 విమానాలను రద్దుచేశారు. పొగమంచు దెబ్బకు దాదాపు 50 మీటర్లలోపు ఉన్న రన్‌వే మాత్రమే కన్పించడంతో.. కేటగిరీ 3బీ సాంకేతికతతో కొన్ని విమానాల రాకపోకల్ని కొనసాగించారు. -
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కలకలం!
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీ ఎయిర్‌పోర్టులో కలకలం రేగింది. ఇక్కడి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడిని భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టగా ఓ అనుమానిత వస్తువును గుర్తించారు. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. అనుమానిత వస్తువులతో విమానం ఎక్కేందుకు యత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా అనుమానంగా కనిపిస్తే తమకు చెప్పాలని సూచించారు. ఎయిర్‌పోర్టు అధికారులు మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికుడు ఇండిగో విమానంలో ప్రయాణించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే భద్రతా సిబ్బంది అనుమానంగా కనిపిస్తున్న ఓ ప్రయాణికుడిని తనఖీ చేయగా అతడి వద్ద ఓ ప్రమాద వస్తువు లభ్యమైనట్లు చెప్పారు. చూసేందుకు ట్యాబ్, పెద్ద స్మార్ట్ ఫోన్ తరహాలో కనిపిస్తున్న ఆ వస్తువు పేలుడు సంబంధిత పదార్థంగా భావించినట్లు చెప్పారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.