disruptions
-
Parliament Budget Session 2024: ఆత్మపరిశీలన చేసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ కార్యకలాపాలకు తరచూ అంతరాయం కలిగించే విపక్ష ఎంపీలు ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ హితవు పలికారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. రామ్ రామ్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘ప్రజాస్వామ్యంలో విమర్శ, ప్రతిపక్షం అనేవి చాలా అవసరం. అయితే నిర్మాణాత్మక ఆలోచనలతో సభను సుసంపన్నం చేసిన వారినే ప్రజలు గుర్తుంచుకుంటారు. అంతరాయం సృష్టించిన వారిని ఎవరూ గుర్తుంచుకోరు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగకుండా అనుక్షణం నిరసనలు, నినాదాలను సభా కార్యకలాపాలను స్తంభింపజేసిన ఆ విపక్ష పార్టీల సభ్యులు తమ ప్రవర్తనను ఆత్మపరిశీలన చేసుకోవాలి. వారు తమ పాత పంథాను విడనాడాలి. వాళ్లు తమ సొంత పార్లమెంట్ నియోజకవర్గాల్లో తిరిగినా పాత సెషన్లో వీరు చేసిన వీరంగాన్ని ఎవ్వరూ గుర్తుంచుకోరు‘ అని విపక్ష ఎంపీలను ప్రధాని తప్పుబట్టారు. ‘‘సాధారణంగా ఎన్నికల సమయంలో పూర్తి బడ్జెట్‌ను సమర్పించరు. మేము అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తాం. ఈసారి మళ్లీ మేమే వస్తాం. కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేసి పూర్తి బడ్జెట్‌ను మీ ముందుకు తెస్తాం. ఈసారి ఆర్థిక మంత్రి కొన్ని మార్గదర్శక అంశాలతో మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించబోతున్నారు’ అని మోదీ ప్రకటించారు. ‘అభివృద్ధిలో దేశం అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తోంది. సమ్మిళిత, దేశ సర్వోతోముఖాభివృద్ధి ప్రయాణం ఆగదు’’ అని వ్యాఖ్యానించారు. -
అవాంతరాలు సర్వసాధారణంగా మారాయి
న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణలో వివిధ రకాల అవాంతరాలు ప్రస్తుతం సర్వ సాధారణంగా మారాయని అల్ట్రాటెక్ సిమెంట్ చైర్మన్ కుమార మంగళం బిర్లా వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ వాటిని విజయవంతంగా అధిగమించగలిగేలా భారత్ కనిపిస్తోందని తెలిపారు. వార్షిక సర్వ సభ్య సమావేశంలో షేర్హోల్డర్లను ఉద్దేశించి వర్చువల్‌గా చేసిన ప్రసంగంలో ఆయన ఈ అంశాలు ప్రస్తావించారు. ఈ ఏడాది వ్యయాలపరమైన ఒత్తిళ్లు, ఆర్థిక మార్కెట్లలో అస్థిరత విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ వ్యాపారాలు మధ్యకాలికంగా చూస్తే వ్యాపారాలు రికవరీ బాటలోనే కొనసాగుతున్నాయని బిర్లా వివరించారు. ‘కోవిడ్–19 మహమ్మారి కారణంగా 2020 అసాధారణమైన సంవత్సరంగా గడిచింది. సరఫరా వ్యవస్థలు దెబ్బతినడంతో 2021 కూడా అలాగే గడిచిపోయింది. ఇక ఇప్పుడు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయంగా స్టాగ్ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత పెరిగిపోయి.. డిమాండ్ స్తబ్దంగా ఉండటం) వంటి కారణాలతో 2022 కూడా అసాధారణంగానే కొనసాగుతోంది. చూడబోతే అవాంతరాలనేవి సర్వసాధారణంగా మారిపోయినట్లుగా కనిపిస్తోంది‘ అని బిర్లా చెప్పారు. -
సౌర తుపాను!.. జీపీఎస్, రేడియో సిగ్నళ్లకు అంతరాయం
న్యూయార్క్: సౌర తుపాను మంగళవారం భూమిని తాకనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే జీపీఎస్, రేడియో సిగ్నళ్ల ప్రసారంలో అంతరాయం తప్పదు. ఈ నెల 19న సూర్యగోళం నుంచి విడుదలయ్యే పాము ఆకారంలోని ఫిలమెంట్ (సౌర తుపాను) ప్రభావం నేరుగా భూమికి ఢీకొట్టే ఆస్కారముందని డాక్టర్ తమిథా స్కోవ్ చెప్పారు. దీనివల్ల భూమిపై పలు ప్రాంతాల నుంచి ఆకాశంలో ధ్రువకాంతి (అరోరా) వీక్షించవచ్చని అన్నారు. అనంతరం మరికొన్ని చిన్నపాటి సౌర తుపాన్లు విరుచుకుపడే ప్రమాదముందన్నారు. ఈ నెల 20, 21న జి1–క్లాస్ తుపాను రావచ్చని స్పేస్‌వెదర్ సంస్థ ప్రకటించింది. సౌర తుపాను సమయంలో సూర్యుడి నుంచి వెలువడే శక్తి భూమిపై అన్ని విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏడాదిపాటు ఉత్పత్తి చేసే కరెంటు కంటే లక్ష రెట్లు అధికం. -
మొదటి వారం రాజ్యసభ సమావేశాలు.. 52 శాతం సమయం వృథా
సాక్షి, న్యూఢిల్లీ: శీతాలకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్ష ఎంపీలు పలు అంశాల మీద నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వర్షాకాల సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించిన 12 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. 12 మంది ఎంపీలను సస్పెండ్ చేసినందుకు ప్రతిపక్షాలు.. ఇది అప్రజాస్వామిక చర్య అని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేయటం పట్ల తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, కాని వారు సభకు క్షమాపణలు చెప్పాలని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషీ డిమాండ్ చేశారు. చదవండి: గాంధీల దేశాన్ని గాడ్సే దేశంగా మారుస్తున్నారు: మెహబూబా ముఫ్తీ ఈ నేపథ్యంలో మొదటి వారం రోజులు జరిగిన సమావేశాల్లో 52 శాతం సమయాన్ని రాజ్యసభ కోల్పోయింది. విపక్షాల నిరసన వల్ల సభా సమయం వృథా కావడంపై రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కొంతమంది ప్రతిపక్ష నాయకులు, కేంద్ర మంత్రులతో చర్చించారు. 12 మంది సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌పై ఇరు పక్షాలు చర్చించి ఒక అభిప్రాయానికి రావాలని తెలిపారు. మొదటి వారం రాజ్యసభ సమావేశాల్లో రెండు బిల్లులు ఆమోదం పొందాయి. -
వారంలో మూడుగంటలే!
