
లవ్ ఫెయిల్యూర్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ సతీష్‌గౌడ్ సూచించారు.
మన్సూరాబాద్: ఇంట్లో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని లవ్ ఫెయిల్యూర్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ సతీష్‌గౌడ్ సూచించారు. ఎల్‌బీనగర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ పెళ్లికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదని ఇటీవల ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిందన్నారు.
ఆ జంటకు కౌన్సెలింగ్ చేశామని తెలిపారు. వారి ఇంట్లో పెద్దలకు నచ్చజెప్పి ఈ నెల 10న ఆర్య సమాజ్‌లో వివాహం జరిపించినట్లు తెలిపారు. ప్రేమే జీవితం కాదనే సత్యాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఇటీవల ప్రేమజంటల ఆత్మహత్యలు పెరిగిపోయాయని, వీటిని నిరోధించటానికి అసోసియేషన్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రేమికులు 81065 87621 నంబర్‌ను సంప్రదిస్తే ఇంట్లోని పెద్దలను ఒప్పించి పెళ్లి జరిపిస్తామని ఆయన పేర్కొన్నారు.