ఢిల్లీ: తీహార్ జైలులో ఉన్న'అరవింద్ కేజ్రీవాల్'ను ఇప్పటికే ఓ సారి కలిసిన పంజాబ్ ముఖ్యమంత్రి 'భగవంత్ మాన్' మళ్ళీ కలవనున్నట్లు ఆప్ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఏప్రిల్ 30న తీహార్ జైలులో కలవనున్నట్లు సమాచారం.
గతంలో ఓ సారి కేజ్రీవాల్‌ను కలిసిన తరువాత భగవంత్ మాన్ మీడియాతో మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌ను చూసి నేను ఎమోషనల్ అయ్యానని చెప్పుకొచ్చారు. ఆయన్ను ఒక హార్డ్ కోర్ క్రిమినల్ మాదిరిగా ట్రీట్ చేస్తున్నారు. అతని తప్పు ఏమిటి? అతను మొహల్లా క్లినిక్‌లు కట్టడం అతని తప్పా? అంటూ ప్రశ్నించారు.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు ప్రచారం కోసం వివిధ ప్రాంతాలను సందర్శించాల్సిందిగా కేజ్రీవాల్ గతంలో తనను కోరారని పంజాబ్ ముఖ్యమంత్రి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న ఆమ్ ఆద్మీ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా అవతరించనుందని ఆయన అన్నారు. ఢిల్లీ ప్రజల గురించి కేజ్రీవాల్ ఆందోళన చెందుతున్నారని, వారికి సబ్సిడీలు అందుతున్నాయా అని నిరంతరం ఆరా తీస్తున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment