స్లిమ్‌గా, నాజుగ్గా ఉండాలని అందరూ కోరుకుంటారు. అందులో తప్పులేదు. కానీ అందుకోసం అనుసరించే పద్ధతులు ఆరోగ్యకరమైన రీతిలో ఉంటే పర్లేదు. షార్ట్‌కట్‌లో త్వరితగితన తగ్గాలని రకరకాల ట్రీట్‌మెంట్‌లు, మందులు జోలికి వెళ్తే మాత్రం లేనిపోని సమస్యలు తలెత్తడమే గాక ఒక్కోసారి అదే మీ ప్రాణాలు కోల్పోయే స్థితికి తీసుకోస్తాయి కూడా. అందుకు ఈ ఉదంతమే ఉదహరణ. కూతురు పెళ్లిలో చక్కగా స్లిమ్‌గా కనిపించాలనుకోవడమే శాపమై ప్రాణాలను కోల్పోయేలా చేసింది. ఈ విషాధ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే..ఆస్ట్రేలియాకు చెందిన 56 ఏళ్ల ట్రిష్ వెబ్‌స్టర్ మహిళ తన కూతురు పెళ్లిలో స్లిమ్‌గా కనిపించాలనుకుంది. అందుకోసం వైద్యులను సంప్రదించి మరీ ఓజెంపిక్ మాత్రలను వాడటం ప్రారంభించింది. ఆ మ్రాతలను వాడిన ఐదు నెలల్లోనే ఏకంగా 15 కిలోల బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. బరవు తగ్గుతుందనుకునే లోపు ఉన్నటుండి హఠాత్తుగా ఓ రోజు కుప్పకూలి చనిపోయింది. కుటుంబ సభ్యులు ఆమెకు సీఆర్‌పీ చేసి.. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండాపోయింది.
దీన్ని ప్రధానంగా టైప్-2 మధుమేహానికి ఉపయోగిస్తారు. చర్మం కింద ఇంజెక్షన్‌గా ఉపయోగిస్తారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానకి సమర్థవంతంగా ఉంటుందని పేషెంట్లకు ఈ మాత్రను సూచిస్తుంటారు. అదే ఆమెకు శాపమై జీర్ణశయాంతర వ్యాధికి దారితీసి చనిపోయినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.
బరువు తగ్గేందుకు ఉపయోగిస్తారా?
ఈ ఓజెంపిక్ మాత్రను బరువు తగ్గించడానికి ప్రసిద్ధ ఔషధంగా ఉపయోగిస్తారు. సహజ హర్మోన్ జీఎల్‌పీ-1ను ప్రేరిపించి బరువు కోల్పోయేలా చేస్తుంది. ఇది కడుపు, ప్రేగుల్లోకి ఆహారం వెళ్లడాన్ని నెమ్మదిస్తుంది. ఈ ట్యాబ్లెట్ వేసుకున్నవాళ్లకు ఎక్కువసేపు పొట్ట ఫిల్ అయ్యి ఉన్న అనుభూతి కలుగుతుంది. దీంతో ఆటోమేటిక్‌గా ఎక్కువ ఆహారం తీసుకోలేరు. దీని వల్ల కొందరిలో తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తినట్లు పలు కేసుల్లో వెలడైంది కూడా.
చాలామంది వైద్యులు దీన్ని సిఫార్సు చేసేందుకు మొగ్గు చూపడం లేదని సమాచారం. ఇక్కడ ఈ మహిళ బరువు తగ్గాలనే ఉద్దేశంతో అదే పనిగా ఈ మాత్రలను కొన్ని నెలలుగా వేసుకోవడంతో తీవ్ర అస్వస్థతకు దారితీసి మరణానికి కారణమైంది. ఆమె చనిపోయే టైంలో ఆమె నోటి నుంచి ఒక విధమైన గోధుమ రంగులో నురుగ వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ మాత్ర అధికంగా వాడితే ఇలియస్ అనే పరిస్థితికి దారితీసి ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు
ఓజెంపిక్ దుష్ప్రభావాలు
ఇతర మందులు మాదిరిగానే ఇది కూడా కొన్ని రకాల దుష్ప్రభావాలను చూపిస్తుంది. అవేంటంటే..
- మలబద్ధకం
- అతిసారం
- వికారం
- పొత్తి కడుపు నొప్పి
- వాంతులు,వికారం
- ప్యాంక్రియాటైటిస్ లేదా ప్యాంక్రియాస్‌లో మంట
- థైరాయిడ్ క్యాన్సర్
- డయాబెటిక్ రెటినోపతి, కళ్లకు హాని కలిగిస్తుంది
- హైపోగ్లైసీమిక్ లేదా తక్కువ రక్త చక్కెర
- పిత్తాశయ వ్యాధి పిత్తాశయ రాళ్లు, మీ పిత్తాశయం వాపు
- అలర్జీలు తదితర సమస్యలు ఉత్ఫన్నమైతే తక్షణమే ఆరోగ్య నిపుణుడిని సంప్రదించమని వైద్యులు సూచిస్తున్నారు
(చదవండి: రోజూ ఒక కప్పు 'టీ' తాగితే.. మధుమేహం ఉండదు! పరిశోధనల్లో షాకింగ్ విషయాలు)
Comments
Please login to add a commentAdd a comment