సాక్షి, వైఎస్సార్ కడప : ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మృత్యువాత పడిన ఘటన వైఎస్సార్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. అమరావతి బస్సు ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఓబుల్‌రెడ్డి, భార్గవి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. చిన్న మండ్యం మండలం వల్లూర్ క్రాస్ సమీపంలో ఈ ఘటన జరిగింది. డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న భార్గవి పరీక్ష రాసి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. భార్గవి స్వస్థలం చిత్తూరు జిల్లా గుర్రంకొండ.
Comments
Please login to add a commentAdd a comment