అచ్చంపేట(మహబూబ్‌నగర్ జిల్లా): ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతికి తనే కారణమని పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టడంతో యువకుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శనివారం మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నడింపల్లికి చెందిన సరస్వతి (18), మల్లయ్య(21)లు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే సరస్వతి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. వేరే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని సరస్వతి తల్లిదండ్రులతో ఘర్షణ పడి శుక్రవారం క్రిమిసంహారక మందు తాగింది. ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ఆమెకు ప్రాథమిక చికిత్స చేసి పరిస్థితి విషమంగా ఉందని చెప్పి మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లాలని చెప్పారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించింది.
ఈ నేపథ్యంలో శనివారం గ్రామానికి చెందిన కొందరు పెద్దలు సరస్వతి మరణానికి కారణమని భావించి మల్లయ్యను పంచాయతీకి పిలిపించారు. పంచాయతీలో మల్లయ్య ఆమె మరణానికి తాను కారణం కాదని చెప్పాడు. అనంతరం ఇంటికి వెళ్లిన మల్లయ్య మధ్యాహ్నం క్రిమిసంహారక మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతడిని అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో మహబూబ్‌నగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు.
ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు!
Published Sat, Mar 21 2015 10:56 PM | Last Updated on Sat, Sep 2 2017 11:11 PM
Advertisement
Advertisement