న్యూఢిల్లీ: బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉపప్రధాని ఎల్‌కే అద్వానీ(97) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని ఢిల్లీ అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. అబ్జర్వేషన్‌లో ఉన్నారని వైద్యులు ప్రకటించారు.
ఇదిలా ఉంటే.. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న అద్వానీ గతంలోనూ అస్వస్థతకు లోనయ్యారు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొంది.. కొన్నిరోజులకే వెంటనే కోలుకున్నారు.
BJP leader and Bharat Ratna LK Advani admitted to Apollo hospital in Delhi.
— News Arena India (@NewsArenaIndia) December 14, 2024
క్రియాశీలక రాజకీయాలకు దూరం అయ్యాక అద్వానీ మీడియా ముందు కనిపించడం అరుదుగా మారింది. రామమందిర ప్రారంభానికి ఆహ్వానం అందినప్పటికీ.. వయసురిత్యా ఇబ్బందులతో ఆయన హాజరుకాలేకపోయారు. మొన్న.. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించి తర్వాత ప్రధాని మోదీ కూడా అద్వానీ నివాసానికి వెళ్లారు. వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు మోదీ.. అద్వానీ ఆశీస్సులు తీసుకున్నారు.
ఇదీ చదవండి: సంవిధాన్.. సంఘ్ కా విధాన్ కాదు
Comments
Please login to add a commentAdd a comment