న్యూఢిల్లీ: బడ్జెట్ మలి విడత సమావేశాలు మొదలైన మొదటి వారంలో రాజ్యసభ మూడు గంటలు మాత్రమే సవ్యంగా సాగింది. ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై చర్చ జరగాలంటూ ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనలతోనే సమయమంతా గడిచిపోయింది. షెడ్యూల్ ప్రకారం సభ 28.30 గంటలపాటు జరగాల్సి ఉండగా 26 గంటలపాటు అంతరాయం కలిగిందని, కేవలం 2.42 గంటలపాటు మాత్రమే కార్యకలాపాలు సాగాయని రాజ్యసభ వర్గాలు తెలిపాయి. సమావేశాలు 9.50 శాతమే ఫలప్రదమ య్యాయని పేర్కొన్నాయి. దీంతోపాటు, ఫిబ్రవరి 12, మార్చి 1వ తేదీల మధ్య జరిగిన స్టాండింగ్ కమిటీల సమావేశాలకు సగం మంది ఎంపీలు మాత్రమే హాజరయ్యారని వెల్లడించాయి. -
ఢిల్లీలో విమానాలకు పొగమంచు దెబ్బ
న్యూఢిల్లీ: దేశరాజధానిలో ఆదివారం ఉదయం భారీగా పొగమంచు కురిసింది. దీంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 350కిపైగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దట్టంగా అలుముకున్న పొగమంచు ప్రభావంతో 270 విమానాలు ఆలస్యంగా నడవగా, 50 విమానాలను అధికారులు దారి మళ్లించారు. దీంతోపాటు మరో 35 విమానాలను రద్దుచేశారు. పొగమంచు దెబ్బకు దాదాపు 50 మీటర్లలోపు ఉన్న రన్‌వే మాత్రమే కన్పించడంతో.. కేటగిరీ 3బీ సాంకేతికతతో కొన్ని విమానాల రాకపోకల్ని కొనసాగించారు. -
కాళేశ్వరానికి కాంగ్రెస్ ఆటంకాలు
సుమన్ సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నం చేస్తోందని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. పెద్దపల్లిలో బుధవారం కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని రచ్చ చేసేందుకు మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శ్రీధర్‌బాబు ప్రయత్నించారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో గురువారం ఆయన ఎమ్మెల్సీ భానుప్రసాద్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రైతులు పచ్చగా ఉండడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని, వారి కుట్ర పూరిత వైఖరిని రైతులు ప్రజాభిప్రాయ సేకరణలోనే ఎండగట్టారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై గత ఆరు నెలల్లో 36 కేసులు వేశారని మండిపడ్డారు. -
రాజీనామా చేయాలనిపిస్తోంది: అద్వానీ
-
రాజీనామా చేయాలనిపిస్తోంది: అద్వానీ
పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న తీరుపై బీజేపీ కురువృద్ధుడు లాల్ కిషన్ అద్వానీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఇంతకుముందే కేంద్ర మంత్రి అనంతకుమార్ వద్ద ఈ విషయం చెప్పిన ఆయన.. ఇప్పుడు తాజాగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఈ విషయమై మాట్లాడారు. సభ సజావుగా జరిగేందుకు జోక్యం చేసుకోవాలని రాజ్‌నాథ్‌ను ఆయన కోరారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రాజీనామా చేయాలని అనిపిస్తోందని, మాజీ ప్రధాని వాజ్‌పేయి ఈ సభలో ఉండి ఉంటే చాలా బాధపడేవారని ఆయన చెప్పారు. ఒకవైపు ప్రతిపక్షం, వాళ్లకు దీటుగా అధికార పక్షం కూడా తీవ్రస్థాయిలో నినాదాలు చేయడంతో లోక్‌సభ శుక్రవారానికి వాయిదా పడగా రాజ్యసభ పలుమార్లు వాయిదా పడి, చివరకు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. ఏ ఒక్క అంశంపై కూడా చర్చలు జరగడం లేదు. దాంతో ఈ తీరుపై అద్వానీ అసంతృప్తి వ్యక్తం చేశారు.