న్యూఢిల్లీ: దేశరాజధానిలో ఆదివారం ఉదయం భారీగా పొగమంచు కురిసింది. దీంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 350కిపైగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దట్టంగా అలుముకున్న పొగమంచు ప్రభావంతో 270 విమానాలు ఆలస్యంగా నడవగా, 50 విమానాలను అధికారులు దారి మళ్లించారు. దీంతోపాటు మరో 35 విమానాలను రద్దుచేశారు. పొగమంచు దెబ్బకు దాదాపు 50 మీటర్లలోపు ఉన్న రన్‌వే మాత్రమే కన్పించడంతో.. కేటగిరీ 3బీ సాంకేతికతతో కొన్ని విమానాల రాకపోకల్ని కొనసాగించారు.
Comments
Please login to add a commentAdd a comment