పాలమూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.
మహబూబ్‌నగర్ జిల్లా: పాలమూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దామరగిద్ద మండలం లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన శంకరమ్మ(14) అనే బాలిక శనివారం సాయంత్రం గ్రామసమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఈ విషయం తెలుసుకున్న తిరుమల్ప(21) అనే యువకుడు శనివారం అర్ధరాత్రి సమయంలో అదే ప్రాంతంలో మరో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరూ ప్రేమికులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని గ్రామస్తులు చెబుతున్నారు. ఇద్దరి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.