
ఆన్‌లైన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ జూన్ 1 నుంచి ‘బిగ్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్’ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సీజన్ సేల్‌లో ఫ్యాషన్ కేటగిరీలోని వస్తువులపై ఆకర్షణీయలమైన ఆఫర్లు ఉంటాయని చెప్పింది.
బిగ్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ 2024లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ 12,000 బ్రాండ్‌లను కస్టమర్లకు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. 2 లక్షలకు పైగా అమ్మకందారుల నుంచి వీటిని ఎంపిక చేశామని చెప్పింది. స్పోర్ట్స్ షూ, గడియారాలు, జీన్స్ వంటి వాటిని ఓపెన్-బాక్స్ డెలివరీ అందిస్తామని పేర్కొంది. ఒక లక్షకు పైగా ఉత్పత్తులను బుక్ చేసుకున్న రోజే డెలివరీ ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ సేల్‌లో అన్ని ప్రముఖ బ్రాండ్‌లు అందుబాటులో ఉంటాయని, కంపెనీ ఆఫర్లను అందరూ వినియోగించుకోవాలని కోరింది.
ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌లో భాగంగా తమ కస్టమర్‌లకు బ్యాంక్ ఆఫర్‌ను అందిస్తుంది. ఆర్‌బీఎల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ (కనీస ఆర్డర్ విలువ రూ.2,500) క్రెడిట్ కార్డ్‌లపై ఉత్పత్తి ధరలో 10% ఇన్‌స్టాంట్ తగ్గింపు ఇస్తున్నారు. కనీసం రూ.200 విలువ చేసే ఉత్పత్తులను యూపీఐ పేమెంట్ ద్వారా ఆర్డర్ చేస్తే ఆకర్షణీయమైన ఆఫర్‌లను పొందవచ్చని కంపెనీ చెప్పింది.
ఇదీ చదవండి: అంబానీ మనవరాలా..మజాకా..క్రూయిజ్‌లో ఫస్ట్ బర్త్‌డే
ఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ అరీఫ్ మొహమ్మద్ మాట్లాడుతూ..‘మార్కెట్‌లో పేరున్న బ్రాండ్‌లను వినియోగదారులకు తక్కువ ధరకే ఇస్తున్నాం. దుస్తులు, పాదరక్షలు, యాక్సెసరీ వంటి విభాగాల్లో మరింత ట్రెండింగ్ వస్తువులను అందిస్తున్నాం. కస్టమర్లకు 75 లక్షలకు పైగా విభిన్న ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతున్నాం. ఈ సేల్‌ను ఒక వేడుకగా జరుపుతున్నాం. ఇందులో 10 మిలియన్లకు పైగా కొత్త కస్టమర్లు పాల్గొనే అవకాశం ఉంది. వీరు ఎక్కువగా స్పోర్ట్స్ షూస్, లగేజ్, వాచీలు, ఎత్నిక్ సూట్‌లు, పార్టీ డ్రెస్‌లు వంటి వాటిపై ఆసక్తి చూపుతున్నారు’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment