ట్యాబ్లెట్ క్రేజ్
ముంబై: ట్యాబ్లెట్ల క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ ఏడాది ట్యాబ్లెట్ల విక్రయాలు ప్రపంచవ్యాప్తంగా 42.7శాతం వృద్ధి చెంది 18.4 కోట్లకు పెరుగుతాయని గార్ట్‌నర్ తాజా నివేదిక వెల్లడించింది. అదే డెస్క్‌టాప్, నోట్‌బుక్ పీసీల విక్రయాలు 11 శాతం క్షీణించి 30.3 కోట్లకు చేరతాయని ఈ నివేదిక పేర్కొంది. ఇక మొబైల్ ఫోన్‌ల విక్రయాలు 4 శాతం వృద్ధితో 180 కోట్లకు పెరుగుతాయని వివరించింది. వృద్ధి పరంగా చూస్తే మొబైల్ ఫోన్‌ల విక్రయాలు 4 శాతం పెరుగుతుండగా, డెస్క్‌టాప్ పీసీల విక్రయాలు 11 శాతం పడిపోతున్నాయి. ట్యాబ్లెట్‌ల విక్రయాలు మాత్రం 42.7 శాతం పెరగడం విశేషమని గార్ట్‌నర్ నివేదిక అంటోంది. ఈ నివేదిక వెల్లడించిన మరికొన్ని అంశాలు..,
- ఈ ఏడాది పీసీలు, ట్యాబ్లెట్‌లు, మొబైల్స్ విక్రయాలు గతేడాది విక్రయాలతో పోల్చితే 4.5% వృద్ధితో 232 కోట్లకు పెరుగుతాయి.
- అన్ని కేటగిరీల్లో తక్కువ ధర ఉత్పత్తులకే డిమాండ్ బాగా ఉంటుంది.
- తక్కువ ధర ఉత్పత్తులకే డిమాండ్ బాగా ఉందనే విషయం ట్యాబ్లెట్ల విషయంలో రుజువైంది. 7 అంగుళాల ప్రీమియం ట్యాబ్లెట్‌ల ధరలు తగ్గడం కొనసాగుతోంది.
- కంటెంట్ వీక్షించడానికి చిన్న సైజ్ ట్యాబ్లెట్‌లకే వినియోగదారులు ప్రాధాన్యత ఇస్తున్నారు.
- చిన్న సైజ్ ట్యాబ్లెట్‌లకే వినియోగదారులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
-
అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో మధ్య రకం స్మార్ట్‌ఫోన్‌లు, చౌక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌ల విక్రయాలతో మొబైల్ మార్కెట్లో వృద్ధి పెరగనుంది.