ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కలకలం! | Suspicious object found at Delhi airport | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కలకలం!

Published Thu, Sep 21 2017 1:00 PM | Last Updated on Fri, Sep 22 2017 10:02 AM

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కలకలం!

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కలకలం!

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీ ఎయిర్‌పోర్టులో కలకలం రేగింది. ఇక్కడి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడిని భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టగా ఓ అనుమానిత వస్తువును గుర్తించారు. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. అనుమానిత వస్తువులతో విమానం ఎక్కేందుకు యత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా అనుమానంగా కనిపిస్తే తమకు చెప్పాలని సూచించారు.

ఎయిర్‌పోర్టు అధికారులు మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికుడు ఇండిగో విమానంలో ప్రయాణించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే భద్రతా సిబ్బంది అనుమానంగా కనిపిస్తున్న ఓ ప్రయాణికుడిని తనఖీ చేయగా అతడి వద్ద ఓ ప్రమాద వస్తువు లభ్యమైనట్లు చెప్పారు. చూసేందుకు ట్యాబ్, పెద్ద స్మార్ట్ ఫోన్ తరహాలో కనిపిస్తున్న ఆ వస్తువు పేలుడు సంబంధిత పదార్థంగా భావించినట్లు చెప్పారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement