కరెన్సీ కరెంటు!
ఇదెక్కడి విడ్డూరమని ఆశ్చర్యపోతున్నారా... ఇది నిజమే. చైనాలో 100 యువాన్ల నోట్లను ఫోర్జరీకి అవకాశం లేకుండా కొత్తవి తయారుచేశారు. మరి పాతవాటిని ఏం చేయాలి. బ్యాంకుల్లో పాతవి తీసుకొని... కొత్తనోట్లను జనాలకు అందజేస్తున్నారు. పాతవాటిని మిషన్లలో వేసి చిన్నచిన్న ముక్కలుగా కోసి... బండిల్స్ చేస్తున్నారు. ఈ బండిల్స్‌ను తూర్పు చైనాలోని జింగ్సూ ప్రావిన్సు యాన్‌చెంగ్ పట్టణానికి పంపిస్తున్నారు. చైనా నలుమూలల నుంచి ఈ కరెన్సీ తుక్కుతో కూడిన లారీ లోడ్లు యాన్‌చెంగ్‌కు వస్తున్నాయట.
వీటిని మండించి ప్రతిరోజు 30,000 కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ కరెన్సీలో మండించాక వచ్చే బూడిదను (ఫ్లైయాష్)ను ఇటుకల తయారీకి కూడా వాడుతున్నారు. ఎంత మంచి ఐడియానో కదూ. అయితే ఈ ఏడాది విద్యుదుత్పత్తి కోసం మండించిన కరెన్సీ విలువెంతో తెలుసా? జస్ట్... లక్షా 80 వేల కోట్ల రూపాయలు మాత్రమే.