
బెంగళూరు: డిజిటల్ మాధ్యమాల దుర్వినియోగం కారణంగా 2024 యేడాదికల్లా ఆన్‌లైన్ షాపింగ్ ఒక వ్యసనపరమైన రుగ్మతగా మారే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గుర్తించింది. ఆన్‌లైన్ షాపింగ్‌ని దుర్వినియోగం చేసుకోవడం కారణంగా లక్షలాది మంది ఆర్థిక ఒత్తిడికి లోనవుతారని అంతర్జాతీయ అధ్యయన సంస్థ గార్టనర్ అభిప్రాయపడింది. ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా వినియోగదారులు చేసే వ్యయం ఏడాదికి 10 శాతం చొప్పున పెరుగుతోందని ఈ అధ్యయనం గుర్తించింది. కాలు కదపకుండా ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో ఎడాపెడా కొనేసే అలవాటు వల్ల ఒత్తిడికీ, మానసిక ఆందోళనకు గురవుతారని డబ్ల్యూహెచ్‌వో గుర్తించినట్టు గార్టనర్ నిర్వహించిన అధ్యయనం చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment