ఏటీఎం నుంచి బయటికొచ్చిన కరెన్సీ
షాంఘై : ఆకాశం నుంచి బంగారం, వజ్రాలు, ప్లాటీనం లాంటి విలువైన వస్తువుల జారీ విమానం రన్‌వే మీద పడడం ఈ మధ్యే చూశాం కదా. ఆ దృశ్యం మరవకముందే చైనాలో మరో విస్తుగొల్పే సంఘటన చోటు చేసుకుంది. చైనాలోని ఒక ఏటీఎం నుంచి నోట్లు ప్రవాహంలా బయటకు వస్తున్నాయి. ఆశ్చర్యం గొల్పే ఈ సంఘటన ఈ నెల 6న చైనాలోని నింగ్బో పట్టణంలో చోటుచేసుకుంది. జరిగిన ఈ సంఘటన అంతా ఏటీఎం బూత్ సర్వేలైన్ సీసీ టీవీ కెమరాలో రికార్డైంది. ఒక్క నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో ఓ రెండు సెకన్లపాటు ఏటీఎం నుంచి వందలాది నోట్లు బయటకు వచ్చాయి.
వీటి విలువ సుమారు 3వేల యువాన్లు (500 వందల అమెరికన్ డాలర్లు). ఏటీఎం మిషన్‌లో ఓ చిన్న సమస్య తలెత్తడంతో ఈ సంఘటన జరిగినట్టు తెలిసింది. ఆ సమయంలో ఆ దారిలో వెళ్తున్న ఓ జంట ఈ జాక్‌పాట్‌ను కొట్టేశారు. నేలపై పడివున్న నోట్లను గమనించి, వాటిని తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు. సీసీటీవీలో రికార్డయితే పోలీసులు పట్టుకుంటారనే ఉద్దేశ్యంతో, వారు ఎక్కడ కూడా తల పైకెత్తలేదు. అందువల్ల సీసీటీవీ కెమెరాల్లో వారి ముఖాలు సరిగా రికార్డవ్వలేదు. అయితే వారి దగ్గర్నుంచి నగదును వెనక్కి రప్పించడం కోసం, ఆ ఇద్దరిన్నీ ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు తమ ప్రయత్నాలను ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment