న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు వచ్చి ల్యాప్‌టాప్‌లకు,డెస్క్‌టాప్‌లకు గ్రహణం పట్టిచ్చాయని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ, గార్ట్‌నర్ పేర్కొంది. ఇలా ట్యాబ్లెట్ల జోరు జోరుగా పెరుగుతోందని వివరించింది. 2017 కల్లా తొలిసారిగా కంప్యూటర్లు కొనుగోలు చేయాలనుకుంటున్న వారిలో సగం మంది ట్యాబ్లెట్‌లనే కొనుగోలు చేస్తారని పేర్కొంది. స్మార్ట్‌ఫోన్‌ల రాకతో డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌ల జోరు తగ్గిందంటున్న ఈ సంస్థ వెల్లడించిన ఇతర ముఖ్యాంశాలు..,
- కంప్యూటర్లు కొనుగోలు చేయాలనుకునేవాళ్లలో 80 శాతానికి పైగా స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్‌లు, ఆల్ట్రా మొబైల్ పీసీలను కొనుగోలు చేస్తారు.
- 2014లో అంతర్జాతీయంగా ఐటీ వ్యయం 3.8 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. 2013లోని అంచనా వ్యయం కంటే ఇది 3.6% అధికం.
- క్లౌడ్ కంప్యూటింగ్, సోషల్ మీడియా, మొబైల్, ఇన్ఫర్మేషన్, ఇంటర్నెట్ వంటి అంశాలు పునాదులుగా డిజిటల్ ఇండస్ట్రి ఎకానమీ నిర్మితమవుతుంది.
- 2009లో 250 కోట్ల డివైస్‌లు ఇంటర్నెట్‌తో అనుసంధానమై ఉన్నాయి.