పేస్ కాలేజి విద్యార్థిని ఆత్మహత్య
ఒంగోలు: పట్టణంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజికి చెందిన విద్యార్థిని మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలోని పేస్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న నాగలక్ష్మీ అనే విద్యార్థిని కాలేజి హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా సోమవారం తన స్నేహితుడితో కలిసి బైక్ పై వెళ్తున్న నాగలక్ష్మిని పోలీసులు ఆపి ప్రశ్నించినట్లు తెలిసింది.
ఆ రాత్రే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాగలక్ష్మి స్వగ్రామం పొదిలి మండలం తల్లమల్లగా తెలిసింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.