లింగ్వల్ థైరాయిడ్‌కు రోబోటిక్ సర్జరీ
ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స
సాక్షి, న్యూఢిల్లీ: లింగ్వల్ థైరాయిడ్‌తో బాధపడుతున్న 18 ఏళ్ల యువతికి ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో అరుదైన శస్త్రచి కిత్స నిర్వహించారు. నేపాల్‌కు చెందిన అనూ యాదవ్ అనే యువతికి ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో ఈఎన్‌టీ, రోబో టిక్ సర్జరీలో నిపుణులైన నెల్లూరు జిల్లాకు చెందిన డా.కల్పన నాగ్‌పాల్‌రెడ్డిని సంప్రదించారు. ఆమె అనూ యాదవ్‌కు వైద్య పరీక్షలు జరిపి నాలుక భాగంలో పెరిగే థైరాయిడ్ గ్రంథి.. పెరిగాక గొంతు కిందికి రావాల్సి ఉంద ని, అయితే ఈ ప్రక్రియ జరగకపోవడంతో థైరాయిడ్ గ్రం థి నాలుక భాగంలోనే ఉండిపోయింద ని గుర్తించారు.
దవడ భాగం తీయకుం డానే రోబోటిక్ సర్జరీని విజయవంతం గా నిర్వహించారు. థైరాయిడ్ గ్రంథిని ఉండాల్సిన స్థానంలోకి తీసుకొచ్చారు. ఇలాంటి వైద్య చికిత్సలకు దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆపోలో ఆస్పత్రిలో వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని డా.కల్పన నాగ్‌పాల్‌రెడ్డి తెలిపారు. సర్జరీ అనంతరం ఒక్క గంటలో రోగిని డిశ్చార్జ్ చేస్తామని ఆమె వివరించారు. కల్పన నాగ్‌పాల్‌రెడ్డి రోబోటిక్ సర్జరీలో ప్రఖ్యాతిగాంచారు.