Delhi Apollo Hospital
-
ఆస్పత్రిలో అద్వానీ
న్యూఢిల్లీ: బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉపప్రధాని ఎల్కే అద్వానీ(97) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని ఢిల్లీ అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. అబ్జర్వేషన్లో ఉన్నారని వైద్యులు ప్రకటించారు.ఇదిలా ఉంటే.. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న అద్వానీ గతంలోనూ అస్వస్థతకు లోనయ్యారు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొంది.. కొన్నిరోజులకే వెంటనే కోలుకున్నారు.BJP leader and Bharat Ratna LK Advani admitted to Apollo hospital in Delhi.— News Arena India (@NewsArenaIndia) December 14, 2024క్రియాశీలక రాజకీయాలకు దూరం అయ్యాక అద్వానీ మీడియా ముందు కనిపించడం అరుదుగా మారింది. రామమందిర ప్రారంభానికి ఆహ్వానం అందినప్పటికీ.. వయసురిత్యా ఇబ్బందులతో ఆయన హాజరుకాలేకపోయారు. మొన్న.. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించి తర్వాత ప్రధాని మోదీ కూడా అద్వానీ నివాసానికి వెళ్లారు. వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు మోదీ.. అద్వానీ ఆశీస్సులు తీసుకున్నారు.ఇదీ చదవండి: సంవిధాన్.. సంఘ్ కా విధాన్ కాదు -
అందుకే పంజాబ్ సీఎం ఆస్పత్రి పాలయ్యారా?
ఛండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(48) కడుపు నొప్పితో ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు ఇన్ఫెక్షన్ సోకిందని వైద్యులు నిర్ధారించారు కూడా. అయితే ఇప్పుడు ఆ ఇన్ఫెక్షన్కు కారణం ఏంటో బయటకు వచ్చింది. పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్.. పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చే మురుగు వ్యర్థాలతో కూడిన నీటిని పంజాబ్ ముఖ్యమంత్రి నిరభ్యంతరంగా తాగారని, అందుకే ఆయనకు ఇన్ఫెక్షన్ సోకిందని వైద్యులు పేర్కొన్నట్లు సమాచారం. ఈ మేరకు.. ఆయనకు సంబంధించిన వీడియో కూడా ఒకటి వైరల్ అవుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఆ ట్వీట్లో పార్టీ సభ్యుల నినాదాల మధ్య ఆయన గ్లాస్ నీటిని తీసుకుని తాగారు. రాజ్యసభ ఎంపీ, ప్రముఖ పర్యావరణవేత్త బాబా బల్బీర్ సింగ్ సుల్తాన్పూర్ లోధీలో చేపట్టిన కాళి బెన్ శుభ్రత కార్యక్రమంలోనిది ఆ వీడియో. అది జరిగిన వారంలోపే ఆయన ఆస్పత్రి పాలు కావడం విశేషం. అయితే ఆయన ఆస్పత్రి పాలుజేసింది ఆ నీరేనా? అన్నది నిర్ధారణ కావాల్సి ఉంది. ਗੁਰੂ ਨਾਨਕ ਸਾਹਿਬ ਦੀ ਚਰਨ ਛੋਹ ਪ੍ਰਾਪਤ ਧਰਤੀ ਸੁਲਤਾਨਪੁਰ ਲੋਧੀ ਵਿਖੇ ਪਵਿੱਤਰ ਵੇਈਂ ਦਾ ਪਾਣੀ ਪੀਂਦੇ ਹੋਏ CM @BhagwantMann ਜੀ ਪਵਿੱਤਰ ਵੇਈਂ ਨੂੰ ਸਾਫ਼ ਕਰਨ ਦਾ ਬੀੜਾ ਰਾਜ ਸਭਾ ਮੈਂਬਰ ਸੰਤ ਸੀਚੇਵਾਲ ਜੀ ਨੇ ਚੁੱਕਿਆ ਹੋਇਆ ਹੈ pic.twitter.com/4LnU0U66wQ — AAP Punjab (@AAPPunjab) July 17, 2022 -
Bhagwant Mann: ఆస్పత్రిలో చేరిన పంజాబ్ సీఎం
ఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(48) ఆస్పత్రి పాలయ్యారు. అస్వస్థతతో ఆయన బుధవారం ఉదయమే ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. కడుపు నొప్పి రావడంతో ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చేరారు పంజాబ్ సీఎం మాన్. ఆయనకు ఇన్ఫెక్షన్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉంటే.. దగ్గరి బంధువైన డాక్టర్ గురుప్రీత్ కౌర్(32)ను మాన్ ఈమధ్యే రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆస్పత్రిలో ఉండగానే సీఎం భగవంత్ మాన్ ఓ ప్రకటన విడుదల చేశారు. సింగర్ సిద్ధూ మూసేవాలా హంతకుల్లో ఇద్దరిని, యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్ బుధవారం అమృత్‌సర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మట్టుపెట్టినందుకు అభినందనలు తెలియజేశారు. ఇదీ చదవండి: పంజాబ్ ఎన్కౌంటర్: సిద్ధూ హంతకులకు మట్టుబెట్టారిలా.. -
లింగ్వల్ థైరాయిడ్‌కు రోబోటిక్ సర్జరీ
ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స సాక్షి, న్యూఢిల్లీ: లింగ్వల్ థైరాయిడ్‌తో బాధపడుతున్న 18 ఏళ్ల యువతికి ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో అరుదైన శస్త్రచి కిత్స నిర్వహించారు. నేపాల్‌కు చెందిన అనూ యాదవ్ అనే యువతికి ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో ఈఎన్టీ, రోబో టిక్ సర్జరీలో నిపుణులైన నెల్లూరు జిల్లాకు చెందిన డా.కల్పన నాగ్పాల్రెడ్డిని సంప్రదించారు. ఆమె అనూ యాదవ్‌కు వైద్య పరీక్షలు జరిపి నాలుక భాగంలో పెరిగే థైరాయిడ్ గ్రంథి.. పెరిగాక గొంతు కిందికి రావాల్సి ఉంద ని, అయితే ఈ ప్రక్రియ జరగకపోవడంతో థైరాయిడ్ గ్రం థి నాలుక భాగంలోనే ఉండిపోయింద ని గుర్తించారు. దవడ భాగం తీయకుం డానే రోబోటిక్ సర్జరీని విజయవంతం గా నిర్వహించారు. థైరాయిడ్ గ్రంథిని ఉండాల్సిన స్థానంలోకి తీసుకొచ్చారు. ఇలాంటి వైద్య చికిత్సలకు దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆపోలో ఆస్పత్రిలో వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని డా.కల్పన నాగ్పాల్రెడ్డి తెలిపారు. సర్జరీ అనంతరం ఒక్క గంటలో రోగిని డిశ్చార్జ్ చేస్తామని ఆమె వివరించారు. కల్పన నాగ్పాల్రెడ్డి రోబోటిక్ సర్జరీలో ప్రఖ్యాతిగాంచారు. -
రోబోలతో గొంతు క్యాన్సర్, గురకకు చెక్
నూతన పద్ధతులతో ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చికిత్స సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే మొదటిసారిగా రోబోలతో గొంతు క్యాన్సర్, గురకకు చికిత్స చేసే నూతన పద్ధతులకు ఢిల్లీ అపోలో ఆస్పత్రి నాంది పలికింది. ఆస్పత్రిలో సీనియర్ కన్సల్టెంట్, రోబోటిక్ సర్జన్, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన డా.కల్పన శుక్రవారం ఈ విధానంలో విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. రోబోటిక్ సర్జరీ ద్వారా గురక, గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి దవడ భాగం తీయకుండానే.. నోటి ద్వారా రోబో లాంటి పరికరాలను పంపించి చికిత్స నిర్వహించారు. రోగులకు అవసరమైన చికిత్సకు సంబంధించిన విధానాన్ని ముందుగా కంప్యూటర్ ద్వారా యంత్రాలకు అందిస్తారు. అనంతరం రోబోను 3డీలో వీడియో ద్వారా పర్యవేక్షిస్తూ.. చికిత్సకు అవసరమైన తదుపరి విధానాలను కంప్యూటర్ ద్వారా అందిస్తారు. ఇలాంటి చికిత్సను మొట్టమొదటి సారిగా ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో తాను నిర్వహించినట్టు డా.కల్పన తెలిపారు. వైద్యానికి సంబంధించిన అన్ని రోబో పరికరాలు ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు. చికిత్స అనంతరం ఒక్కరోజులోనే బాధితులను డిశ్చార్జ్ చేస్తామని, చికిత్స ఖర్చులను సామాన్యులు సైతం భరించగలరని ఆమె పేర్కొన్నారు. డా.కల్పన హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, పుణేలో ఎంఎస్, అమెరికాలో ఫెలోషిప్, సియోల్‌లో రోబోటిక్ సర్జరీలో శిక్షణ పూర్తి చేసుకున్నారు.