
తిరుపతిలో ప్రేమజంట ఆత్మహత్య
చిత్తూరు జిల్లా : తిరుపతిలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. నగరంలోని ఓ హోటల్‌లో ఉరివేసుకుని మౌనిక, రంజిత్ ఆత్మహత్య చేసుకున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరు గ్రామానికి చెందిన మౌనిక(21)కు రెండు నెలల క్రితం పెళ్లి అయింది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న మౌనిక వరంగల్ జిల్లా పత్రా మండలం మధుగులగూడెం గ్రామానికి చెందిన రంజిత్‌తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. రంజిత్ అటవీశాఖలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరికీ ఆన్‌లైన్‌లో పరిచయం ఏర్పడింది. జనవరి 22న వీరిద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయారు.
ఈ నెల 13న తిరుపతి బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్‌లో రూం తీసుకున్నారు. అప్పటి నుంచి రూమ్‌లో ఎలాంటి అలికిడి లేదు. అనుమానం వచ్చిన హోటల్ యాజమాన్యం ఈ సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. తలుపులు పగలగొట్టి చూడగా..ఇద్దరూ ఉరికి వేలాడుతూ విగత జీవులుగా కనిపించారు. రంజిత్‌కు ఇదివరకే పెళ్లి కాగా, భార్య చనిపోయింది. అతనికి ఓ కూతురు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.