ఆన్‌లైన్ షాపింగ్‌కి ఓ అడ్డా!
పరిపరిశోధన
ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక దేశంలో ఆన్‌లైన్ షాపింగ్ విస్తృతం అవుతోంది. అనేక వెబ్‌సైట్‌లు అనేక ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చి మార్కెటింగ్ చేస్తున్నాయి. ఆన్‌లైన్ షాపింగ్‌కుఏ సైట్ ఉత్తమమైనది? అంటే... ఎందులో మంచి ఆఫర్‌లు ఉంటే అది బెస్ట్ అని చెప్పవచ్చు.ఆన్‌లైన్ షాపింగ్‌కు అవకాశం ఇస్తున్న వెబ్‌సైట్‌లు ఎన్నో ఉంటాయి... వాటిలో పాపులర్ అయినవి కొన్ని పాపులర్ కాని, మనకు తెలియనివి కొన్ని. మరి అన్నింటినీ తెలుసుకొని, గుర్తు పెట్టుకొని, ఆ సైట్లను క్లిక్ చేసి మనకు కావాల్సిన ప్రోడక్ట్‌ను వెదుక్కొవడం కొంచెం కష్టమైన పనే! ఆన్‌లైన్ షాపింగ్‌కు అవకాశం ఇచ్చే అన్ని వెబ్‌సైట్‌లను గుర్తు పెట్టుకోవడమూ కొంచెం కష్టమైన పనే. ఆడవాళ్లకి ఈ కష్టం లేకుండా చేయడానికే ఉంది క్లిప్‌డాట్‌ఇన్ (జుజీఞ.జీ). ఆన్‌లైన్‌షాపింగ్‌కు సంబంధించి అన్ని వెబ్‌సైట్‌లనూ ఒకచోటికి కూర్చిపెట్టింది ఈ సైట్.
ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు అన్ని ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లను ఇది ఒకచోటికి చేర్చింది. వాటన్నింటినీ హోమ్‌పేజ్‌లో డిస్‌ప్లే చేసింది. ఈ సైట్‌లోకి లాగిన్ అయితే చాలు... ఎంచక్కా వాటన్నింటిపైనా ఒక లుక్ వేయవచ్చు. ఆన్‌లైన్ షాపింగ్ చేసేయవచ్చు. దీనివల్ల చాలా సౌకర్యం ఉంటుంది. ఒక వెబ్‌సైట్‌నుంచి టక్కున మరో వెబ్‌సైట్‌లోకి మారడానికి... పక్కపక్క విండోల్లో ఒక్కోసైట్‌ను ఓపెన్ చేసుకొని పోల్చిచూసుకోవడానికి క్లిప్‌డాట్‌ఇన్ అవకాశం ఇస్తుంది. అలాగే కావాల్సిన క్యాటగిరీ సైట్‌లను ఎంపిక చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. వస్త్రాలు, గృహావసరాలకు తగినట్టుగా సైట్‌లను ఎంచుకోవచ్చు. ఆన్‌లైన్‌షాపింగ్‌లో కొత్త అనుభవాన్ని పొందాలంటే ఒకసారి క్లిప్‌డాట్‌ఇన్‌ను క్లిక్ చేసేయండి మరి!