
దిగ్గజ ఆన్‌లైన్ ఈకార్ట్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ రిటైల్ పరిశ్రమలో లాభాలు పెంచుకోవడానికి రహస్య అల్గారిథమ్‌లు వినియోగించిందని యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ గురువారం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలా రహస్య అల్గారిథమ్‌ల ద్వారా ఏకంగా రూ.100 కోట్లు సంపాదించినట్లు పేర్కొంది.
ఫెడరల్ ట్రేడ్ కమిషన్..అమెజాన్ సంస్థకు సంబంధించిన కొన్ని అంశాలను పేర్కొంటూ సెప్టెంబర్‌లోనే కోర్టులో దావా వేసింది. కానీ గురువారం వరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. తాజాగా యూస్ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పిటిషన్‌లోని వివరాలు కింది విధంగా ఉన్నాయి.
అమెజాన్ ఆన్‌లైన్ సూపర్‌స్టోర్‌ల్లో దాదాపు ఒక బిలియన్ వస్తువులు ఉన్నాయి. వినియోగదారుడికి తెలియకుండానే కొన్ని వస్తువుల ధరలు త్వరలో పెరుగనున్నట్లు ముందుగానే అంచనా వేసే అంతర్గత రహస్య అల్గారిథమ్(ప్రాజెక్ట్ నెస్సీ)ను సంస్థ ఉపయోగిస్తుంది. దాంతో సదరు వస్తువులను ఎక్కడ అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తుందేమోనని ముందుగానే కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా కస్టమర్లలో ఆందోళన సృష్టించి అమెజాన్ అమెరికాలో ఏకంగా రూ.100 కోట్లు సంపాదించింది.
కొనుగోలు చేయాలనుకునే వస్తువు ధరను వినియోగదారులు బయటి రిటైలర్లతో పోల్చిచూస్తారు. ఆ వివరాలు నమోదు చేసుకుని తర్వాత అమెజాన్‌లో వాస్తవ ధరను మార్చి సదరు వినియోగదారుడికి విక్రయించినట్లు ఎఫ్‌టీసీ తెలిపింది. అమెజాన్ తన ప్రైమ్ డే సేల్స్ ఈవెంట్‌లు, హాలిడే షాపింగ్ సీజన్‌లో కస్టమర్లు ధరల విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటారు. కాబట్టి ఆ సమయంలో నెస్సీ అల్గారిథమ్‌ను నిలిపివేస్తున్నారని వివరించింది. అమెజాన్ ఏప్రిల్ 2018లో కస్టమర్లు కొనుగోలు చేసిన 80 లక్షలకు పైగా వస్తువుల ధరలను నిర్ణయించడానికి నెస్సీను ఉపయోగించింది. ఈ వస్తువుల ధర ఏకంగా దాదాపు రూ.1600కోట్లు అని ఫిర్యాదులో పేర్కొంది.
ఇదీ చదవండి: వచ్చే ఐదేళ్లలో భారత డిజిటల్ గేమింగ్ మార్కెట్ ఎంతంటే..
అమెజాన్ ప్రతినిధి టిమ్ డోయల్ మాట్లాడుతూ..ఫెడరల్ ట్రేడ్ కమిషన్ పిటిషన్‌లో తెలిపిన సమాచారం అవాస్తవం అన్నారు. నెస్సీ చేస్తున్న ధరల పోలికలు తప్పుగా వస్తుడడంతో చాలా ఏళ్ల క్రితం కంపెనీ ఆ అల్గారిథమ్‌ను వాడడం నిలిపివేసిందన్నారు. కేవలం వినియోగదారులు సదరు ప్రోడక్ట్ ధరను వేరే ఏదైనా ప్లాట్‌ఫామ్‌లో పోల్చి చూసారా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు మాత్రమే నెస్సీని 2010లో పరీక్షించినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment