valluru
-
అమ్మానాన్నల మాట.. సివిల్స్‌కు బాట
చదువుకోవాలి.. చదువుకొని తన కాళ్లపై తాను నిలబడి, ఆదర్శంగా ఉండాలని చెప్పిన అమ్మ మాట.. సమాజంలో ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రజాసేవలో ఉండాలని చూపిన నాన్న బాట.. ఇలా తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఆలోచనలో పడేశాయి. అప్పుడే తాను ఒక ఉన్నతాధికారిగా ప్రజాసేవ చేయాలని సంకల్పంతో 24 ఏళ్లకే ఐఏఎస్ సాధించారు. దేశంలోనే యువ ఐఏఎస్‌లలో ఒకరిగా నిలిచి పాలనలో పరుగులు పెట్టిస్తున్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సక్సెస్ స్టోరీ మీకోసం..బాల్యం.. విద్యాభ్యాసంవల్లూరు క్రాంతి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌ని కర్నూలు పట్టణం. తండ్రి డా.రంగారెడ్డి, తల్లి డాక్టర్ లక్ష్మి. ఇద్దరూ కూడా వైద్యులే. అక్క కూడా వైద్యురాలే, అమెరికాలో స్థిరపడ్డారు. ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు కర్నూల్లోనే చదువుకున్నారు. ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుకున్నారు. బీటెక్ ఢిల్లీ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) లో మెకానికల్ ఇంజనీర్ పూర్తి చేశారు.మూడో ప్రయత్నంలోనే..అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఓ వైపు వచ్చిన జాబ్‌ను వదలకుండా ఉద్యోగం చేసుకుంటూ సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. తొలిసారిగా 2013లో సివిల్స్‌కు హాజరై 562 ర్యాంకు రావటంతో (ఐఆర్టీఎస్) ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్‌లో ఉద్యోగం వచ్చింది. అయినా నిరాశ చెందకుండా రెండోసారి 2014లో సివిల్స్ పరీక్ష రాసి 230 ర్యాంకు సాధించి, ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌లో ఉద్యోగం సాధించారు. ఐఏఎస్ కావాలని పట్టుదల, నాన్న సూచన సలహా మేరకు 2015లో జరిగిన సివిల్స్‌లో 65 ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపిక అయ్యారు. 24 సంవత్సరాలకే ఐఏఎస్ సాధించి యువ ఐఏఎస్‌గా నిలిచారు. ముస్సోరిలో ఐఏఎస్ శిక్షణ పూర్తి చేసి, 2016 బ్యాచ్ తెలంగాణ క్యాడర్‌కు ఎంపిక అయ్యారు.శిక్షణలో క్షేత్రస్థాయి సమస్యలుముస్సోరిలో ఐఏఎస్ శిక్షణ తీసుకోవడం జరిగింది. శిక్షణలో భాగంగా వారం రోజుల పాటు ఓ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ప్రజాసేవలో ఎలా ముందుకు సాగాలో నేర్పించారు. అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు తెలుసుకున్నాను. ట్రెక్కింగ్ నేర్పించారు.కొత్త ఆశల ఉగాది అంటే ఇష్టంపండుగలలో కొత్త ఆశ ఆశయాలతో ప్రారంభమయ్యే ఉగాది పండుగ అంటే నాకెంతో ఇష్టం. చదువుతోపాటు ఆటలు కూడా ఆడేవాళ్లం.ప్రతీ విజయం వెనుక ఎంతో కష్టంప్రతి ఒక్కరూ తమ జీవితంలో ముందుగానే ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి. ఎంత కష్టం వచ్చినా నిరాశ చెందకుండా లక్ష్యం వైపు ముందుకు సాగాలి. లక్ష్యం సాధించే వరకు అదే పనిగా ఉంటూ ఆత్మస్థైర్యం, నమ్మకంతో ఉండాలి. ప్రణాళికబద్ధంగా సిలబస్ ప్రిపేర్ అవుతూ పరీక్షలకు సన్నద్ధం కావాలి. విజయం అనేది ఊరికే రాదు. ప్రతీ విజయం వెనుక ఎంతో కష్టం ఉంటుందనేది గుర్తు పెట్టుకోవాలి. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కాకుండా సరైన ప్రణాళికతో ముందుకెళ్లాలి.అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే..ఇంట్లో అందరూ సైన్స్ పై ఎక్కువగా ఇష్టం.. తనకు మాత్రం మ్యాథ్స్‌పై ఇష్టం ఎక్కువ. తనకు చిన్నప్పటి నుంచే లీడర్ షిప్ లక్షణాలపై ఇష్టం. ప్రజలకు సేవ చేయాలనే తపన ఉండేది. ఒక ఉన్నత స్థానంలో ఉంటేనే ప్రజాసేవ చేయగలుగుతామనే ఆలోచన, చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న చెప్పిన మాట లు మ్యాథ్స్ ఉన్న ఇంట్రెస్ట్‌తోనే ఐఏఎస్ సాధించేలా చేశాయి. ప్రైవేటుగా ఉండి ఎంత సంపాదించినా సరైన విధంగా ప్రజాసేవ సాధ్యం కాదు. అందుకే ఉన్నతమైన ఐఏఎస్‌ను సాధించడం జరిగింది. నిర్మల్ జిల్లాలో ట్రైనీగా, మహబూబ్ నగర్ జిల్లా ప్రత్యేక అధికారిగా, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్, జోగులాంబ కలెక్టర్‌గా నిర్వహించి ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా కొనసాగుతున్నారు.భార్యాభర్తలిద్దరూ కలెక్టర్లువల్లూరి క్రాంతి సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు. భర్త ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి జిల్లా కలెక్టర్‌గా కొనసాగుతున్నారు. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. వీరికి పాప(ఆర్యన్) ఉంది. -
రైతులు వ్యవసాయ సూచనలు పాటించాలి!
జోగులాంబ: ఆలస్యంగానైనా వర్షాలు సమృద్ధిగా కురవడంతో జిల్లాలో పంటల సాగుకు ఆశాజనకమైందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శుక్రవారం ఐడీవోసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ ఏడాది జూన్‌లో సాధారణ వర్షపాతం కంటే 23శాతం తక్కువగా వర్షపాతం నమోదైందన్నారు. అయితే జూలైలో జిల్లా వ్యాప్తంగా 73.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 52.8 మి.మీ. నమోదైందన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో వానాకాలం పంటల సాగుకు ఇబ్బందులు లేవన్నారు. రైతులందరు కూడా వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన మేరకు పంటలను సాగుచేసుకోవాలన్నారు. గతేడాది వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా 4,01,764 ఎకరాలలో వివిధ పంటలు సాగు చేయగా, అదే ఏడాది జూలైలో 1.75లక్షల ఎకరాలలో వివిధ పంటలు సాగయ్యాయన్నారు. ఈ ఏడాది జూలై 20వ తేదీ నాటికి కేవలం 83,041ఎకరాలలో మాత్రమే వివిధ రకాల పంటలను సాగుచేశారన్నారు. ఆలస్యంగా వర్షాలు కురవడంతోనే పంటలు సాగు ఆలస్యమైందన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రైతులకు ఇబ్బందులు తొలగాయని వరి, మిరప, మొక్కజొన్న, రాగి, కొర్ర, వేరుశనగ, ఆముదాలు, పొద్దుతిరుగుడు, కందులు వంటి పంటలు సాగుచేసేందుకు అనుకూలంగా ఉంటాయన్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వరి, ఆముదం, రాగి, కొర్ర, పొద్దుతిరుగుడు, మిర్చి పంటలు వేసుకోవచ్చన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటాం జిల్లా వ్యాప్తంగా నష్టపోయిన సీడుపత్తి పంట సాగుచేసిన రైతులకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. నివేదిక వచ్చిన తరువాత దానిని ప్రభుత్వానికి పంపి నష్టపోయిన రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే దీనిపై సీడుపత్తి కంపెనీలు, రైతులు, అధికారులతో సమీక్షించినట్లు వివరించారు. అప్రమత్తంగా ఉండాలి ముసురు వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో నివాసం ఉండరాదని, దీనిపై ఇప్పటికే మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా పిడుగుపాటుకు గురి కాకుండా ప్రజలు బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద, నీటికుంటలకు దూరంగా ఉండాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన జాగ్రత్తలు పాటించాలన్నారు. సమావేశంలో డీఏఓ గోవిందునాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్‌పై విస్తృత ప్రచారం ఎలక్ట్రానిక్ ఓటింగ్‌పై ప్రజలకు విస్తృతమైన ప్రచారం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం ప్రదర్శన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈవీఎం యంత్రాలలో పదిశాతం యంత్రాలను వీవీ ప్యాట్లను సిబ్బంది శిక్షణ, ఓటర్లలో అవగాహన కార్యక్రమాల కోసం వినియోగించనున్నట్లు తెలిపారు. ఓటు ప్రతిఒక్కరి హక్కు అని, తప్పకుండా వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఈమేరకు జిల్లాలోని గద్వాల, అలంపూరు తహసీల్దార్ కార్యాలయాలు, గద్వాల ఆర్డీవో కార్యాలయం, కలెక్టర్ కార్యాలయంలో యంత్ర ప్రదర్శన కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ వరలక్ష్మి సురేష్, రఘు, డీటీ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అనంతపురం ఎద్దులు ఫస్ట్
వల్లూరు: కడప– తాడిపత్రి ప్రధాన రహదారి పక్కన వల్లూరు మండలంలోని పాపాఘ్ని నగర్ వద్ద వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి తిరునాల మహోత్సవంలో భాగంగా గురువారం నిర్వహించిన బండలాగుడు పోటీలలో అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం చాగల్లుకు చెందిన వై ఆదినారాయణ ఎద్దులు 3986 అడుగులు బండను లాగి మొదటి స్థానంలో నిలిచాయి. మొత్తం 23 జతల కాండ్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. కమిటీ సభ్యులు చిన్న ఓబులేసు పోటీలను ప్రారంభించారు. ►వల్లూరు మండలం చిన్న నాగిరెడ్డి పల్లెకు చెందిన నారంగారి శంకర్‌రెడ్డి ఎద్దులు 3863 అడుగులు బండను లాగి ద్వితీయ స్థానంలో, నంద్యాల జిల్లా రుద్రవరం మండలం అప్పనపల్లెకు చెందిన గురు చరణ్ ఎద్దు మరియు దువ్వూరు మండలం దాసరిపల్లెకు చెందిన నరేష్ ఎద్దు కలిసి 3609 అడుగులు బండను లాగి మూడవ స్థానంలో నిలిచాయి. ►రాజుపాలెం మండలం కూలూరుకు చెందిన మారం రమేష్ ఎద్దులు 3500 అడుగులు లాగి నాలుగో స్థానంలో, ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం వంగపాడుకు చెందిన కైపా వెంకట రమణారెడ్డి ఎద్దులు 3423 అడుగులు లాగి ఐదవ స్థానంలో, కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం గుడిపాడుకు చెందిన వెంకట రామిరెడ్డి ఎద్దులు 3263 అడుగులు లాగి ఆరవ స్థానంలో, ఖాజీపేట మండలం ముత్తలూరు పాడుకు చెందిన ధవనం ఓబన్న ఎద్దులు 3151 అడుగులు లాగి ఏడవ స్థానంలో నిలిచాయి. ►మొదటి బహుమతి రూ. 20 వేలను ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర ఛైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, రెండవ బహుమతి రూ. 15, 116 నారంగారి శంకర్‌రెడ్డి, మూడవ బహుమతి రూ. 10,016 నాగుల గార్ల రమణ, నాలుగవ బహుమతి రూ. 5, 016 పుత్తా మసాన్, ఐదవ బహుమతి రూ. 3, 016 వై బయన్న, ఆరవ బహుమతి రూ. 2,016 ఆది వేమయ్యలు వితరణగా అందచేశారు. -
ప్రేమ జంట ఆత్మహత్య
సాక్షి, వైఎస్సార్ జిల్లా : తమ వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన వైఎస్సార్ జిల్లా వల్లూరు మండలం గంగాయపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం వన్‌టౌన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రమేష్.. అదే జిల్లాకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. వీరి వివాహానికి రమేష్ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. రమేష్‌కు బలవంతంగా వేరే అమ్మాయితో వివాహం కుదుర్చారు. వచ్చే నెలలో పెళ్లి చేయాలని ముహూర్తం పెట్టుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన రమేష్, ప్రియురాలితో కలిసి సోమవారం అర్థరాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాలను పోస్ట్ మార్టంకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. -
అమరావతి బస్సు ఢీ.. ఇద్దరు మృతి
సాక్షి, వైఎస్సార్ కడప : ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మృత్యువాత పడిన ఘటన వైఎస్సార్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. అమరావతి బస్సు ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఓబుల్‌రెడ్డి, భార్గవి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. చిన్న మండ్యం మండలం వల్లూర్ క్రాస్ సమీపంలో ఈ ఘటన జరిగింది. డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న భార్గవి పరీక్ష రాసి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. భార్గవి స్వస్థలం చిత్తూరు జిల్లా గుర్రంకొండ. -
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
కమలాపురం: కమలాపురం రైల్వే గేటు సమీపంలోని తూర్పు వైపునకు ఉన్న 283/2–3 కిలోమీటరు రాయి మధ్య ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ సాదక్ వలి తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. వల్లూరు మండలం వెంకటాపురం వీవర్స్ కాలనీకి చెందిన దండే నరసింహులు (50) సోమవారం తెల్లవారుజామున ఈ అఘాయిత్యం చేసుకున్నాడు. ఆయన కుడి భాగంతోపాటు తల వెనుక భాగం బాగా దెబ్బతింది. ముఖం ఒక వైపు బాగుండటంతో దుగ్గాయపల్లె వాసులు నరసింహులుగా గుర్తించారు. ఆయన కొన్నేళ్లుగా సీకే దిన్నె మండలంలోని ఊటుకూరు సమీపంలోని వడ్డీలకాలనీలో సూరి హోటల్లో పని చేస్తూ జీవనం సాగించే వాడు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియాల్సి ఉంది. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. నరసింహులుకు భార్య నాగలక్షుమ్మ, కుమార్తె ఉన్నారు. -
ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ
కడప అర్బన్: కడప–కమలాపురం రహదారిలోని ఎయిర్‌పోర్టు సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ట్రాక్టర్‌ను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. కమలాపురం మండలం తురకపల్లె గ్రామానికి చెందిన ఆంజనేయులు తన కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు దాదాపు 20 మంది చింతకొమ్మదిన్నెలోని గంగమ్మ జాతరలో మొక్కులు తీర్చుకునేందుకు ఆదివారం ఉదయం ట్రాక్టర్లో బయలుదేరి వెళ్లారు. అక్కడ మొక్కు తీర్చుకుని విందు భోజనాలు ఆరగించారు. మధ్యాహ్నం తిరుగు ప్రయాణమయ్యారు. సంఘటన స్థలానికి చేరుకునే సరికి వెనుకవైపు నుంచి ట్రాక్టర్‌ను లారీ వేగంగా వచ్చి ఢీకొనడంతో బోల్తా పడింది. ట్రాక్టర్‌లోని ప్రయాణికులంతా చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారు. ఏం జరిగిందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రమాదం జరిగిన కొంతసేపటికి అటుగా వెళుతున్న వాహనదారులు 108కు సమాచారం అందించారు. 108 వాహనాలు వచ్చి క్షతగాత్రులను రిమ్స్‌కు తరలించారు. వీరిలో తురకపల్లె గ్రామానికే చెందిన పలవల సుబ్రమణ్యం (17) రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయపడిన వారిలో గంగయ్య, ఆంజనేయులు, సుబ్బమ్మ, హరిప్రసాద్, సాయి కీర్తన, జగదీష్,ఈశ్వరమ్మ, అంజనమ్మ, అంజనాదేవి, రామాంజనేయులు అలియాస్ ఆంజనేయులు, వేణుగోపాల్, చౌడమ్మ, నాగలక్ష్మి, శ్రీరాములు, సునీత, గంగిరెడ్డి, జైపాల్‌రెడ్డి, అయ్యవార్లు ఉన్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సంఘటనా స్థలానికి రూరల్ సీఐ బీవీ శివారెడ్డి, వన్‌టౌన్ సీఐ టీవీ సత్యనారాయణ, ఎస్ఐలు, సిబ్బంది చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
వానరానికి అంత్యక్రియలు
వల్లూరు (ఆచంట) : వానరాలను దైవ స్వరూపంగా భావిస్తారు కొందరు. ఆచంట మండలం వల్లూరులో ప్రమాదవశాత్తూ చనిపోయిన ఓ వానరానికి అంతిమయాత్ర, అంత్యక్రియలు ఘనంగా నిర్వహించడంతోపాటు అన్నసంతర్పణ చేసి కోతిపై తమ భక్తి చాటుకున్నారు. ఈనెల 5న వల్లూరులోని జెడ్పీ హైస్కూల్ మైదానంలో కొబ్బరి చెట్టుపై నుంచి పడి ఓ వానరానికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన గ్రామస్తులు దాన్ని స్థానిక పశువైద్యశాలలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. దీంతో చలించిన గ్రామస్తులు అదే రోజు అంతిమ యాత్ర నిర్వహించి ఖననం చేశారు. దాని స్మృత్యర్థం అన్న సంతర్పణ చేయాలని నిర్ణయించుకుని తలో చేయి వేశారు. జెడ్పీ హైస్కూల్ ఆవరణలో బుధవారం అన్న సంతర్పణ చేశారు. ఈ కార్యక్రమాల్లో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
పేస్ కాలేజి విద్యార్థిని ఆత్మహత్య
ఒంగోలు: పట్టణంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజికి చెందిన విద్యార్థిని మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలోని పేస్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న నాగలక్ష్మీ అనే విద్యార్థిని కాలేజి హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా సోమవారం తన స్నేహితుడితో కలిసి బైక్ పై వెళ్తున్న నాగలక్ష్మిని పోలీసులు ఆపి ప్రశ్నించినట్లు తెలిసింది. ఆ రాత్రే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాగలక్ష్మి స్వగ్రామం పొదిలి మండలం తల్లమల్లగా తెలిసింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
నా ఓటమికి దేశం నేతల కుట్ర
వల్లూరు (ఆచంట) :గత ఎన్నికల్లో తన ఓటమికి తెలుగుదేశం పార్టీ నేతలే కృషి చేశారని ఆ పార్టీకి చెందిన ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆరోపించారు. పార్టీలో ఉంటూ నమ్మక ద్రోహం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.11 కోట్లతో నిర్మించనున్న వ ల్లూరు-ఇలపకుర్రు, రూ.12 కోట్లతో నిర్మించనున్న కొడమంచిలి-సిద్ధాంతం ఆర్ అండ్‌బీ రహదారి పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వల్లూరు, ఆచంటలో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ తన ఓటమికి కృషి చేసిన నమ్మక ద్రోహులు ప్రత్యర్థి పార్టీలోకి వెళ్లి ఓటమికి ప్రయత్నిస్తే బాధపడేవాడినే కాదన్నారు. రూ.18 కోట్లతో చేపట్టిన మార్టేరు-కోడేరు ఆర్అండ్బీ రహదారి విస్తరణ పనులకు ఆటంకాలు కలిగిస్తున్న వారు భ విష్యత్‌లో బాధ పడతారని ఎమ్మెల్యే పితాని అన్నారు. ఆరునూరైనా మార్టేరు-కోడేరు ఆర్అండ్బీ రహదారి విస్తరణ పనులను పూర్తి చేసి తీరతానని స్పష్టం చేశారు. అభివృద్ధిని అడ్డుకుంటే వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు. కోడేరు-గన్నవరం మధ్య వారధి నిర్మాణానికి కృషి ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ వశిష్ట గోదావరిపై కోడేరు నుంచి గన్నవరం వరకూ వారధి నిర్మించడానికి కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యేల చెప్పారు. ప్రస్తుతం అయోధ్యలంక- పుచ్చల్లంకలను కలిపే వారధి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయన్నారు. ఆలస్యమైనా కోడేరు-గన్నవరం వంతెన నిర్మాణానికి నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కోనపోతుగుంట పేరు మార్చండి ఆచంట పంచాయతీ పరిధి కోనపోతుగుంటలో రూ.18 లక్షలతో నిర్మించిన బీసీ కమ్యూనిటీ భవనాన్ని ఎమ్మెల్యే పితాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోనపోతుగుంట పేరును మార్చాలని ఎమ్మెల్యే పితాని గ్రామస్తులకు సూచించారు. అందరికీ అమోదయోగ్యమైన పేరును సూచించాలని ఆయన కోరారు. నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే పితానిని గ్రామస్తులు సత్కరించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ మేకా పద్మకుమారి, జెడ్పీటీసీ బండి రామారావు, ఆర్అండ్బీ ఈఈ విజయరత్నం, డిఈ ఎ శ్రీనివాస్, ఏఈ టి.ప్రసాద్, ఇన్చార్జి తహసిల్దారు ఆర్వీ కృష్ణారావు, ఎంపీడీవో సంగాని వెంకటేశ్వరరావు, వల్లూరు, ఆచంట, కందరవల్లి, పెదమల్లం, క రుగోరుమిల్లి సర్పంచ్‌లు బండి హైమావతి, గుండుబోయిన సతీష్, కె వీరాస్వామి, ముత్తాబత్తుల రామచంద్రుడు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గెద్దాడ సన్యాసిరావు, డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడు కండిబోయిన సత్యనారాయణ, మండల టీడీపీ అధ్యక్షుడు కేతా మీరయ్య, మాజీ అధ్యక్షుడు మేకా జానకిరామయ్య, పార్టీ ప్రధాన కార్యదర్శి ఏడిద శ్రీనివాస్ పాల్గొన్నారు. -
జ్ఞాపకాల జాడలలో ఓ క్రాంతదర్శి
వి.బి. రాజుగా సుప్రసిద్ధులైన వల్లూరు బసవరాజు ఇరవయ్యో శతాబ్దంలో తెలుగువారి చరిత్రను ప్రభావితం చేసిన అగ్రనేతలలో ఒకరు. గుంటూరు జిల్లాలోని వల్లూరు గ్రామం లోని సాధారణ కుటుంబంలో 1914లో జన్మించిన రాజు స్వయంకృషితో ఒక గొప్ప నాయకుడుగా ఎదిగారు. ఇంజనీరుగా వృత్తి కొనసాగిస్తూనే హైదరాబాదులో కార్మికోద్యమానికి పునాదులు వేశారు. హైదరాబాద్ విముక్తి పోరాటానికీ, ఆంధ్రోద్యమానికీ ఆకర్షితులై, స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు, కొండా వెంకట రంగారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి వంటి అగ్రనేతలతో కలిసి పనిచేశారు.హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమయ్యాక వెల్లోడీ నాయకత్వాన మొదటి మంత్రివర్గం ఏర్పడినప్పుడు రాజుకందులో స్థానం లభించింది. తర్వాత బూర్గుల రామకృష్ణారావు మంత్రి వర్గంలోనూ పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ అవతరించాక ఆయన ప్రణాళికశాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏర్పడటానికి కారకులయ్యారు. మంత్రి వర్గం నుండి బయటకు వచ్చాక ఆయన ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ చైర్మన్‌గా నియమితులయ్యారు. రెండేళ్ళ పదవీకాలంలో మొదటిసారిగా రాష్ట్రంలో రాత్రి బస్ సర్వీసును పరిచయం చేసింది ఆయనే. విలువైన ప్రయాణ సమయాన్ని ఆదా చేసే నైట్ సర్వీస్ నాటి నుండి ఎంతో ప్రజాదరణ పొందింది. రాజ్యసభ సభ్యులుగా, రాజ్యసభ ప్యానెల్ చెయిర్ పర్సన్‌గా జాతీయ రాజకీయాల్లోనూ ఆయన ప్రముఖ పాత్ర వహించారు వి.బి.రాజు. ప్రజాచైతన్యం కలిగించాలంటే పత్రికారంగంలో ప్రవేశించి, సంఘ విద్రోహుల అక్రమాలను, దుశ్చర్యలను బట్టబయలు చెయ్యాలనీ, సామాన్యుడిలో రాజకీయ స్పృహ జాగృతం చెయ్యాలనీ భావించి ‘ఆంధ్ర జనత’ దినపత్రికను నడిపించారు. తర్వాత ఆంగ్లంలో ‘డైలీ న్యూస్’ దినపత్రికను స్వీయ సంపాదకత్వంలో తెచ్చారు. స్వాతంత్య్ర యోధురాలు సూర్యదేవర రాజ్యలక్ష్మి అండతో ‘తెలుగు దేశం’ అనే పత్రిక నడిపారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలలో పాల్గొంటున్న మన దేశ ప్రతినిధి వర్గ సభ్యుడుగా ఎంపికయ్యారు. ఆ బాధ్యతను ప్రతిభావంతంగా నిర్వహించారు. తెలుగు నేలపై, ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో వి.బి. రాజును తమ గురువుగా భావించిన చాలా మంది రాజకీయ నేతలున్నారు. (వి.బి. రాజు రాసుకున్న అసంపూర్తి ‘ఆత్మకథ’ నుంచి కొన్ని భాగాలు...) ‘‘మొదటిసారి నేను హైదరాబాద్ నగరాన్ని చూసినది 1932వ సంవత్సరంలో. అప్పటికి నేను ఇంకా మద్రాసు గిండీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థిని. సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా తీసుకొని తిరిగి 1934లో హైదరాబాద్ చేరుకొని ఇక్కడే స్థిరపడటానికి ఇష్టపడ్డాను. అప్పటికి నా వయస్సు పందొమ్మిదేండ్లే. తరువాత మూసీనది సాక్షిగా ఎన్నో పరిణామాలు సంభవించాయి. 1947 జూన్ నుంచి 1948 సెప్టెంబరు వరకు, అంటే పధ్నాలుగు, పదిహేను నెలల తీవ్ర పోరాటాల అనంతరం ఈ పరిణామాలు కొలిక్కి వచ్చాయి. నేను హైదరాబాద్‌లో స్థిరపడిన మొదటి ఏడాదే, అంటే 1934లోనే ఖమ్మం మెట్టులో జరిగిన మూడవ నైజాం స్టేట్ ఆంధ్ర మహాసభలకు ఒక సందర్శకుడుగా హాజరయ్యాను. ఆ రోజులలో రాజకీయాభిప్రాయాలను వ్యక్తం చేయటానికి గాని, కనీసం సంఘ సంస్కరణలను చర్చించడానికిగాని సంస్థాన ప్రభుత్వం అనుమతి ఇచ్చేవారు కారు. తెలంగాణా ప్రజలకు సంబంధించిన కీలకమైన అనేక ముఖ్య విషయాలపై నేను అభిప్రాయాలు ఏర్పరచుకొనటానికి సురవరం ప్రతాపరెడ్డి గారితో ఏర్పడిన సాన్నిహిత్యం అవకాశం కలిగించింది. బెజవాడలో స్టేట్ కాంగ్రెస్ కార్యాలయాన్ని స్థాపించిన నాకు అక్కడి ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది. అయ్యదేవర కాళేశ్వరరావు తన ఇంటినే స్టేట్ కాంగ్రెస్ ఆఫీసు పెట్టుకోవడానికి ఇచ్చారు. హైదరాబాద్ ప్రజల ఉద్యమానికి సంపూర్ణ సహకారాన్ని అందించడానికి ముందుకొచ్చిన అక్కడి వారిలో మొదటి వ్యక్తి అయ్యదేవర కాళేశ్వరరావు. మొత్తం పధ్నాలుగు నెలల కాలం ప్రజాపోరాటం కొనసాగింది. వేలాది కుటుంబాలు సంస్థానం వదలి వెళ్లిపోయాయి, మరెందరినో రజకార్లు హతమార్చారు. హైదరాబాద్ సమస్యను పరిష్కరించడానికి ఏ వ్యూహం, ఏ విధానం అనుసరించాలనే విషయంలో ఢిల్లీలోని అగ్ర నాయకుల మధ్య విభేదాలు తలెత్తడం, నిజామ్తో ఒక అవగాహనకు వచ్చే విషయంలో లార్డ్ మౌంట్ బాటన్ జోక్యం చేసుకోవటం అనే రెండు పరిణామాలు, లక్షలాది ప్రజలు నిండు పధ్నాలుగు నెలల దీర్ఘకాలం దుర్భరమైన కష్టాలు అనుభవించటానికి ముఖ్య కారణాలయ్యాయి. యథాతథ ఒప్పందం తరువాత భారత సైన్యాలను బొలారం నుంచి ఉపసంహరించటం వల్ల చాలా మంది ప్రజల మానసిక స్థైర్యం దెబ్బతిని సంస్థానం వదిలిపోయే పరిస్థితి కలిగింది. రజాకార్లు హింసాకాండను ఉధృతం చేయటానికి కూడా ఇదే దోహదం చేసింది. పోలీస్ ఏక్షన్ (ఆపరేషన్ పోలో) మొదటి నుంచి భారత ప్రభుత్వం ఇలా మెతక విధానాన్ని ప్రదర్శిస్తుండటం వల్లనే నిజామ్ నవాబు, అతడి ప్రభుత్వం, రజాకార్లు కూడా మొండికెత్తుతూ, పొగరుబోతులుగా ప్రవర్తిస్తూ వచ్చారు. మౌంట్ బాటన్ సూచించిన పరిష్కారాన్నే గనుక నిజామ్ ఒప్పుకొని ఉంటే హైదరాబాద్ దుర్గతి పాలై ఉండేది. హిందువులకి ముస్లిములకి మధ్య ఇక మరెన్నటికీ కలసే వీలు లేని పెద్ద అగాథం ఏర్పడి ఉండేది. స్వతంత్ర భారత చరిత్ర మరొక విధంగా ఉండేది. ‘‘నిజామ్ నవాబు పాలనలోని హైదరాబాద్ సంస్థానం ఇండియాకు ‘కడుపులో రాచపుండు’ ’’ అని సర్దార్ పటేల్ చాలా చక్కగా వర్ణించారు. మౌంట్‌బాటన్ పుణ్యాన ఆ రాచపుండు ఎప్పటికీ అలా ఉండే పోవటమే గాక భారత ప్రాదేశిక సమగ్రతకు ఎప్పటికీ ముప్పు ఏర్పడి ఉండేది. ఏది ఏమైనా, నిజామ్ నవాబును ఎంతో బుజ్జగించారు గానీ లాభం లేకపోయింది. చివరకు జరగవలసింది జరగనే జరిగింది. పరిణామాలన్నీ ‘పోలీస్ యాక్షన్’ అనే చర్యకు దారితీశాయి. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ఈ పధ్నాలుగు నెలల పోరాటం అత్యంత దీర్ఘమైనది. చాలా కుటుంబాలు ఇళ్లూ, ఊళ్లూ వదలి వెళ్లిపోయాయి. అప్పటి జ్ఞాపకాలు తలచుకొంటేనే బాధ కలుగుతుంది. పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగాయి.’’