క్షీణించిన సన్ ఫార్మా లాభం
న్యూఢిల్లీ: హెల్త్కేర్ రంగ దిగ్గజం సన్ ఫార్మా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం స్వల్పంగా 2 శాతం నీరసించి రూ. 2,022 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 2,061 కోట్లు ఆర్జించింది. అయితే సర్దుబాటు తదుపరి నికర లాభం 14 శాతం పుంజుకుని రూ. 2,345 కోట్లను తాకింది.
మొత్తం ఆదాయం మాత్రం రూ. 10,764 కోట్ల నుంచి రూ. 12,145 కోట్లకు ఎగసింది. అంచనాలకు అనుగుణంగా అన్ని విభాగాలూ వృద్ధి బాటలో సాగుతున్నట్లు కంపెనీ ఎండీ దిలీప్ సంఘ్వీ పేర్కొన్నారు. యూఎస్ ఫార్ములేషన్ అమ్మకాలు 12 శాతం బలపడి 47.1 కోట్ల డాలర్లను తాకాయి. ఇవి ఆదాయంలో 33 శాతంకాగా.. దేశీ విక్రయాలు మొత్తం ఆదాయంలో 30 శాతం వాటాను ఆక్రమిస్తున్నట్లు దిలీప్ వెల్లడించారు.
ఫలితాల నేపథ్యంలో సన్ ఫార్మా షేరు బీఎస్ఈలో 0.4 శాతం లాభంతో రూ. 1,141 వద్ద ముగిసింది