ప్రేమికురాలిని కాపాడబోయి..
Published Mon, Jan 2 2017 11:18 AM | Last Updated on Tue, Sep 5 2017 12:12 AM
భీమవరం: పశ్చిమగోదారి జిల్లా భీమవరం మండలం యనమదుర్రు డ్రెయిన్‌లో సోమవారం ఉదయం ఓ యువకుడి మృతదేహం లభించింది. ఈ మృతదేహం మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోబోతున్న తన ప్రేయసిని కాపాడేందుకు డ్రెయిన్‌లో దూకిన యువకుడిదిగా పోలీసులు గుర్తించారు. వివరాలు.. సుంకర పద్దయ్య వీధికి చెందిన పి. సత్యస్వరూప(18), చిన్నఅప్పారావుతోటకు చెందిన కనిమిరెడ్డి మహేష్(25) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం ఇంట్లో తెలియడంతో అమ్మాయి తరఫు వారు యువకుడిని హెచ్చరించారు. ఈ క్రమంలో కొంత కాలంగా వీరిద్దరి మధ్య మాటలు లేవు.
ఈ నేపథ్యంలో గత నెల 31(శనివారం) సాయంత్రం లంకపేట సమీపంలో వీరిద్దరు కలుసుకున్నారు. మాట మాట పెరిగి గొడవ పడ్డారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిన సత్యస్వరూప వంతెన పై నుంచి డ్రెయిన్‌లోకి దూకింది. వెనుకనే బైక్‌పై వచ్చిన మహేష్ ఆమెను రక్షించేందుకు అందులోకి దూకాడు. ఇది గుర్తించిన స్థానికులు ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టిన లాభం లేకపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. సోమవారం ఉదయం మహేష్ మృతదేహం లభించింది. స్వరూప కోసం గాలింపు చర్యలు కొన సాగుతున్నాయి.
Advertisement
Advertisement