మంచిర్యాల జిల్లాలో ఓ యువజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి అటవీ ప్రాంతంలో ఓ యువజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. బాపు, లక్ష్మక్కలు వేర్వేరు మండలాలకు చెందిన వారు. వీరిలో ఒకరిది బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి. బంధువులు కావడంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెద్దలకు తెలుస్తుందనే ఆందోళనతో అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.