పీసీ పోయి ట్యాబ్లెట్ వచ్చే ! | PC sales hit rock bottom in 2013 as tablet dominance continues | Sakshi
Sakshi News home page

పీసీ పోయి ట్యాబ్లెట్ వచ్చే !

Published Sat, Jan 11 2014 12:48 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM

PC sales hit rock bottom in 2013 as tablet dominance continues

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పీసీల అమ్మకాలు తగ్గుతున్నాయి.పెరుగుతున్న ట్యాబ్లెట్ల అమ్మకాలు పీసీలకు గ్రహణం పట్టిచ్చాయని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ గార్ట్‌నర్ తెలిపింది.  గత ఏడాది అక్టోబర్ -డిసెంబర్ కాలానికి 8.26 కోట్ల పీసీలు అమ్ముడయ్యాయని పేర్కొంది. 2012లో ఇదే కాలానికి అమ్ముడైన సంఖ్య(8.87 కోట్ల)తో పోల్చితే ఇది 7% తక్కువని పేర్కొంది.
 

  •  గతేడాది మొత్తం మీద 31.59 కోట్ల పీసీలు అమ్ముడయ్యాయి. 2012 అమ్మకాలతో పోల్చితే ఇది 10 శాతం తక్కువ.
  •  పీసీ మార్కెట్లో ఇవే అత్యంత అధ్వానమైన అమ్మకాలు. 2009లో కూడా ఇదే స్థాయి అమ్మకాలు జరిగాయి.
  • అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలలో పీసీల విక్రయానికి ట్యాబ్లెట్లు గ్రహణం పట్టిచ్చాయి.
  • వృద్ధి చెందుతున్న మార్కెట్లలో వినియోగదారులు కొనుగోలు చేసే తొలి కమ్యూనికేషన్ పరికరం స్మార్ట్‌ఫోన్. ఆ తర్వాత కొనుగోలు చేసే కంప్యూటింగ్ పరికరంగా ట్యాబ్లెట్‌లు నిలిచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement