ఛండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(48) కడుపు నొప్పితో ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు ఇన్‌ఫెక్షన్ సోకిందని వైద్యులు నిర్ధారించారు కూడా. అయితే ఇప్పుడు ఆ ఇన్‌ఫెక్షన్‌కు కారణం ఏంటో బయటకు వచ్చింది.
పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్.. పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చే మురుగు వ్యర్థాలతో కూడిన నీటిని పంజాబ్ ముఖ్యమంత్రి నిరభ్యంతరంగా తాగారని, అందుకే ఆయనకు ఇన్‌ఫెక్షన్ సోకిందని వైద్యులు పేర్కొన్నట్లు సమాచారం. ఈ మేరకు.. ఆయనకు సంబంధించిన వీడియో కూడా ఒకటి వైరల్ అవుతోంది.
ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఆ ట్వీట్‌లో పార్టీ సభ్యుల నినాదాల మధ్య ఆయన గ్లాస్ నీటిని తీసుకుని తాగారు. రాజ్యసభ ఎంపీ, ప్రముఖ పర్యావరణవేత్త బాబా బల్బీర్ సింగ్ సుల్తాన్‌పూర్ లోధీలో చేపట్టిన కాళి బెన్ శుభ్రత కార్యక్రమంలోనిది ఆ వీడియో. అది జరిగిన వారంలోపే ఆయన ఆస్పత్రి పాలు కావడం విశేషం. అయితే ఆయన ఆస్పత్రి పాలుజేసింది ఆ నీరేనా? అన్నది నిర్ధారణ కావాల్సి ఉంది.
ਗੁਰੂ ਨਾਨਕ ਸਾਹਿਬ ਦੀ ਚਰਨ ਛੋਹ ਪ੍ਰਾਪਤ ਧਰਤੀ ਸੁਲਤਾਨਪੁਰ ਲੋਧੀ ਵਿਖੇ ਪਵਿੱਤਰ ਵੇਈਂ ਦਾ ਪਾਣੀ ਪੀਂਦੇ ਹੋਏ CM @BhagwantMann ਜੀ
— AAP Punjab (@AAPPunjab) July 17, 2022
ਪਵਿੱਤਰ ਵੇਈਂ ਨੂੰ ਸਾਫ਼ ਕਰਨ ਦਾ ਬੀੜਾ ਰਾਜ ਸਭਾ ਮੈਂਬਰ ਸੰਤ ਸੀਚੇਵਾਲ ਜੀ ਨੇ ਚੁੱਕਿਆ ਹੋਇਆ ਹੈ pic.twitter.com/4LnU0U66wQ
Comments
Please login to add a commentAdd a comment