బెంగళూరు: అంతర్జాతీయ అవుట్‌సోర్సింగ్ మార్కెట్‌కు భౌగోళిక, రాజకీయ అనిశ్చితిపరమైన ముప్పు పొంచి ఉందని రీసెర్చ్ సంస్థ గార్ట్‌నర్ పేర్కొంది. కంపెనీలు సాధ్యమైనంత వరకూ రిస్కులు తగ్గించుకోవడంపై దృష్టి పెడుతున్నాయని వివరించింది. ఆన్‌షోర్, ఆఫ్‌షోర్ వనరుల మేళవింపుతో కంపెనీలు అనుసరిస్తున్న విధానంతో డిమాండ్, సరఫరాపరంగా కొన్నాళ్లుగా విదేశీ అవుట్‌సోర్సింగ్ మార్కెట్ స్థిరంగా ఉంటోందని గార్ట్‌నర్ తెలిపింది. అయితే, శ్రీలంకలో ఉగ్రవాద దాడులు, అమెరికా–చైనా మధ్య వాణిజ్య వివాదం, హాంకాంగ్‌లో రాజకీయ ఆందోళనలు మొదలైన వాటితో సరఫరాపరమైన అనిశ్చితి తలెత్తిందని ఒక నివేదికలో వివరించింది. ఉత్తర అమెరికా, పశ్చిమ యూరప్, జపాన్ మొదలైన దేశాలకు చైనా దాదాపు 10 బిలియన్ డాలర్ల విలువ చేసే ఐటీ అప్లికేషన్స్, బిజినెస్ ప్రాసెస్ సర్వీసులు అందిస్తోంది. భారతీయ అవుట్‌సోర్సింగ్ సంస్థలు .. అంతర్జాతీయంగా సేవల ద్వారా గతేడాది 45 బిలియన్ డాలర్ల పైగా ఆదాయాలు ఆర్జించాయి. అయితే, తాజాగా వాణిజ్య యుద్ధంపై ఆందోళనలతో ఐటీ సేవల విషయంలో చైనాకు ప్రతికూల పరిస్థితులు ఎదురుకావొచ్చని గార్ట్‌నర్ తెలిపింది. ఈ నేపథ్యంలో కంపెనీలు తమ ఆఫ్‌షోర్ అవుట్‌సోర్సింగ్ ఒప్పందాలను పునఃసమీక్షించుకోవడం శ్రేయస్కరమని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment