Yuan
-
ఐఫోన్‌పై రూ.26వేలు డిస్కౌంట్.. ఎక్కడంటే..
యాపిల్ కంపెనీ చైనాలోని తన ఉత్పత్తులపై భారీ తగ్గింపును అందిస్తుంది. చైనాలోని ఆన్లైన్ రిటైల్ ప్లాట్‌ఫామ్ ‘ట్మాల్’ వెబ్సైట్లో యాపిల్ ఐఫోన్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రచారాన్ని ప్రారంభించింది.ఎంపిక చేసిన ఐఫోన్ మోడళ్లపై 2,300 యువాన్ల (సుమారు రూ.26వేలు) వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెబ్సైట్లో ప్రకటనలు వెలిశాయి. ఈ ఆఫర్ మే 20 నుంచి 28 వరకు మాత్రమే ఉంటుందని ప్రచారం సాగుతోంది. హువాయ్ వంటి స్థానిక బ్రాండ్ల నుంచి యాపిల్‌కు గట్టిపోటీ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని వార్తా సంస్థలు కథనాల వెలువరించాయి. దాంతోపాటు యాపిల్ కొత్త మోడల్ లాంచ్ చేస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఉన్నవాటికి ధర తగ్గిస్తుందనే వాదనలున్నాయి. ప్రస్తుతం యాపిల్ ఇస్తున్న డిస్కౌంట్ ఫిబ్రవరిలో ప్రకటించిన తగ్గింపు కంటే ఎక్కువగా ఉంది. అప్పుడు అత్యధికంగా 1,150 యువాన్లు మాత్రమే డిస్కౌంట్ ఇచ్చారు.చైనాలో ప్రముఖ హైఎండ్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హువాయ్ గత నెలలో ‘పురా 70’ అనే మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇటీవల యాపిల్ ఐఫోన్ అమ్మకాలు తగ్గుతున్నాయి. చైనా అకాడమీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (సీఏఐసీటీ) డేటా ఆధారంగా మార్చిలో యాపిల్ ఎగుమతులు 12% పెరిగాయి. అయితే అమ్మకాలు మాత్రం 37% తగ్గాయి. దాంతో కంపెనీ భారీ రాయితీలు ఇస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి..ఈ పతనం ఎందాక?
RupeeRecordLow దేశీయ కరెన్సీ రూపాయి అమెరికా డాలరు మారకంలో ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇటీవల బలహీనంగా ఉన్న రూపాయి డాలర్‌తో పోలిస్తే 83కి పడిపోయిన తరువాత మరింత పతనాన్ని నమోదు చేసింది. ఆగస్ట్ 17, గురువారం అక్టోబర్ నాటి రికార్డు కనిష్ట స్థాయి 83.29ని స్థాయికి దిగజారింది. అయితే శుక్రవారం ఆరంభంలో కొద్దిగా పుంజుకుని 83.11వద్ద కొనసాగుతోంది.మునుపటి ముగింపు 83.15 నుంచి 83.02 వద్ద ట్రేడింగ్ ఆరంభించింది. గురువారం 20 పైసలు క్షీణించి డాలర్‌తో కనిష్ట స్థాయి 83.15 వద్ద రికార్డు క్లోజింగ్‌ను నమోదు చేసింది. ఈ పతనం ఎందుకు రూపాయిపై పలు అంశాలు ప్రభావం చూపుతున్నాయి. మున్ముందు ఆల్ టైమ్ కనిష్టానికి కొనసాగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలతోపాటు, డాలర్లో ఇటీవలి స్పైక్ మరియు ట్రెజరీ ఈల్డ్‌ల నేపథ్యంకూడా పనిచేస్తోంది. మరోవైపు చైనీస్ యువాన్ పతనం, ఎగుమతి పోటీతత్వంపై ఆందోళనల కారణంగా దేశీయ కరెన్సీనెగిటివ్గాఉందనిన మోతీలాల్ ఓస్వాల్‌లోని రీసెర్చ్ - కమోడిటీస్ & కరెన్సీల వైస్ ప్రెసిడెంట్ అమిత్ సజేజా అన్నారు. ఆగస్టు 11, 2023న విడుదల చేసిన డేటా ప్రకారం, జూన్ నెలలో భారతదేశపు IIP 3.7 శాతం పడిపోయింది, ఇది మేలో 5.2 శాతంగా ఉంది. అలాగే ఆహార ధరల సెగ కారణంగా జూలై రీటైల్ ఇన్ఫ్లేషన్ 7.44శాతం వద్ద భారీగా పెరిగింది. ( 23 కొత్త ఫీచర్లతో హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్, ధర ఎంతంటే?) చైనా యువాన్ క్షీణత చైనా యువాన్ పతనం స్థానిక రూపాయిపై కూడా ప్రభావం చూపింది. యువాన్ ఈ వారం 0.6శాతం మరియు ఈ సంవత్సరం 5.3శాతం క్షీణించింది. దేశం యొక్క విస్తారమైన ఆస్తి రంగంలో పెరుగుతున్న రుణ సంక్షోభం , ఆర్థిక పునరుద్ధరణ గురించి ఆందోళనలు యువాన్‌పై ఒత్తిడి తెస్తున్నాయి. తాజాగా దేశీయ అతిపెద్ద ప్రాపర్టీ డెవలపర్ ఎవర్ గ్రాండే దివాల ప్రకటించడం, యూఎస్‌లోని అస్తుల రక్షణనిమిత్తం అక్కడి కోర్టును ఆశ్రయించడంమరింత ఆందోళన రేకెత్తించింది. (సంక్షోభం: చైనా రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్‌గ్రాండే సంచలనం) చమురు సెగ మరోవైపు ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.07శాతం పెరిగి 84.18కి డాలర్ల వద్దకు చేరుకోగా, US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ (WTI) బ్యారెల్‌కు 0.26శాతం పెరిగి 80.60 డాలర్ల స్థాయికి చేరింది. చేరుకుంది. దేశీయంగా, భారత ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు, సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. గురువారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) నికర రూ.1,510.86 కోట్ల విలువైన భారతీయ షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (DIIలు) నికర రూ.313.97 కోట్ల షేర్లను విక్రయించారు. -
రూపీ రూబుల్ పేరు చెప్పి చైనీస్ యువాన్‌తో కానిచ్చేశారేంటీ!?
ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో మారిన అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో రష్యాతో వ్యాపార సంబంధాలు యూఎస్ డాలర్లలో కాకుండా ఇండియన్ రూపీ, రష్యా రూపీలతో జరిపేందుకు సన్నహకాలు జోరుగా సాగుతున్నాయి. అయితే తాజాగా రష్యా నుంచి ఇండియాకు వస్తున్న ఓ బొగ్గు రవాణా ఒప్పందం రూపీ రూబుల్ ప్రయత్నాలకు చిన్న ఝలక్ ఇచ్చినట్టయ్యింది. ఇండియాలో అతి పెద్ద సిమెంట్ బ్రాండ్‌గా పేరొందిన ఆల్ట్రాటెక్ ఓ వివాస్పద నిర్ణయం తీసుకుందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆల్ట్రాటెక్ రష్యా నుంచి భారీ ఎత్తున బొగ్గును దిగుమతి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు జూన్ 5న ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం రష్యా బొగ్గు కొనుగోలు కోసం ఎప్పటి లాగే యూఎస్ డాలర్లలోనూ లేదా ఇండియన్ రూపీలతో కాకుండా చైనీస్ కరెన్సీ యూవాన్లలో చెల్లించింపులు చేసినట్టు తెలుస్తోంది. ఈ దిగుమతి డీల్‌కు సంబంధించిన ఒప్పంద పత్రాల ప్రకారం రష్యా నుంచి 1,57,000 టన్నుల బొగ్గును అల్ట్రాటెక్ దిగుమతి చేసుకుంటోంది. ఈ డీల్‌కు సంధానకర్తగా దుబాయ్‌కి చెందిన సుయెక్ సంస్థ వ్యవహరించింది. తూర్పు రష్యాలోనే వానినో పోర్టు నుంచి మన దగ్గర కాండ్లా పోర్టుకు ఈ బొగ్గు రవాణా కానుంది. లక్షా యాభై ఏడు వేల టన్నుల బొగ్గు కొనుగోలు కోసం ఆల్ట్రాటెక్ 172,652,900 యూవాన్లు (25.81 మిలియన్లు) చెల్లించినట్టుగా ఉంది. గడిచిన ఇరవై ఏళ్లలో రష్యాతో జరిపే లావాదేవీల్లో ఇండియన్ కంపెనీలు చైనీస్ కరెన్సీలో చెల్లింపులు చేసిన దాఖలాలు లేవని అంతర్జాతీయ వ్యవహరాలను పరిశీలించే నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ లావాదేవీల్లో చైనీస్ యూవాన్ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల డాలర్‌కు సమాంతరంగా యూవాన్ ఎదిగేందుకు అవకాశం ఉంది. ఉక్రెయిన్‌పై దాడి తర్వాత రష్యాపై అమెరికాతో సహా పశ్చిమ దేశాలు కఠిన ఆర్థిక ఆంక్షలు విధించాయి. దీంతో డాలర్‌కు ప్రత్యామ్నయంగా ఇతర కరెన్సీలో లావాదేవీలు జరిపేందుకు రష్యా కూడా సముఖంగానే ఉంది. దీంతో రూపీ - రూబుల్ లావాదేవీల అంశం తెరపైకి వచ్చింది. ఇదింకా చర్చల దశలో ఉండగానే రూబుల - యువాన్ సంబంధం గట్టిపడటం అనేది మన విదేశాంగ విధానానికి కొంత వరకు మింగుడుపడని అంశమనే భావన నెలకొంది. చదవండి: కమర్షియల్ బొగ్గు గనుల వేలం..బిడ్స్ దాఖలు చేసిన 31 సంస్థలు! -
కరెన్సీ వాన కురిపించిన ఏటీఎం
షాంఘై : ఆకాశం నుంచి బంగారం, వజ్రాలు, ప్లాటీనం లాంటి విలువైన వస్తువుల జారీ విమానం రన్‌వే మీద పడడం ఈ మధ్యే చూశాం కదా. ఆ దృశ్యం మరవకముందే చైనాలో మరో విస్తుగొల్పే సంఘటన చోటు చేసుకుంది. చైనాలోని ఒక ఏటీఎం నుంచి నోట్లు ప్రవాహంలా బయటకు వస్తున్నాయి. ఆశ్చర్యం గొల్పే ఈ సంఘటన ఈ నెల 6న చైనాలోని నింగ్బో పట్టణంలో చోటుచేసుకుంది. జరిగిన ఈ సంఘటన అంతా ఏటీఎం బూత్ సర్వేలైన్ సీసీ టీవీ కెమరాలో రికార్డైంది. ఒక్క నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో ఓ రెండు సెకన్లపాటు ఏటీఎం నుంచి వందలాది నోట్లు బయటకు వచ్చాయి. వీటి విలువ సుమారు 3వేల యువాన్లు (500 వందల అమెరికన్ డాలర్లు). ఏటీఎం మిషన్‌లో ఓ చిన్న సమస్య తలెత్తడంతో ఈ సంఘటన జరిగినట్టు తెలిసింది. ఆ సమయంలో ఆ దారిలో వెళ్తున్న ఓ జంట ఈ జాక్‌పాట్‌ను కొట్టేశారు. నేలపై పడివున్న నోట్లను గమనించి, వాటిని తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు. సీసీటీవీలో రికార్డయితే పోలీసులు పట్టుకుంటారనే ఉద్దేశ్యంతో, వారు ఎక్కడ కూడా తల పైకెత్తలేదు. అందువల్ల సీసీటీవీ కెమెరాల్లో వారి ముఖాలు సరిగా రికార్డవ్వలేదు. అయితే వారి దగ్గర్నుంచి నగదును వెనక్కి రప్పించడం కోసం, ఆ ఇద్దరిన్నీ ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు తమ ప్రయత్నాలను ప్రారంభించారు. -
కరెన్సీ వాన కురిపించిన ఏటీఎం
-
కరెన్సీ కరెంటు!
ఇదెక్కడి విడ్డూరమని ఆశ్చర్యపోతున్నారా... ఇది నిజమే. చైనాలో 100 యువాన్ల నోట్లను ఫోర్జరీకి అవకాశం లేకుండా కొత్తవి తయారుచేశారు. మరి పాతవాటిని ఏం చేయాలి. బ్యాంకుల్లో పాతవి తీసుకొని... కొత్తనోట్లను జనాలకు అందజేస్తున్నారు. పాతవాటిని మిషన్లలో వేసి చిన్నచిన్న ముక్కలుగా కోసి... బండిల్స్ చేస్తున్నారు. ఈ బండిల్స్‌ను తూర్పు చైనాలోని జింగ్సూ ప్రావిన్సు యాన్‌చెంగ్ పట్టణానికి పంపిస్తున్నారు. చైనా నలుమూలల నుంచి ఈ కరెన్సీ తుక్కుతో కూడిన లారీ లోడ్లు యాన్చెంగ్కు వస్తున్నాయట. వీటిని మండించి ప్రతిరోజు 30,000 కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ కరెన్సీలో మండించాక వచ్చే బూడిదను (ఫ్లైయాష్)ను ఇటుకల తయారీకి కూడా వాడుతున్నారు. ఎంత మంచి ఐడియానో కదూ. అయితే ఈ ఏడాది విద్యుదుత్పత్తి కోసం మండించిన కరెన్సీ విలువెంతో తెలుసా? జస్ట్... లక్షా 80 వేల కోట్ల రూపాయలు మాత్రమే. -
యుద్ధం కత్తితో కాదు.. కరెన్సీతో
యువాన్ విలువ వరసగా రెండుసార్లు తగ్గించిన చైనా అంతర్జాతీయంగా తన ఉత్పత్తుల డిమాండ్ పెంపే లక్ష్యం దాంతో పోటీ పడాలంటే మిగతా దేశాలూ తగ్గించాల్సిందే ఆర్బీఐ చర్యలతో రెండేళ్ల కనిష్ఠానికి పతనమైన రూపాయి మేకిన్ ఇండియా నెరవేరాలన్నా;తయారీ రంగం వృద్ధి చెందాలన్నా ఇది తప్పదు... సాక్షి, బిజినెస్ విభాగం : రచయిత సాల్మన్ రష్దీ చెప్పినట్లు... ఇదివరకు యుద్ధం జరిగితే దాన్లో భాగస్తులు కాని వారంతా దూరంగా ఏదో కొండెక్కి చూసే వీలుండేది. కానీ ఇపుడు జరుగుతున్న ఆర్థిక యుద్ధాలను ఆ రకంగా చూసే వీలులేదు. ఎందుకంటే ఈ యుద్ధాల్లో అసలు పాల్గొనని వారంటూ ఎవరూ ఉండరు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా... అది ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తూనే ఉంటుంది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేక గ్రీసు ఒకవేళ దివాలా తీసి ఉంటే దాంతో వాణిజ్యం చేసే దేశాలన్నీ అతలాకుతలమయ్యేవి. అందుకే యూరో దేశాలన్నీ కలిసి కొత్త అప్పులిచ్చి మరీ దాన్ని గట్టెక్కించాయి. ఇపుడు చైనా వంతు. కొన్నేళ్లుగా చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందిన తీరు ప్రపంచదేశాలన్నిటికీ పాఠ్యాంశమే. ఏ వస్తువునైనా తయారు చేసి, యావత్ ప్రపంచానికీ ఎగుమతి చేస్తూ తిరుగులేని ఆర్థిక శక్తిగా అవతరించిందీ డ్రాగన్. దీంతో చైనీయుల జీతాలు, జీవితాలు కూడా మారాయి. చైనా కరెన్సీ యువాన్ సైతం బాగా బలపడింది. పదేళ్ల కిందట డాలరుతో యువాన్ మారకం విలువ 8.27. ఇపుడది ఏకంగా 30 శాతానికి పైగా వృద్ధి చెంది 6.33కు చేరింది. అయితే ఇక్కడ గమనించాల్సిందొకటి ఉంది. చైనా ఉత్పత్తులకు యువాన్లలోనే రేటు నిర్ణయిస్తారు. మరి ప్రపంచవ్యాప్తంగా దేశాలను ముంచెత్తుతున్న చైనా ఉత్పత్తులన్నీ యువాన్ బలపడితే ఖరీదెక్కువైనట్టే కదా!!. అపుడు డిమాండ్ తగ్గుతుంది. మరి ఎగుమతులపైనే ప్రధానంగా ఆధారపడ్డ చైనా ఆర్థిక వ్యవస్థ డిమాండ్ తగ్గితే ఏమవుతుంది? ఇదిగో ఈ సమస్యను ఎదుర్కోవటానికే చైనా కరెన్సీ యుద్ధానికి తెరతీసింది. గడిచిన రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా తన కరెన్సీ విలువను రెండు రోజుల్లో ఏకంగా 3.6 శాతం కోత కోసేసింది. తన ఉత్పత్తులను మిగతా దేశాలకంటే తక్కువ ధరకు అందించడానికి ఈ చర్య తీసుకుంది. మిగతా దేశాలదీ అదే బాట... నిజానికి చైనా తన కరెన్సీ విలువను కోసేయటంతో ప్రపంచం నివ్వెరపోయింది. తాము ఊహిస్తున్నదానికన్నా చైనా ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉందేమోనన్న భయాలు ఆర్థిక మార్కెట్లను వెన్నాడాయి. అందుకే రెండు రోజులుగా ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఇక చైనా కరెన్సీ కోతతో దాని ప్రధాన దిగుమతుల్లో ఒకటైన ఇంధన బిల్లు మరింత భారమయ్యే అవకాశముంది. దీనివల్ల విమాన కంపెనీల లాభాలు పడిపోతాయన్న ఆందోళనతో ఎయిర్ చైనా సహా ఆ రంగంలోని కంపెనీల షేర్లు దారుణంగా పతనమయ్యాయి. నిజానికిపుడు చైనా కరెన్సీ విలువ కోత వల్ల భారత్‌తో సహా దాంతో వస్తువుల విషయంలో పోటీపడే దేశాలన్నీ వాటి విలువల్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ చర్యల ఫలితమేనేమో... యూరోపియన్ యూనియన్, జపాన్, కొరియా, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌ల కరెన్సీలు కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ప్రపంచ ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ఇప్పటివరకూ మన కరెన్సీ పటిష్టంగా నిలవడానికి డాలర్లు ఖర్చుచేస్తూ వస్తున్న రిజర్వు బ్యాంక్ కూడా రెండు రోజులుగా రూపాయి పడిపోయేందుకు బాట వేసింది. దాంతో ఇది రెండేళ్ల కనిష్ట స్థాయికి పతనమైపోయింది. మన టెక్స్టైల్స్, జ్యువెల్లరీ తదితర తయారీ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో చైనాతో పోటీ పడాలంటే రూపాయి క్షీణించక తప్పదు. లేనిపక్షంలో తయారీదారులకు తగిన ప్రోత్సాహకాలిచ్చి ఆదుకోవాలి. అలా చేసేంత బలం మన ఆర్థిక వ్యవస్థకు లేదు కనక ఆర్బీఐ రూపాయి క్షీణతకు బాటవేసింది. కరెన్సీ బలంగా వుంటే ‘మేక్ ఇన్ ఇండియా’ ఆశ నెరవేరే అవకాశమూ తక్కువే. ఆర్బీఐకి కత్తిమీద సామే... మిగతా దేశాల కేంద్ర బ్యాంకులతో పోలిస్తే మన రిజర్వు బ్యాంక్‌కు రూపాయిని బ్యాలెన్స్డ్గా నిలపడం అత్యవసరం. ఎందుకంటే ఎక్కువగా ముడి చమురు, బంగారం దిగుమతులపై ఆధారపడిన దేశం మనది. రూపాయిని మరీ ఎక్కువ క్షీణింపచేస్తే దిగుమతుల బిల్లు పెరిగిపోయి పెనుభారమవుతుంది. ఆర్థిక వ్యవస్థ చితికిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగిపోయి, తిరిగి ద్రవ్యోల్బణం ఎగిసిపోతుంది. అలాగని కరెన్సీని పెర గనిస్తే అధికశాతం మందికి ఉపాధి కల్పించే తయారీ రంగం కుప్పకూలుతుంది. అందుచేత ఆర్బీఐ ఈ కరెన్సీ యుద్ధంలో ఆచితూచి పాల్గొనాల్సి ఉంటుంది. చైనా ‘యువాన్’.. కోత మీద కోత బీజింగ్: చైనా సెంట్రల్ బ్యాంక్.. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా(పీబీఓసీ) ప్రపంచ స్టాక్, కమోడిటీ మార్కెట్లకు ముచ్చెమటలు పట్టిస్తోంది. వరుసగా రెండో రోజూ డాలరుతో తమ దేశ కరెన్సీ యువాన్ మారకం విలువకు కోత(డీవేల్యూ) పెట్టింది. దీంతో ఈ ప్రాంతంలోని ఇతర దేశాలు కూడా చైనా బాటనే అనుసరించే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, బుధవారం పీబీఓసీ యువాన్ విలువను మరో 1.6% నుంచి 6.33కి తగ్గించింది. మంగళవారంనాటి 2 శాతం తగ్గింపుతో కలుపుకొని రెండు రోజుల్లోనే 3.6% కోత విధించినట్లయింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తున్న చైనా.. 1994 తర్వాత తమ దేశ కరెన్సీ విలువను ఇంత భారీగా తగ్గిండచం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే, ఈ చర్యలను పీబీఓసీ సమర్థించుకుంది. కరెన్సీమారకం విలువకు సంబంధించి మార్కెట్ ఆధారిత వ్యవస్థను పటిష్టం చేసేందుకే ఇలా చేయాల్సి వచ్చిందని.. ఇది వన్‌టైమ్ సర్దుబాటేనని పేర్కొంది. అంటే ప్రధాన విదేశీ కరెన్సీలకు డిమాండ్, సరఫరాను పరిగణనలోకి తీసుకొని క్రితం రోజు ముగింపు ఆధారంగా యువాన్ మారకం విలువ రోజువారీ రిఫరెన్స్ రేటును పీబీఓసీ ప్రకటిస్తుంది. దీని ఆధారంగానే కరెన్సీ ట్రేడింగ్ జరుగుతుంది. కాగా, పీబీఓసీ చర్యలను అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) స్వాగతించింది. ఎక్స్ఛేంజ్ రేటు నిర్ణయంలో మార్కెట్ వర్గాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించేందుకు దోహదం చేస్తుందని అభిప్రాయపడింది. యువాన్ దెబ్బకు రూపాయి విలవిల 59 పైసలు క్షీణత; 64.78 వద్ద ముగింపు రెండేళ్ల కనిష్ట స్థాయి ముంబై : చైనా కరెన్సీ యువాన్ విలువ తగ్గింపు ప్రకంపనలతో అటు స్టాక్, ఇటు కరెన్సీ మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ వరుసగా ఐదో రోజూ పతనబాటలోనే కొనసాగింది. బుధవారం ఈ పతన తీవ్రత మరింత పెరిగింది. దేశీ కరెన్సీ ఏకంగా 59 పైసలు క్షీణించి 64.78 స్థాయికి పడిపోయింది. ఇది రెండేళ్ల కనిష్టస్థాయి కావడం గమనార్హం. మొత్తంమీద ఆరు రోజుల్లో రూపాయి విలువ 104 పైసలు(1.63%) ఆవిరైంది. యువాన్ విలువ తగ్గింపు ప్రభావంతో అంతర్జాతీయంగా పలు ప్రధాన కరెన్సీలతో డాలరు మారకం విలువ పుంజుకోవడం రూపాయి పతనానికి దారితీసినట్లు ఫారెక్స్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. మరోపక్క, దిగుమతిదారులు, బ్యాంకర్ల నుంచి డాలరుకు డిమాండ్ పెరగడం, దేశీ స్టాక్ మార్కెట్ల పతనబాట కూడా రూపాయి నేలచూపులకు కారణమేనని వారు అభిప్రాయపడ్డారు. రూపాయి విలువ మరింత క్షీణించే అవకాశం ఉందని.. 65.60 వరకూ పడిపోవచ్చనేది కొంతమంది ఆర్థికవేత్తల అంచనా.