మిస్‌ యూ అమ్మా | Young Man Committed Suicide In Railway Track In Miryalaguda, More Details Inside | Sakshi
Sakshi News home page

మిస్‌ యూ అమ్మా

Published Thu, May 30 2024 7:21 AM | Last Updated on Thu, May 30 2024 2:57 PM

Young Man Suicide In Railway Track

రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య

చివరగా తన తల్లికి మెసేజ్‌ చేసిన కొడుకు 

మిర్యాలగూడఅర్బన్‌: వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురం ప్రాంతానికి చెందిన తన్నీరు వెంకటమ్మ మూడవ కుమారుడు తన్నీరు సాయికిరణ్‌(22) పట్టణంలోని ఓ ప్రైవేట్‌ సంస్థలో డెలివరీబాయ్‌గా పనిచేస్తున్నాడు. ఇదే కాలనీకి చెందిన ఓ బాలికను  మూడేళ్లుగా ప్రేమిస్తున్నానని వెంటపడుతుండగా, బాలిక తరపువారు గతంలో కేసులు పెట్టగా,  పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగిందని సీఐ నాగార్జున తెలిపారు.

ఈ నెల 28న రాత్రి సీతారాంపురంలోని ఆ బాలిక ఇంటికి వెళ్లడంతో గొడవ జరిగింది. దీంతో బాలిక కుటుంబసభ్యులు బుధవారం ఉదయం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. ఈ క్రమంలో మధ్యాహ్నం పట్టణంలోని రైల్వే ట్రాక్‌పైకి చేరుకున్న సాయికిరణ్‌.. తన చావుకు సోమగాని శ్రీనివాస్, మీసాల శ్రీనివాస్‌ కారణమని, వారిద్దరూ స్థానిక ఎమ్మెల్యే అండ చూసుకుని వేధింపులకు గురిచేయడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నానని తన సెల్‌ఫోన్‌ స్టేటస్‌లో పెట్టుకున్నాడు. అనంతరం రైలు పట్టాల వద్ద నిలబడి ఫొటో  తీసుకొని మిస్‌ యూ అమ్మా అని స్టేటస్‌ పెట్టుకొని.. వేగంగా వస్తున్న జన్మభూమి రైలుకు ఎదురుగా పరుగెత్తడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రైలు డ్రైవర్‌ ఇచ్చిన సమాచారంతో రైల్వే ఎస్‌ఐ పవన్‌కుమార్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు.

వేధింపులతోనే నా కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుమారుడు మృతికి సోమగాని శ్రీనివాస్, కజ్జం శ్రీనివాస్‌ అలియాస్‌ మీసాల శ్రీనివాస్‌ కారణమని, ఎమ్మెల్యే అండ చూసుకొని తన కుమారుడిపై వేధింపులకు పాల్పడ్డారని సాయికిరణ్‌ తల్లి వెంకటమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement