తల్లిదండ్రులతో కలిసి దీక్షకు కూర్చున్న రోహిణి
మహబూబ్‌నగ,బల్మూర్ (అచ్చంపేట): ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుంటానని గర్భం చేసి.. ఇప్పుడు కులం పేరుతో అన్యాయం చేస్తున్నాడని ప్రియురాలు ప్రియుడి ఇంటి ఎదుట తల్లిదండ్రులతో కలిసి బుధవారం దీక్ష చేపట్టిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. బాధితురాలి కథనం మేరకు.. మండలంలోని అనంతవరం గ్రామానికి చెందిన రోహిణి(25), అదే గ్రామానికి చెందిన సురేశ్‌రెడ్డి ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకోగా రెండేళ్ల క్రితం గర్భం దాల్చింది. దీంతో అచ్చంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అబార్షన్ చేయించాడు. తీరా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావటంతో మీరు దళితులని.. ముఖం చాటేసి మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు.
దీంతో జిల్లాకేంద్రంలోని సఖి కేంద్రంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కౌన్సెలింగ్ ఇచ్చి గడువు ఇచ్చారని.. ఈలోపే మరో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తెలియటంతో తనకు న్యాయం చేయాలని తల్లిదండ్రులతో కలిసి దీక్షకు పూనుకున్నట్లు బాధితురాలు వాపోయింది. కాగా రోహిణి తనపై అసత్య ఆరోపణలు చేస్తోందని సురేశ్‌రెడ్డి తెలిపారు. అధికారులకు తప్పడు సమాచారం అందించి తనను మానసిక వేదనకు గురిచేయటంతో ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడి ఈ మధ్యనే కొలుకున్నట్లు చెప్పకొచ్చాడు. ఈ విషయమై ఎస్‌ఐ వీరబాబును వివరణ కోరగా బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇరు కుటుంబాలను విచారించామన్నారు. లాక్‌డౌన్ పర్యవేక్షణ నేపథ్యంలో వారికి రెండురోజుల గడువు ఇచ్చామని తెలిపారు. దీక్షకు కూర్చున్న విషయం తెలియదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment