ఆన్‌లైన్ అలర్ట్
జాగ్రత్త
ఆన్‌లైన్ షాపింగ్‌ను మీరు ఎక్కడ చేసినా ఇంటర్‌నెట్ మధ్యలో డిస్కనెక్ట్ కాకుండా చూసుకోవాలి.ఒకవేళ మొబైల్ ద్వారా చేసేట్టయితే వెబ్‌సైట్లలో కంటే యాప్స్‌లోంచి చేయడం మంచిది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ ఇలా అన్ని ఆన్‌లైన్ మార్కెట్ల యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వాటి నుంచి చేస్తే కొనుగోలుకు ఎక్కువ సమయం కూడా పట్టదు.విష్‌లిస్ట్ ముఖ్యం.. పండుగకు ఏమేమి కొనాలనుకుంటున్నారో, ఎంత ధర దానికి వెచ్చించగలరో ముందుగానే ప్లాన్ వేసుకోండి. అలా అయితే మీకు సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి.
ఆన్‌లైన్ ప్రాడక్ట్స్ కొనుగోలు చేసేటప్పుడు డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. క్యాష్ ఆన్ డెలివరీని ఎంచుకోవడమే అత్యుత్తమం.షాపింగ్‌కు ఇంట్లోని కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లను మాత్రమే ఉపయోగించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్‌లైన్ పేమెంట్‌ను పబ్లిక్ ఇంటర్‌నెట్ కేఫుల నుంచి చేయకండి.