2 బిలియన్ డాలర్లకు దేశీ ఐటీ ఇన్ఫ్రా మార్కెట్!
న్యూఢిల్లీ: దేశీ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్ ఈ ఏడాది స్వల్ప వృద్ధితో 1.93 బిలియన్ డాలర్లకు చేరుతుందని రీసెర్చ్ సంస్థ గార్ట్‌నర్ అంచనా వేసింది. ఇది 2020 నాటికి 2.13 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అభిప్రాయపడింది. కాగా గతేడాది ఈ మార్కెట్ 1.9 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు పేర్కొంది. సర్వర్లు, స్టోరేజ్, ఎంటర్‌ప్రైజ్ నెట్‌వర్కింగ్ ఉపకరణాలన్నీ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్ పరిధిలోకి వస్తాయి. భారతీయ కంపెనీలు డిజిటల్ బిజినెస్ సవాళ్లను ఎదుర్కోడానికి అనువుగా నెక్ట్స్ జనరేషన్ డేటా సెంటర్లు ఏర్పాటుపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించామని గార్ట్‌నర్ రీసెర్చ్ డెరైక్టర్ నవీన్ మిశ్రా తెలిపారు. దేశీ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్ వృద్ధిలో ఎంటర్‌ప్రైజ్ నెట్‌వర్కింగ్ ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.