Lovers Committed Suicide Before Marriage in Annamaya District - Sakshi
Sakshi News home page

ప్రేమికుల ఆత్మహత్య

Published Mon, Aug 21 2023 1:12 AM | Last Updated on Mon, Aug 21 2023 9:16 PM

- - Sakshi

వైఎస్సార్: వారంలో అమ్మాయికి వివాహం చేసేలా పెద్దలు నిశ్చయించారు. అంతలోపే అమ్మాయి ప్రేమికుడితో కలిసి వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం మానేవారిపల్లి పంచాయతీ చిట్టెంవారిపల్లికు చెందిన బొడె కళ్యాణి(17) తిరుపతి సమీపంలోని భాకరాపేట అడవిలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. రామసముద్రం మండలం మానేవారిపల్లి పంచాయతీ చిట్టెంవారిపల్లి గ్రామానికి చెందిన రమణ, రజినిల కుమార్తె బి.కల్యాణి(17) చిత్తూరు జిల్లా పుంగనూరులోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

అయితే అదే కళాశాలలోనే చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం లద్దిగం గ్రామానికి చెందిన యుగంధర్‌(17) కూడా చదువుతున్నాడు. వారిద్దరూ కలిసి ప్రేమలో పడ్డారు. ఈ నేపథ్యంలో అమ్మాయికి వివాహం చేయాలని కుటుంబీకులు నిశ్చితార్థం చేశారు. ఈ నెల 26న వివాహం జరగాల్సి ఉండగా కల్యాణి శుక్రవారం నుంచి కనిపించకుండా పోయింది. చుట్టు పక్కల, బంధువుల ఊర్లలో విచారణ చేసినా ఆచూకీ లభించలేదు.

ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు శనివారం రామసముద్రం పోలీస్‌స్టేషన్‌లో అదృశ్యం అయినట్లు ఫిర్యాదు చేశారు. అయితే ఆదివారం తిరుపతి జిల్లాలోని భాకరాపేట ఘాట్‌ రోడ్డులోని ఫారెస్టు చెక్‌పోస్టు వద్ద అడవిలో యుగంధర్‌, కల్యాణిలు చెట్టుకు ఉరివేసుకొని వేలాడుతుండటం పశువుల కాపరుల కంట పడ్డారు. సమాచారం తెలుసుకున్న అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చంద్రగిరి సీఐ రాజశేఖర్‌, ఇన్‌చార్జి ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా కల్యాణికి ఇంక వారంలో వివాహం ఉండగా.. ఇలా ఆత్మహత్య చేసుకోవడంపై కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు.

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement