gartner
-
యాప్ సాఫ్ట్వేర్లపై వ్యయాలు 15% అప్
న్యూఢిల్లీ: దేశీయంగా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్లపై కంపెనీలు చేసే వ్యయాలు 2023లో 14.9 శాతం పెరిగి 4.7 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. ఇందులో అత్యధిక భాగం వాటా కస్టమర్ ఎక్స్పీరియన్స్, రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ల వ్యయాలదే ఉండనుంది. ప్రస్తుత ఏడాది ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్లపై వ్యయాలు 14.6 శాతం పెరిగి 4.15 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. కన్సల్టెన్సీ సంస్థ గార్ట్నర్ ఒక నివేదికలో ఈ అంశాలు తెలిపింది. డిజిటల్ బాట పట్టే క్రమంలో దేశీ కంపెనీలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై చేసే వ్యయాల్లో భాగంగా సాఫ్ట్‌వేర్‌పైనా గణనీయంగా వెచ్చించనున్నాయని గార్ట్నర్ వైస్ ప్రెసిడెంట్ నేహా గుప్తా పేర్కొన్నారు. వ్యాపారాల్లో అన్ని అంశాలను నిర్వహించుకునేందుకు కంపెనీలు..సాఫ్ట్వేర్లపై ఆధారపడటం పెరుగుతోందని తెలిపారు. అయితే, 2021తో పోలిస్తే 2022లో సాఫ్ట్‌వేర్‌పై వ్యయాలు కొంత తగ్గవచ్చని నేహా వివరించారు. అంతర్జాతీయంగా స్థూలఆర్థిక పరిస్థితులు ఒడిదుడుకులకు లోనవుతుండటంతో వ్యాపారాలకు అనిశ్చితి పెరగడం ఇందుకు కారణమని పేర్కొన్నారు. నివేదికలో మరిన్ని అంశాలు.. ► కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (సీఆర్ఎం) సాఫ్ట్‌వేర్‌పై వ్యయాలు 2022లో 18.1 శాతం పెరిగి 1.13 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. వచ్చే ఏడాది 18.5 శాతం పెరిగి 1.34 బిలియన్ డాలర్లకు చేరతాయి. ► 2023లో ఈమెయిల్, ఆథరింగ్ విభాగం 16.5 శాతం పెరిగి 768 మిలియన్ డాలర్లకు చేరుతుంది. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ 10.3 శాతం పెరిగి 566 మిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతుంది. అనలిటిక్స్ ప్లాట్‌ఫాం 18.5 శాతం (495 మిలియన్ డాలర్లకు), కంటెంట్ సర్వీసులు 14.8 శాతం (366 మిలియన్ డాలర్లకు), సప్లై చెయిన్ మేనేజ్మెంట్ సాఫ్ట్‌వేర్‌పై వ్యయాలు 11.4 శాతం (241 మిలియన్ డాలర్లకు) వృద్ధి చెందనున్నాయి. -
అంతా 5జీ మయం, 2024 కి ఎంత పెరుగుతుందంటే
5జీ..! హ్యూమన్ లైఫ్ స్టైల్‌ని కంప్లీట్‌గా మార్చేసుందుకు దూసుకొస్తున్న టెక్నాలజీ. ఈ టెక్నాలజీ వినియోగం రోజురోజుకు పెరగడం వల్ల 5జీ నెట్ వర్క్ సంస్థలు 2021లో 19.91 బిలియన్ డాలర్లను అర్జించినట్లు అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ రీసెర్చ్ దిగ్గజం గ్రాంటార్ డేటాను విడుదల చేసింది. 5జీ నెట్ వర్క్. ఒక్క మాటలో చెప్పాలంటే కాకులు దూరని కారడవిలో సైతం నెట్ కనెక్టివిటీ, మొబైల్ నెట్ వర్కింగ్ వ్యవస్థతో పాటు..వర్చవల్ రియాల్టీ, ఓటీటీ,ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని మానవ మేధోసంపత్తితో అద్భుతాలు సృష్టించేందుకు ఉపయోగపడనుంది. అయితే దీని వల్ల దేశ భద్రత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నా..టెక్నాలజీతో వాటన్నింటికి చెక్ పెట్టొచ్చని నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆయా సంస్థలు 5జీ టెక్నాలజీని విస్తరించే పనిలోపడ్డాయి. ముఖ్యంగా కోవిడ్-19 వల్ల యూజర్లు ఆల్ట్రా ఫాస్ట్ బ్రాండ్ బ్యాండ్ కనెక్టివిటీకి ఆప్టిమైజ్ అవ్వడంతో పాటు స్ట్రీమింగ్ వీడియోస్, ఆన్ లైన్ గేమ్స్, సోషల్ మీడియా అప్లికేషన్ల వినియోగం పెరిగిందని గ్రాంట్రార్ రీసెర్చ్ సీనియర్ ప్రిన్సిపల్ రీసెర్చ్ మైఖెల్ పొరౌస్కి తెలిపారు.5జీ వైర్లెస్ నెట్ వర్క్ ఇన్ఫ్రాస్టెక్చర్ మార్కెట్ విస్తరించడంతో పాటు..కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ (సీఎస్పీ)తో 5జీ నెట్ వర్క్‌తో పనిచేసే ఫోన్ల వినియోగం పెరిగిందని వెల్లడించారు. దీంతో 2020 లో 5జీ నెట్ వర్క్ ఇన్ ఫ్రాస్ట్రెక్చర్ వినియోగం వల్ల వరల్డ్ వైడ్‌గా 13.7బిలియన్ల రెవెన్యూ రాగా..2021లో 39 శాతం పెరిగి 19.91 బిలియన్ డాలర్లు చేరుకున్నట్లు ఐటీ రీసెర్చ్ దిగ్గజం గ్రాంటార్ రిపోర్ట్‌లో పేర్కొంది. టైర్ 1 సిటీస్‌లో 60శాతం వినియోగం గ్రాంటర్ రిపోర్ట్ ప్రకారం.. 2020లో 10 శాతం వినియోగంలో ఉన్న సీపీసీ నెట్ వర్క్ 2024కి 60శాతం పెరుగుతుందని తేలింది. ముఖ్యంగా టైర్ 1 సిటీస్ లో ప్రస్తుతం లాంగ్ టర్మ్ ఎవెల్యూషన్ (ఎల్టీఈ) కమ్యూనికేషన్ తో వినియోగించే 4జీ నెట్ వర్క్ నుంచి 5జీ నెట్ వర్క్‌కు మార్చుకుంటారని గ్రాంటార్ రీసెర్చ్ మైఖెల్ పొరౌస్కి తెలిపారు. -
2020లో తగ్గిన స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు
2020 నాల్గవ త్రైమాసికంలో ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ఫోన్ల అమ్మకాలు 5.4% తగ్గాయని గార్ట్నర్ కొత్త నివేదిక తెలిపింది. 2020 ఏడాది మొత్తంలో అమ్మకాలు కరోనా కారణంగా 12.5శాతం తగ్గాయి. నాల్గవ త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాల విషయంలో 20.8 శాతం వాటాతో ఆపిల్ అగ్ర స్థానంలో ఉంది. గార్ట్నర్ ప్రకారం.. మన దేశంలో అక్టోబర్ 23న విడుదలైన ఆపిల్ 12 సిరీస్ 5జీ ఐఫోన్ లు నాల్గవ త్రైమాసికంలో ఎక్కువగా అమ్ముడయ్యాయి. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శామ్సంగ్ 16.2 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానంలో నిలిచింది. చైనాకు చెందిన షియోమీ, ఒప్పో, హువావే వరుసగా మూడవ, నాల్గవ మరియు ఐదవ స్థానాలను దక్కించుకున్నాయి. "2020 నాలుగో త్రైమాసికంలో 5జి స్మార్ట్ఫోన్లు, లోయర్-టు-మిడ్-టైర్ స్మార్ట్ఫోన్ల రాకతో గ్లోబల్ మార్కెట్లో అమ్మకాల క్షీణత కొంతమేర తగ్గింది" అని గార్ట్నర్ సీనియర్ రీసెర్చ్ డైరెక్టర్ అన్షుల్ గుప్తా అన్నారు. కరోనా కారణంగా వినియోగదారులు తమ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉన్నారు. మార్కెట్లోకి కొత్తగా విడుదలైన 5జీ స్మార్ట్ఫోన్లు, ప్రో-కెమెరా ఫీచర్లు కొంతమంది వినియోగదారులను ఆకట్టుకున్నాయి. ఆపిల్ నాల్గవ త్రైమాసికంలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ 2020 ఏడాది మొత్తం అమ్మకాలలో శామ్సంగ్ అగ్రస్థానంలో ఉంది. గత ఏడాది పోలిస్తే 2020లో శామ్సంగ్ 14.6శాతం క్షీణతను నమోదు చేసింది. గ్లోబల్ స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో క్షీణత భారతదేశాన్ని కూడా ప్రభావితం చేసింది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడిసి) ప్రకారం.. 2020లో కరోనా కారణంగా భారత్‌లో మొబైల్ ఎగుమతులు 2శాతం మేర తగ్గాయని తెలిపింది. 2009 తరువాత భారత్‌లో మొబైల్ అమ్మకాలు తగ్గడం ఇదే మొదటిసారి. చదవండి: ఫ్లిప్‌కార్ట్ లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఏడు స్క్రీన్ల ల్యాప్‌టాప్‌ను చూశారా! -
అవుట్సోర్సింగ్కు అనిశ్చితి ముప్పు
బెంగళూరు: అంతర్జాతీయ అవుట్సోర్సింగ్ మార్కెట్‌కు భౌగోళిక, రాజకీయ అనిశ్చితిపరమైన ముప్పు పొంచి ఉందని రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ పేర్కొంది. కంపెనీలు సాధ్యమైనంత వరకూ రిస్కులు తగ్గించుకోవడంపై దృష్టి పెడుతున్నాయని వివరించింది. ఆన్‌షోర్, ఆఫ్‌షోర్ వనరుల మేళవింపుతో కంపెనీలు అనుసరిస్తున్న విధానంతో డిమాండ్, సరఫరాపరంగా కొన్నాళ్లుగా విదేశీ అవుట్సోర్సింగ్ మార్కెట్ స్థిరంగా ఉంటోందని గార్ట్నర్ తెలిపింది. అయితే, శ్రీలంకలో ఉగ్రవాద దాడులు, అమెరికా–చైనా మధ్య వాణిజ్య వివాదం, హాంకాంగ్‌లో రాజకీయ ఆందోళనలు మొదలైన వాటితో సరఫరాపరమైన అనిశ్చితి తలెత్తిందని ఒక నివేదికలో వివరించింది. ఉత్తర అమెరికా, పశ్చిమ యూరప్, జపాన్ మొదలైన దేశాలకు చైనా దాదాపు 10 బిలియన్ డాలర్ల విలువ చేసే ఐటీ అప్లికేషన్స్, బిజినెస్ ప్రాసెస్ సర్వీసులు అందిస్తోంది. భారతీయ అవుట్సోర్సింగ్ సంస్థలు .. అంతర్జాతీయంగా సేవల ద్వారా గతేడాది 45 బిలియన్ డాలర్ల పైగా ఆదాయాలు ఆర్జించాయి. అయితే, తాజాగా వాణిజ్య యుద్ధంపై ఆందోళనలతో ఐటీ సేవల విషయంలో చైనాకు ప్రతికూల పరిస్థితులు ఎదురుకావొచ్చని గార్ట్నర్ తెలిపింది. ఈ నేపథ్యంలో కంపెనీలు తమ ఆఫ్‌షోర్ అవుట్సోర్సింగ్ ఒప్పందాలను పునఃసమీక్షించుకోవడం శ్రేయస్కరమని సూచించింది. -
ఆన్లైన్ షాపింగ్ జబ్బే..!
బెంగళూరు: డిజిటల్ మాధ్యమాల దుర్వినియోగం కారణంగా 2024 యేడాదికల్లా ఆన్లైన్ షాపింగ్ ఒక వ్యసనపరమైన రుగ్మతగా మారే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గుర్తించింది. ఆన్లైన్ షాపింగ్‌ని దుర్వినియోగం చేసుకోవడం కారణంగా లక్షలాది మంది ఆర్థిక ఒత్తిడికి లోనవుతారని అంతర్జాతీయ అధ్యయన సంస్థ గార్టనర్ అభిప్రాయపడింది. ఆన్లైన్ షాపింగ్ ద్వారా వినియోగదారులు చేసే వ్యయం ఏడాదికి 10 శాతం చొప్పున పెరుగుతోందని ఈ అధ్యయనం గుర్తించింది. కాలు కదపకుండా ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో ఎడాపెడా కొనేసే అలవాటు వల్ల ఒత్తిడికీ, మానసిక ఆందోళనకు గురవుతారని డబ్ల్యూహెచ్‌వో గుర్తించినట్టు గార్టనర్ నిర్వహించిన అధ్యయనం చెప్పింది. -
ఏఐతో కొలువులు భద్రమే..
సాక్షి, న్యూఢిల్లీ: కృత్రిమ మేథ(ఏఐ)తో ఉద్యోగాలు ఊడిపోతాయనే ఆందోళనల నేపథ్యంలో దీనిపై భయాలు అవసరం లేదని పరిశోధక సంస్థ గార్ట్నర్ భరోసా ఇచ్చింది. ఏఐ రాకతో కోల్పోయే ఉద్యోగాల కంటే దాంతో వచ్చే ఉపాధి అవకాశాలే అధికంగా ఉంటాయని గార్ట్నర్ అంచనా వేసింది. కృత్రిమ మేథ కారణంగా 2020 నాటికి 18 లక్షల ఉద్యోగాలు కోల్పోనుండగా, అప్పటికి 23 లక్షల కొత్త ఉద్యోగాలు ముందుకొస్తాయని తెలిపింది. ఏఐ ఆధారిత ఉపాధి ముఖచిత్రంలో 2020 కీలక సంవత్సరంగా గార్ట్నర్ అభివర్ణించింది. మొత్తంమీద ఏఐ వల్ల పెద్ద ఎత్తున కొత్త ఉద్యోగాలు ఉనికిలోకి వస్తాయని ఈ సంస్థ అంచనా వేసింది. రాబోయే సంవత్సరాల్లో ఆరోగ్యం, ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యా రంగాల్లో ఉద్యోగాల డిమాండ్ పెరుగుతుందని, తయారీ రంగంలో మాత్రం ఉపాధి తగ్గుముఖం పడుతుందని పేర్కొంది. 2020 నుంచి ఏఐతో ఉద్యోగాల సృష్టి సానుకూలంగా సాగుతుందని, 2025 నాటికి 20 లక్షల కొత్త ఉద్యోగాలు నికరంగా అందుబాటులోకి వస్తాయని గార్ట్నర్ నివేదిక స్పష్టం చేసింది. గతంలోనూ వినూత్న ఆవిష్కరణల ఫలితంగా మొదట్లో తాత్కాలికంగా ఉద్యోగాల కోత ఎదురైనా ఆ తర్వాత సానుకూల మార్పులు చోటుచేసుకున్నాయని పేర్కొంది. ఏఐ ఫలితంగా లక్షలాది అత్యున్నత నైపుణ్యాలు కలిగిన నూతన నిపుణుల అవసరం నెలకొంటుందని, ప్రారంభ, తక్కువ నైపుణ్యాలున్నా ఉద్యోగాల్లోనూ మెరుగైన వేతనంతో కూడిన ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని గార్ట్నర్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ స్వెత్లానా సికులర్ చెప్పారు. -
ఐటీ వ్యయాల వృద్ధి తగ్గుతుంది
♦ 2.4 శాతానికే పరిమితం... ♦ రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ వెల్లడి ముంబై: డిజిటైజేషన్‌పై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో 2017లో ప్రపంచవ్యాప్తంగా ఐటీ వ్యయాల వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ఐటీ రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ మరింతగా కుదించింది. దీన్ని 2.7 శాతం నుంచి 2.4 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. వృద్ధి 3 శాతం మేర ఉండొచ్చని గార్ట్నర్ ముందుగా అంచనా వేసినప్పటికీ.. ఈ ఏడాది జనవరిలో దాన్ని 2.7 శాతానికి కుదించింది. ఐటీ పరిశ్రమ భవిష్యత్‌పై ఆందోళన నెలకొన్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. అటు ఆటోమేషన్ ఇటు వివిధ దేశాల్లో రక్షణాత్మక ధోరణులు.. దేశీయంగా ఐటీ ఉద్యోగాల్లో కోతకు దారి తీస్తున్న సంగతి తెలిసిందే. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ఈ ఏడాది పరిశ్రమ వృద్ధి రేటు 7–8%కి మాత్రమే పరిమితం కావొచ్చని అంచనా వేసింది. వెల్లువలా కొంగొత్త టెక్నాలజీలు.. డిజిటల్ వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతోందని గార్ట్నర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ డేవిడ్ లవ్‌లాక్ పేర్కొన్నారు. సాఫ్ట్‌వేర్‌తో పాటు సర్వీసులు, అలాగే మేధోహక్కుల సేవలు కూడా కలిపి అందించే కొత్త తరహా వ్యాపార విధానాలకు తెరతీస్తోందన్నారు. ఈ సంవత్సరం ఐటీ వ్యయాల వృద్ధి అంచనాలను కుదించినప్పటికీ 2016లో నమోదైన 0.3% కన్నా అధికంగానే ఉండనుందని, పరిశ్రమను 3.477 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేర్చగలదని వివరించారు. -
ఐటీ సెక్టార్‌కు మరింత బ్యాడ్ న్యూస్
ముంబై : ఐటీ రంగానికి మరింత బ్యాడ్ న్యూస్. గ్లోబల్ ఐటీ రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ మరోసారి ఐటీ వ్యయాల వృద్ధి అంచనాలను తగ్గించింది. డిజిటైజేషన్ ఆందోళనతో 2.7 శాతంగా అంచనావేసిన వ్యయాల వృద్ధిని 2017లో 2.4 శాతానికి తగ్గిస్తున్నట్టు పేర్కొంది. తొలుత ప్రపంచవ్యాప్తంగా ఐటీ వ్యయాల వృద్ధి 3 శాతంగా గార్ట్నర్ అంచనావేసింది. తర్వాత దీన్ని ఈ ఏడాది జనవరి సమీక్షలో 2.7 శాతానికి కుదించింది. భవిష్యత్తు ఐటీ ఇండస్ట్రీ వృద్ధిపై ఆందోళనకర పరిస్థితులు తలెత్తుతున్న నేపథ్యంలో గార్ట్నర్ రెండోసారి ఈ ఏడాదిలో వ్యయాల వృద్ధి అంచనాలను తగ్గించేసింది. అదేవిధంగా వ్యయాల వృద్ధి అంచనాలు పడిపోవడంతోపాటు ఆటోమేషన్ పెనుముప్పులా ముంచుకొస్తుడటం, రక్షణాత్మక ధోరణి భారత్‌లో ఉద్యోగాల కోతపై భయాందోళనను కూడా కలిగిస్తున్నాయి. 155 బిలియన్ డాలర్ల మన దేశీయ ఐటీ సెక్టార్ ఎక్కువగా ఎగుమతులపైనే ఆధారపడి ఉంది. నాస్కామ్ కూడా గత నెలలో 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల వృద్ధిని తక్కువగా 7-8 శాతంగానే అంచనావేసింది. ప్రస్తుత వ్యాపారాలకు డిజిటల్ బిజినెస్‌లు లోతైన ప్రభావం చూపుతున్నాయని గార్ట్నర్ వైస్ ప్రెసిడెంట్ జాన్-డేవిడ్ లవ్‌లాక్ ప్రకటనలో తెలిపారు. డిజిటల్ బిజినెస్‌లు, కొత్త కేటగిరీలు సాఫ్ట్వేర్ ప్లస్ సర్వీసెస్, మేధోసంపత్తి హక్కుల్లో వృద్ధికి దోహదం చేస్తాయన్నారు. అయితే గార్ట్నర్ ప్రస్తుతం అంచనావేసిన వ్యయాల వృద్ధి అంచనాలు 2016లో సాధించిన దానికంటే 0.3 శాతం వేగవంతంగానే ఉన్నాయి. ఇది ఇండస్ట్రీని 3.477 ట్రిలియన్ డాలర్ల డాలర్లకు తీసుకెళ్తుందని గార్ట్నర్ భావిస్తోంది. -
సెల్ఫోన్లలో ‘స్మార్ట్’ లీడర్లు!
► 2018 నాటికి ఫోన్లలో వీటిదే 62శాతం ► రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ అంచనా ముంబై: స్మార్ట్ఫోన్ల జోరు కొనసాగుతోంది. 2018 నాటికి దేశంలోని మొత్తం మొబైల్ హ్యాండ్సెట్స్ విక్రయాల్లో స్మార్ట్ఫోన్లు 62 శాతం వాటా ఆక్రమిస్తాయని ప్రముఖ రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ అంచనా వేసింది. దీనికి ప్రభుత్వం డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించడం, స్మార్ట్ఫోన్ల డిమాండ్ పెరుగుదల వంటి పలు అంశాలు కారణంగా నిలుస్తాయని పేర్కొంది. ఇండియన్ సెల్యులర్ మార్కెట్ స్థిరీకరణ దిశగా పయనించడం, 4జీ నెట్వర్క్ విస్తరణ వల్ల స్మార్ట్ఫోన్ల డిమాండ్ అలాగే కొనసాగుతుందని తెలిపింది. శాంసంగ్, యాపిల్ వంటి అంతర్జాతీయ కంపెనీలు ఇండియన్ మార్కెట్లో వాటి వాటాను పెంచుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయని పేర్కొంది. ఇక జియోనీ, హువావే, ఒప్పొ, వివో, షావోమి, లెనొవొ వంటి చైనా కంపెనీలు ఇక్కడి వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అధిక మొత్తంలో ఇన్వెస్ట్మెంట్లకు సిద్ధమయ్యాయని వివరించింది. మంచి ఫీచర్లతో కూడిన స్మార్ట్ఫోన్ల కోసం కస్టమర్లు ఎక్కువగా ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడటం లేదని పేర్కొంది. -
ఐటీ వ్యయాలు అంతంతమాత్రమే..
గార్ట్నర్ నివేదిక వెల్లడి న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) వ్యయాలు ఈ ఏడాది అంతంతమాత్రంగానే ఉండనున్నాయని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ తెలిపింది. అంతకు ముందటి ఏడాదితో పోల్చితే 2016లో ఐటీ వ్యయం 0.5 శాతం ప్రతికూల వృద్ధి ఉండొచ్చని ఈ సంస్థ మూడు నెలల క్రితం అంచనా వేసింది. తాజాగా ఆ అంచనాలను సవరించింది. 2016లో ఐటీ వ్యయం స్వల్ప వృద్ధితో 3.14 లక్షల కోట్ల డాలర్లకు పెరగవచ్చని పేర్కొంది. కరెన్సీ హెచ్చుతగ్గుల కారణంగా అంచనాల్లో మార్పు వచ్చిందని వివరించింది. యూరోపియన్ యూని యన్ నుంచి బ్రిటన్ వైదొలగదనే అంచనాలతో తాజా నివేదికను రూపొందించామని పేర్కొం ది. ఒకవేళ ఈయూ నుంచి ఇంగ్లండ్ వైదొలిగితే, వ్యాపార విశ్వాసం సన్నగిల్లుతుందని, ఇది యూకే, పశ్చిమ యూరప్‌లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఐటీ వ్యయాలపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఇంకా గార్ట్నర్ నివేదిక ఏమని పేర్కొన్నదంటే.., ♦ ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడం జరి గితే(బ్రెగ్జిట్), తక్షణ ప్రభావం బ్రిటన్, యూరప్ ఐటీ వ్యయాలపై పడుతుంది. ♦ తక్షణ అతి పెద్ద సమస్యగా ఉద్యోగుల తొలగింపు. ♦ కొత్తగా వచ్చే విదేశీ ఉద్యోగులకు ఇంగ్లండ్ ఏమంత ఆకర్షణీయ దేశంగా ఉండదు. ♦ బ్రిటన్‌కు చెందని ఐటీ ఉద్యోగులు ఎక్కువ కాలం ఆదేశంలో పనిచేయకపోవచ్చు. ఇతర దేశాల నుంచి ఇంగ్లండ్‌కు కొత్తగా ఐటీ ఉద్యోగులు రాకపోవచ్చు. ఫలితంగా ఇంగ్లండ్ ఐటీ విభాగాలపై ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. ♦ ఐటీ వ్యాపార ప్రాధాన్యత డిజిటల్ బిజినెస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అల్గారిథమిక్ వ్యాపారాలకు మారుతోంది. ఈ కొత్త అంశాలకు నిధుల కోసం పలు కంపెనీలు వ్యయ నియంత్రణ పద్దతులను పాటించనున్నాయి. ♦ డేటా సెంటర్ సిస్టమ్స్ వ్యయాలు ఈ ఏడాది 17,400 కోట్ల డాలర్లకు చేరుతాయి. అంతర్జాతీయ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ వ్యయం 6 శాతం వృద్ధితో 33,200 కోట్ల డాలర్లకు పెరుగుతుంది. డివైస్‌లపై వ్యయం 62,700 కోట్ల డాలర్లకు చేరుతుంది. -
2 బిలియన్ డాలర్లకు దేశీ ఐటీ ఇన్ఫ్రా మార్కెట్!
న్యూఢిల్లీ: దేశీ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్ ఈ ఏడాది స్వల్ప వృద్ధితో 1.93 బిలియన్ డాలర్లకు చేరుతుందని రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ అంచనా వేసింది. ఇది 2020 నాటికి 2.13 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అభిప్రాయపడింది. కాగా గతేడాది ఈ మార్కెట్ 1.9 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు పేర్కొంది. సర్వర్లు, స్టోరేజ్, ఎంటర్ప్రైజ్ నెట్వర్కింగ్ ఉపకరణాలన్నీ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్ పరిధిలోకి వస్తాయి. భారతీయ కంపెనీలు డిజిటల్ బిజినెస్ సవాళ్లను ఎదుర్కోడానికి అనువుగా నెక్ట్స్ జనరేషన్ డేటా సెంటర్లు ఏర్పాటుపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించామని గార్ట్నర్ రీసెర్చ్ డెరైక్టర్ నవీన్ మిశ్రా తెలిపారు. దేశీ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్ వృద్ధిలో ఎంటర్ప్రైజ్ నెట్వర్కింగ్ ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. -
పీసీల పని ఇక అంతేనా..!
ముంబై : ప్రపంచవ్యాప్తంగా పర్సనల్ కంప్యూటర్ల(పీసీ) డిమాండ్ తగ్గిపోతుంది. 2015 మొదటి త్రైమాసికం కంటే 2016 త్రైమాసికంలో పీసీల సరుకు రవాణా 9.6 శాతం తగ్గి, 64.8 మిలియన్ యూనిట్లగా నమోదయ్యాయి. గ్లోబల్ రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ ఈ విషయాన్ని వెల్లడించింది. పీసీల సరుకు రవాణా పడిపోవడంలో ఇది వరుసగా ఆరో త్రైమాసికమని తెలిపింది. మొదటిసారి 2007లో పీసీల రవాణా 65 మిలియన్ యూనిట్ల కంటే తక్కువగా నమోదయ్యాయని పేర్కొంది. డాలర్ విలువను తట్టుకోలేక లోకల్ కరెన్సీలు క్షీణిస్తుండటంతో పీసీల అమ్మకాలు పడిపోవడానికి కారణమవుతున్నాయని గార్ట్నర్ విశ్లేషకుడు మికాకో కిటగవా తెలిపారు. 2015 నాలుగో త్రైమాసికంలో కూడా ఈ ఫలితాలే వచ్చాయన్నారు. ఏటేటా తగ్గుతున్న ఈ అమ్మకాలు, లాటిన్ అమెరికాలో మరింత దారుణంగా పడిపోతున్నాయని పేర్కొన్నారు. లాటిన్ అమెరికాలో పీసీ సరుకు రవాణా 32.4 శాతంకు తగ్గిందన్నారు. లాటిన్ అమెరికా పీసీ మార్కెట్ బ్రెజిల్ పై తీవ్ర ప్రభావాన్ని చూపనుందని మికాకో చెప్పారు. 7.2 శాతం తక్కువ సరుకు రవాణా ఉన్నప్పటికీ చైనీస్ టెక్నాలజీ పీసీ లెనోవా ప్రపంచవ్యాప్తంగా మొదటిస్థానంలో అమ్ముడుపోతోంది. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కొత్త వినియోగదారులను చేరుకోకపోవడం, స్మార్ట్ ఫోన్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం పీసీ డిమాండ్ పడిపోవడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. -
భారత సాఫ్ట్వేర్ మార్కెట్ @ 10 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: భారత్‌లో గతేడాది సాఫ్ట్వేర్ మార్కెట్ 10 శాతం వృద్ధితో 476 కోట్ల డాలర్లకు చేరిందని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ, గార్ట్నర్ పేర్కొంది. క్లౌడ్ ఆధారిత సేవల జోరు పెరగడమే దీనికి కారణమని అంటోన్న ఈ సంస్థ భారత సాఫ్ట్వేర్ మార్కెట్‌పై వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు..., 2012లో భారత సాఫ్ట్వేర్ మార్కెట్ 433 కోట్ల డాలర్లుగా ఉంది. గత ఏడాది భారత సాఫ్ట్వేర్ మార్కెట్లో మైక్రోసాఫ్ట్ అగ్రస్థానంలో నిలిచింది. 2012లో 86.5 కోట్ల డాలర్లుగా ఉన్న ఈ కంపెనీ ఆదాయం 2013లో 11 శాతం వృద్ధితో 95.73 కోట్ల డాలర్లకు చేరింది. భారత సాప్ట్వేర్ మార్కెట్లో ఈ కంపెనీ వాటా 20 శాతంగా ఉంది. 7 శాతం మార్కెట్ వాటా, 50 కోట్ల డాలర్ల ఆదాయంతో ఒరాకిల్ రెండో స్థానంలో ఉంది. బిజినెస్ ఇంటెలిజెన్స్, ఎనలిటిక్స్, డేటా బేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్‌పై వినియోగదారుల పెట్టుబడుల కారణంగా ఒరాకిల్ ఆదాయం పెరిగింది. 44. 6 కోట్ల డాలర్లతో ఐబీఎం మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో సాప్(32.43 కోట్ల డాలర్లు), వివివేర్(9.44 కోట్ల డాలర్లు), సీఏ టెక్నాలజీస్(5.27 కోట్ల డాలర్లు), ఎడోబ్ (4.25 కోట్ల డాలర్లు)లు నిలిచాయి. సాస్, హెచ్పీలు కూడా చెప్పుకోదగ్గ ఆదాయాలను సాధించాయి. {బిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా)దేశాల్లో భారత్‌లోనే సాఫ్ట్వేర్ మార్కెట్ అత్యధిక వృద్ధి సాధించింది. అంతేకాకుండా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చినా కూడా సాఫ్ట్వేర్ మార్కెట్ వృద్ధిలో భారతే ముందంజలో ఉంది. గత కొన్నేళ్లలో విదేశీ మార్కెట్లపైననే ఆధారపడిన భారత సాఫ్ట్వేర్ పరిశ్రమకు దేశీయంగా కూడా కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. ఆర్థిక మందగమన పరిస్థితులున్నప్పటికీ, భారత వాణిజ్య సంస్థలు టెక్నాలజీపై సముచితంగానే పెట్టుబడులు పెడుతున్నాయి. భారీ సంస్థలే కాకుండా చిన్న, మధ్యతరహా వ్యాపార(ఎస్ఎంబీ) సంస్థలు కూడా టెక్నాలజీపై వ్యయాలను పెంచుతున్నాయి. -
పీసీ పోయి ట్యాబ్లెట్ వచ్చే !
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పీసీల అమ్మకాలు తగ్గుతున్నాయి.పెరుగుతున్న ట్యాబ్లెట్ల అమ్మకాలు పీసీలకు గ్రహణం పట్టిచ్చాయని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ తెలిపింది. గత ఏడాది అక్టోబర్ -డిసెంబర్ కాలానికి 8.26 కోట్ల పీసీలు అమ్ముడయ్యాయని పేర్కొంది. 2012లో ఇదే కాలానికి అమ్ముడైన సంఖ్య(8.87 కోట్ల)తో పోల్చితే ఇది 7% తక్కువని పేర్కొంది. గతేడాది మొత్తం మీద 31.59 కోట్ల పీసీలు అమ్ముడయ్యాయి. 2012 అమ్మకాలతో పోల్చితే ఇది 10 శాతం తక్కువ. పీసీ మార్కెట్లో ఇవే అత్యంత అధ్వానమైన అమ్మకాలు. 2009లో కూడా ఇదే స్థాయి అమ్మకాలు జరిగాయి. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలలో పీసీల విక్రయానికి ట్యాబ్లెట్లు గ్రహణం పట్టిచ్చాయి. వృద్ధి చెందుతున్న మార్కెట్లలో వినియోగదారులు కొనుగోలు చేసే తొలి కమ్యూనికేషన్ పరికరం స్మార్ట్‌ఫోన్. ఆ తర్వాత కొనుగోలు చేసే కంప్యూటింగ్ పరికరంగా ట్యాబ్లెట్లు నిలిచాయి. -
ట్యాబ్లెట్ క్రేజ్
ముంబై: ట్యాబ్లెట్ల క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ ఏడాది ట్యాబ్లెట్ల విక్రయాలు ప్రపంచవ్యాప్తంగా 42.7శాతం వృద్ధి చెంది 18.4 కోట్లకు పెరుగుతాయని గార్ట్నర్ తాజా నివేదిక వెల్లడించింది. అదే డెస్క్‌టాప్, నోట్‌బుక్ పీసీల విక్రయాలు 11 శాతం క్షీణించి 30.3 కోట్లకు చేరతాయని ఈ నివేదిక పేర్కొంది. ఇక మొబైల్ ఫోన్ల విక్రయాలు 4 శాతం వృద్ధితో 180 కోట్లకు పెరుగుతాయని వివరించింది. వృద్ధి పరంగా చూస్తే మొబైల్ ఫోన్ల విక్రయాలు 4 శాతం పెరుగుతుండగా, డెస్క్‌టాప్ పీసీల విక్రయాలు 11 శాతం పడిపోతున్నాయి. ట్యాబ్లెట్ల విక్రయాలు మాత్రం 42.7 శాతం పెరగడం విశేషమని గార్ట్నర్ నివేదిక అంటోంది. ఈ నివేదిక వెల్లడించిన మరికొన్ని అంశాలు.., ఈ ఏడాది పీసీలు, ట్యాబ్లెట్లు, మొబైల్స్ విక్రయాలు గతేడాది విక్రయాలతో పోల్చితే 4.5% వృద్ధితో 232 కోట్లకు పెరుగుతాయి. అన్ని కేటగిరీల్లో తక్కువ ధర ఉత్పత్తులకే డిమాండ్ బాగా ఉంటుంది. తక్కువ ధర ఉత్పత్తులకే డిమాండ్ బాగా ఉందనే విషయం ట్యాబ్లెట్ల విషయంలో రుజువైంది. 7 అంగుళాల ప్రీమియం ట్యాబ్లెట్ల ధరలు తగ్గడం కొనసాగుతోంది. కంటెంట్ వీక్షించడానికి చిన్న సైజ్ ట్యాబ్లెట్లకే వినియోగదారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. చిన్న సైజ్ ట్యాబ్లెట్లకే వినియోగదారులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో మధ్య రకం స్మార్ట్ఫోన్లు, చౌక ధర ఆండ్రాయిడ్ ఫోన్ల విక్రయాలతో మొబైల్ మార్కెట్లో వృద్ధి పెరగనుంది. -
తొలి కొనుగోలు... ట్యాబ్లెట్టే
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు వచ్చి ల్యాప్‌టాప్‌లకు,డెస్క్‌టాప్‌లకు గ్రహణం పట్టిచ్చాయని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ, గార్ట్నర్ పేర్కొంది. ఇలా ట్యాబ్లెట్ల జోరు జోరుగా పెరుగుతోందని వివరించింది. 2017 కల్లా తొలిసారిగా కంప్యూటర్లు కొనుగోలు చేయాలనుకుంటున్న వారిలో సగం మంది ట్యాబ్లెట్లనే కొనుగోలు చేస్తారని పేర్కొంది. స్మార్ట్ఫోన్ల రాకతో డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌ల జోరు తగ్గిందంటున్న ఈ సంస్థ వెల్లడించిన ఇతర ముఖ్యాంశాలు.., కంప్యూటర్లు కొనుగోలు చేయాలనుకునేవాళ్లలో 80 శాతానికి పైగా స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఆల్ట్రా మొబైల్ పీసీలను కొనుగోలు చేస్తారు. 2014లో అంతర్జాతీయంగా ఐటీ వ్యయం 3.8 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. 2013లోని అంచనా వ్యయం కంటే ఇది 3.6% అధికం. క్లౌడ్ కంప్యూటింగ్, సోషల్ మీడియా, మొబైల్, ఇన్ఫర్మేషన్, ఇంటర్నెట్ వంటి అంశాలు పునాదులుగా డిజిటల్ ఇండస్ట్రి ఎకానమీ నిర్మితమవుతుంది. 2009లో 250 కోట్ల డివైస్‌లు ఇంటర్నెట్తో అనుసంధానమై ఉన్నాయి.