ఐటీ సెక్టార్‌కు మరింత బ్యాడ్ న్యూస్
ఐటీ సెక్టార్‌కు మరింత బ్యాడ్ న్యూస్
Published Thu, Jul 13 2017 6:58 PM | Last Updated on Tue, Sep 5 2017 3:57 PM
ముంబై : ఐటీ రంగానికి మరింత బ్యాడ్ న్యూస్. గ్లోబల్ ఐటీ రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ మరోసారి ఐటీ వ్యయాల వృద్ధి అంచనాలను తగ్గించింది. డిజిటైజేషన్ ఆందోళనతో 2.7 శాతంగా అంచనావేసిన వ్యయాల వృద్ధిని 2017లో 2.4 శాతానికి తగ్గిస్తున్నట్టు పేర్కొంది. తొలుత ప్రపంచవ్యాప్తంగా ఐటీ వ్యయాల వృద్ధి 3 శాతంగా గార్ట్నర్ అంచనావేసింది. తర్వాత దీన్ని ఈ ఏడాది జనవరి సమీక్షలో 2.7 శాతానికి కుదించింది. భవిష్యత్తు ఐటీ ఇండస్ట్రీ వృద్ధిపై ఆందోళనకర పరిస్థితులు తలెత్తుతున్న నేపథ్యంలో గార్ట్నర్ రెండోసారి ఈ ఏడాదిలో వ్యయాల వృద్ధి అంచనాలను తగ్గించేసింది. అదేవిధంగా వ్యయాల వృద్ధి అంచనాలు పడిపోవడంతోపాటు ఆటోమేషన్ పెనుముప్పులా ముంచుకొస్తుడటం, రక్షణాత్మక ధోరణి భారత్‌లో ఉద్యోగాల కోతపై భయాందోళనను కూడా కలిగిస్తున్నాయి.
155 బిలియన్ డాలర్ల మన దేశీయ ఐటీ సెక్టార్ ఎక్కువగా ఎగుమతులపైనే ఆధారపడి ఉంది. నాస్కామ్ కూడా గత నెలలో 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల వృద్ధిని తక్కువగా 7-8 శాతంగానే అంచనావేసింది. ప్రస్తుత వ్యాపారాలకు డిజిటల్ బిజినెస్‌లు లోతైన ప్రభావం చూపుతున్నాయని గార్ట్నర్ వైస్ ప్రెసిడెంట్ జాన్-డేవిడ్ లవ్‌లాక్ ప్రకటనలో తెలిపారు. డిజిటల్ బిజినెస్‌లు, కొత్త కేటగిరీలు సాఫ్ట్‌వేర్ ప్లస్ సర్వీసెస్, మేధోసంపత్తి హక్కుల్లో వృద్ధికి దోహదం చేస్తాయన్నారు. అయితే గార్ట్నర్ ప్రస్తుతం అంచనావేసిన వ్యయాల వృద్ధి అంచనాలు 2016లో సాధించిన దానికంటే 0.3 శాతం వేగవంతంగానే ఉన్నాయి. ఇది ఇండస్ట్రీని 3.477 ట్రిలియన్ డాలర్ల డాలర్లకు తీసుకెళ్తుందని గార్ట్నర్ భావిస్తోంది.
Advertisement
Advertisement