రాజీనామా చేయాలనిపిస్తోంది: అద్వానీ
రాజీనామా చేయాలనిపిస్తోంది: అద్వానీ
Published Thu, Dec 15 2016 1:22 PM | Last Updated on Mon, Sep 4 2017 10:48 PM
పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న తీరుపై బీజేపీ కురువృద్ధుడు లాల్ కిషన్ అద్వానీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఇంతకుముందే కేంద్ర మంత్రి అనంతకుమార్ వద్ద ఈ విషయం చెప్పిన ఆయన.. ఇప్పుడు తాజాగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఈ విషయమై మాట్లాడారు. సభ సజావుగా జరిగేందుకు జోక్యం చేసుకోవాలని రాజ్‌నాథ్‌ను ఆయన కోరారు.
ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రాజీనామా చేయాలని అనిపిస్తోందని, మాజీ ప్రధాని వాజ్‌పేయి ఈ సభలో ఉండి ఉంటే చాలా బాధపడేవారని ఆయన చెప్పారు. ఒకవైపు ప్రతిపక్షం, వాళ్లకు దీటుగా అధికార పక్షం కూడా తీవ్రస్థాయిలో నినాదాలు చేయడంతో లోక్‌సభ శుక్రవారానికి వాయిదా పడగా రాజ్యసభ పలుమార్లు వాయిదా పడి, చివరకు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. ఏ ఒక్క అంశంపై కూడా చర్చలు జరగడం లేదు. దాంతో ఈ తీరుపై అద్వానీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement