
సాక్షి, వైఎస్సార్ జిల్లా : తమ వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన వైఎస్సార్ జిల్లా వల్లూరు మండలం గంగాయపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం వన్‌టౌన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రమేష్.. అదే జిల్లాకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. వీరి వివాహానికి రమేష్ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. రమేష్‌కు బలవంతంగా వేరే అమ్మాయితో వివాహం కుదుర్చారు. వచ్చే నెలలో పెళ్లి చేయాలని ముహూర్తం పెట్టుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన రమేష్, ప్రియురాలితో కలిసి సోమవారం అర్థరాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాలను పోస్ట్ మార్టంకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment