వానరానికి అంత్యక్రియలు
Published Thu, Feb 9 2017 1:31 AM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM
వల్లూరు (ఆచంట) : వానరాలను దైవ స్వరూపంగా భావిస్తారు కొందరు. ఆచంట మండలం వల్లూరులో ప్రమాదవశాత్తూ చనిపోయిన ఓ వానరానికి అంతిమయాత్ర, అంత్యక్రియలు ఘనంగా నిర్వహించడంతోపాటు అన్నసంతర్పణ చేసి కోతిపై తమ భక్తి చాటుకున్నారు. ఈనెల 5న వల్లూరులోని జెడ్పీ హైస్కూల్ మైదానంలో కొబ్బరి చెట్టుపై నుంచి పడి ఓ వానరానికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన గ్రామస్తులు దాన్ని స్థానిక పశువైద్యశాలలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. దీంతో చలించిన గ్రామస్తులు అదే రోజు అంతిమ యాత్ర నిర్వహించి ఖననం చేశారు. దాని స్మృత్యర్థం అన్న సంతర్పణ చేయాలని నిర్ణయించుకుని తలో చేయి వేశారు. జెడ్పీ హైస్కూల్ ఆవరణలో బుధవారం అన్న సంతర్పణ చేశారు. ఈ కార్యక్రమాల్లో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Advertisement
Advertisement