
సాక్షి, విజయనగరం: గరుగుబిల్లి మండలం తోటపల్లి బ్యారేజ్‌లోకి దూకి రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట మృతదేహాలు లభ్యమయ్యాయి. తోటపల్లి రిజర్వాయర్ సమీపంలో మృతదేహాలను గుర్తించారు. కాగా సోమవారం నాగావళి నదిలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. విషయం తెలిసిన పోలీసులు ఈతగాళ్ల సాయంతో ప్రేమజంట కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 42 గంటల తరువాత మృతదేహాలు నదిలో తేలాయి. ఒకరినొకరు చున్నీతో కట్టుకొని ప్రేమజంట నదిలో దూకారు. యువకుడు రాకేష్ స్వగ్రామం బొబ్బిలి కాగా.. ప్రియురాలు కురుపాంకు చెందిన బాలికగా పోలీసులు తెలిపారు.
చదవండి: బ్యారేజ్‌లోకి దూకి ప్రేమజంట ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment