భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం పట్టణ శివారు గంగారం గ్రామంలో ప్రేమికుల జంట అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. భద్రాచలంలోని ముదిరాజ్ బజార్‌కు చెందిన రొయ్యల జగదీష్ (19) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పట్టణానికే చెందిన నైషా (13) ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. వీరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఈ నెల 4న సాయంత్రం నైషా ట్యూషన్‌కు వెళ్తున్నాని ఇంట్లో చెప్పి బయటికి వెళ్లింది. రెండు రోజులైనా నైషా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు సోమవారం రాత్రి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో గంగారం ఊరి శివారులో చీరతో ఒకే ఉరికి వేలాడుతున్నజంటను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై మురళి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృత దేహాలను వారి కుటుంబ సభ్యులు గుర్తించారు. మృత దేహాలు కుళ్లిపోయే స్థితిలో ఉండటంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన రాత్రే వారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఆత్మహత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమజంట ఆత్మహత్య
Published Tue, Jul 7 2015 7:47 PM | Last Updated on Sun, Sep 3 2017 5:04 AM