యాపిల్ కంపెనీ చైనాలోని తన ఉత్పత్తులపై భారీ తగ్గింపును అందిస్తుంది. చైనాలోని ఆన్‌లైన్ రిటైల్ ప్లాట్‌ఫామ్ ‘ట్మాల్’ వెబ్‌సైట్‌లో యాపిల్ ఐఫోన్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రచారాన్ని ప్రారంభించింది.
ఎంపిక చేసిన ఐఫోన్ మోడళ్లపై 2,300 యువాన్ల (సుమారు రూ.26వేలు) వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెబ్‌సైట్‌లో ప్రకటనలు వెలిశాయి. ఈ ఆఫర్ మే 20 నుంచి 28 వరకు మాత్రమే ఉంటుందని ప్రచారం సాగుతోంది. హువాయ్ వంటి స్థానిక బ్రాండ్‌ల నుంచి యాపిల్‌కు గట్టిపోటీ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని వార్తా సంస్థలు కథనాల వెలువరించాయి. దాంతోపాటు యాపిల్ కొత్త మోడల్ లాంచ్ చేస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఉన్నవాటికి ధర తగ్గిస్తుందనే వాదనలున్నాయి. ప్రస్తుతం యాపిల్ ఇస్తున్న డిస్కౌంట్ ఫిబ్రవరిలో ప్రకటించిన తగ్గింపు కంటే ఎక్కువగా ఉంది. అప్పుడు అత్యధికంగా 1,150 యువాన్లు మాత్రమే డిస్కౌంట్ ఇచ్చారు.
చైనాలో ప్రముఖ హైఎండ్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హువాయ్ గత నెలలో ‘పురా 70’ అనే మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇటీవల యాపిల్ ఐఫోన్ అమ్మకాలు తగ్గుతున్నాయి. చైనా అకాడమీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (సీఏఐసీటీ) డేటా ఆధారంగా మార్చిలో యాపిల్ ఎగుమతులు 12% పెరిగాయి. అయితే అమ్మకాలు మాత్రం 37% తగ్గాయి. దాంతో కంపెనీ భారీ రాయితీలు ఇస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment