Surveillance cameras
-
రైలు ప్రమాదాలకు చెక్.. ఏఐ కెమెరాలతో నిఘా
భద్రత విషయంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రైళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిఘా కెమెరాలను ఏర్పాటు చేయనుంది. పట్టాలపై ప్రమాదకరమైన వస్తువులను దూరం నుంచే గుర్తించి లోకో పైలెట్లను అప్రమత్తం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రైళ్లు పట్టాలు తప్పడాన్ని నివారించడంతోపాటు ఉగ్రవాద, అసాంఘిక శక్తుల కుట్రలను తిప్పికొట్టే లక్ష్యంతో రైల్వేశాఖ వీటిని ఏర్పాటుచేయనుంది. ఇప్పటికే దేశంలోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో సీసీటీవీ కెమెరాల నిఘా కొనసాగుతుండగా.. నడుస్తున్న రైళ్లను మాత్రం ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) పరిజ్ఞానం ద్వారా పర్యవేక్షిస్తున్నారు.కానీ, నడిచే రైళ్లు ప్రమాదాలకు గురికాకుండా ముందుగానే అప్రమత్తంచేసే వ్యవస్థ ఇప్పటివరకు అందుబాటులో లేదు. –సాక్షి, అమరావతిమూడేళ్లలో 97 ప్రమాదాలు..ఇటీవలి కాలంలో దేశంలో రైళ్లు పట్టాలు తప్పి ప్రమాదాలకు గురవుతున్న దుర్ఘటనలు గణనీయంగా పెరిగాయి. 2021 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ ప్రమాదాలు 97 సంభవించాయి. కొన్నిచోట్ల విద్రోహశక్తులు రైలుపట్టాలపై ప్రమాదకరమైన వస్తువులను ఉంచి కుట్రలు పన్నిన ఉదంతాలూ ఉన్నాయి. దీంతో రైలు పట్టాలపై ఈ తరహా వస్తువులను ముందుగానే గుర్తించి ప్రమాదాలు నివారించేందుకు రైళ్లలో ఏఐ కెమెరాలను ఏర్పాటుచేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది.రూ.15 వేల కోట్లతో 75,000 ఏఐ కెమెరాలు..ఈ నేపథ్యంలో.. రూ.15 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో 75 వేల ఏఐ కెమెరాలను ఏర్పాటుచేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. 40 వేల బోగీలు, 14 వేల లోకోమోటివ్‌లు (ఇంజిన్లు), 6 వేల ఈఎంయూలలో ఈ కెమెరాలను ఏర్పాటుచేస్తారు. ప్రతి బోగీకి ఆరు కెమెరాలు, ప్రతి లోకోమోటివ్‌కు నాలుగు కెమెరాలను అమరుస్తారు. అక్టోబరు నుంచి ఏడాదిలోగా దశలవారీగా అన్ని రైళ్లలో ఏఐ కెమెరాల ఏర్పాటు పూర్తిచేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం పలు కంపెనీలకు టెండర్లు అప్పగిస్తోంది. -
అణు నిఘాను ఇరాన్ అడ్డుకుంటోంది
వియెన్నా: అణు కేంద్రాల వద్ద ఉన్న నిఘా కెమెరాలను ఇరాన్ తొలగించడంపై ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. ఐఏఈఏ పర్యవేక్షణ కోసం నతాంజ్ భూగర్భ అణు శుద్ధి కేంద్రం వద్ద బిగించిన రెండు కెమెరాలను ఆఫ్ చేసినట్లు బుధవారం ఇరాన్ ప్రకటించింది. యురేనియం శుద్ధిని మరింత వేగవంతం చేయనున్నట్లు కూడా ఇరాన్ ఐఏఈఏకి సమాచారం అందించింది. అగ్రరాజ్యాలతో జరుగుతున్న అణు చర్చల్లో ప్రతిష్టంభన నేపథ్యంలో ఒత్తిడి పెంచేందుకే ఇరాన్ ఈ ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు. దేశంలోని మూడు అప్రటిత ప్రాంతాల్లో కనుగొన్న అణుధార్మిక పదార్ధాలకు సంబంధించి విశ్వసనీయమైన సమాచారం అందించడంలో విఫలమైందంటూ ఇరాన్‌ను బుధవారం ఐఏఈఏ తప్పుబట్టింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ఐఏఈఏలోని 35 దేశాలకు 30 బలపరిచాయి. తీర్మానాన్ని రష్యా, చైనా వీటో చేయగా లిబియా, పాకిస్తాన్, భారత్ ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రఫేల్ మరియానోవియెన్నాలో మీడియాతో మాట్లాడారు. ఇరాన్ అధికారులు నతాంజ్, ఇస్ఫాహాన్‌ల వద్ద ఉన్న రెండు మాత్రమే కాదు, మొత్తం 40కి పైగా కెమెరాలకు గాను 27 కెమెరాలను మూసేసినట్లు సమాచారం ఉందన్నారు. ఈ చర్యతో ఇరాన్ అణు కార్యక్రమం పురోగతి వివరాలు అంతర్జాతీయ సమాజానికి వెల్లడయ్యే అవకాశం లేదన్నారు. అణుకేంద్రాల వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని ఇరాన్ 2021 నుంచే ఐఏఈఏకి అందించడం మానేసింది. -
పౌర సరఫరాలపై నిఘా
సాక్షి, కాకినాడ : అవినీతికి నిలయాలుగా... అక్రమాల దందాలకు ఆలవాలాలుగా...అడ్డగోలు వ్యవహారాలకు చిరునామాలుగా మారిన పౌర సరఫరాల గోదాములపై నిఘా కన్ను పడనుంది. ప్రజా పంపిణీలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలకు కూడా అడ్డుకట్ట వేయడానికి సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ముందుగా పౌరసరఫరాల గోదాముల్లో అక్రమాలకు చెక్ పెట్టడడంలో భాగంగా నిఘా కెమెరాలను అమర్చుతున్నారు. జిల్లా పౌరసరఫరాల సంస్థ మండల స్థాయి గోదాములు కాకినాడ, పిఠాపురం, గొల్లప్రోలు, రావులపాలెం తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. కాకినాడ, రావులపాలెంలో సొంత గోదాములున్నాయి. వీటి నుంచి జిల్లాలోని 2,666 చౌకధరల దుకాణాలకు నిత్యావసర సరకులను రవాణా చేస్తున్నారు. నెలనెలా రూ.400 కోట్లకు తగ్గకుండా నిత్యావసర సరకులు నిల్వ ఉంచుతున్నారు. వీటిని కాంట్రాక్టర్ల వ్యవస్థ ద్వారా సరఫరా చేస్తున్నారు. ఈ వ్యవహారంలోనే అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. గోదాము రికార్డుల్లో ఉన్న సరుకు మొత్తాలకు వాస్తవంగా ఉన్న సరకు నిల్వలకు భారీగానే తేడాలు ఉంటుంటాయి. ఇంత జరుగుతున్నా ఇంతకాలం అడిగే నాథుడే కరువయ్యాడు. తెల్ల రేషన్ కార్డుపై మంచి బియ్యం అందించాలని సీఎం జగన్ నిర్ణయించడంతో ఇక నుంచి రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు నిఘాను పట్టిష్టం చేసి అక్రమాలకు చెక్ పెట్టే ప్రక్రియకు పకడ్బందీగా శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రం నుంచే పర్యవేక్షణ మండల స్థాయి గోదాముల పరిధిలో కెమేరాలను అమర్చి అక్కడ నిత్యం జరిగే లావాదేవీలను జిల్లా కేంద్ర స్థాయిలోనే పర్యవేక్షించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కాకినాడ, పిఠాపురం, గొల్లప్రోలు, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో మండల స్థాయి గోదాముల్లో కెమెరాలను అమర్చారు. ఈ గోదాముల్లో 24 గంటలపాటు ఈ కెమెరాలు ఆన్‌లోనే ఉంటాయి. కెమేరాల నుంచి ఆధారాలు కావాల్సి వచ్చినా తీసుకొనే విధంగా రికార్డింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ కార్యాలయంలో ఈ పర్యవేక్షణ విభాగాన్ని ఏర్పాటు చేశారు. డీఎం నిత్యం ఇక్కడి నుంచి మండల స్థాయి లావాదేవీలను పర్యవేక్షించాలి. మండల స్థాయిలో ఏమి జరుగుతుందో డీఎం పర్యవేక్షిస్తే.. డీఎం కార్యాలయం నుంచి మండల స్థాయిలోని లావాదేవీలన్నీ ఎండీ కార్యాలయంలో పర్యవేక్షించే విధంగా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. మోసాలు ఇక చెల్లవు జిల్లాలోని మండల స్థాయి గోదాముల నుంచి 16,43,584 తెల్లకార్డులున్న లబ్ధిదారులకు బియ్యం 20,222 మెట్రిక్ టన్నులు, పంచదార 830 క్వింటాళ్లు, కందిపప్పు 165 మెట్రిక్ టన్నులు, రాగులు 500 టన్నులు, జొన్నలు 150 టన్నులు సరఫరా చేస్తున్నారు. జిల్లాలోని పలు గోదాముల్లో బియ్యం, కందిపప్పు మాయంపై కేసులు నమోదైఉన్నాయి. ఇప్పటికీ కొందరు ఉద్యోగులపై కేసులు, విచారణలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. మండల స్థాయి గోదాముల నుంచి ఇచ్చే సరుకుల్లో తూకాల్లో మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిపై ఇక నుంచి నిఘా, పర్యవేక్షణ పెరగనుంది. మండల స్థాయిలో ఉన్న రికార్డుల పరిశీలన జరుగుతోంది. ఇప్పటి వరకూ జరిగిన గోదాముల్లో ఉన్న తేడాలను బయటకు తీయనున్నారు. ఏ సమాచారం కావాలన్నా, ఎలాంటి సమాచారం అవసరమున్నా వెంటనే తీసుకొనే విధంగా మండల స్థాయి నుంచి డీఎం కార్యాలానికి అనుసంధాన వ్యవస్థను మరింత పటిష్ట పరచనున్నారు. తూకాల్లో జరుగుతున్న మోసాలకు చెక్ పెట్టనున్నారు. అడ్డగోలుగా వ్యవహరించే అధికారులపై ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే చర్యలు తీసుకొనే విధంగా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. నిఘా అమలులో పౌరసరఫరాల ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి నిఘా వ్యవస్థను పూర్తిస్థాయిలో అమలులోకి తెచ్చారు. ఇందుకోసం కెమెరాల బిగింపు కార్యక్రమం పూర్తయిందని పౌర సరఫరాల డీఎం ఇ.జయరాములు వివరించారు. కొన్ని ప్రాంతాల్లో అద్దె గోదాములున్న చోట్ల సొంత గోదాములు నిర్మాణాలు జరుగుతున్నాయని, అక్కడ కూడా కెమెరాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. దీనిని క్రమేణా ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సీఎంఆర్ విధానానికి వర్తించే విధంగా చర్యలు చేపట్టాలని ఆలోచిస్తున్నామన్నారు. కొద్ది రోజుల్లోనే వ్యవస్థను అన్ని విధాలుగా పటిష్ట పరుస్తామని చెప్పారు. ఈ కెమెరాల వ్యవస్థ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే కోట్ల రూపాయల దుర్వినియోగానికి చెక్ పెట్టినట్టవుతుందని పలువురు భావిస్తున్నారు. -
షాడో నిఘా
నర్సంపేట: ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థుల ఖర్చుపై ఎన్నికల కమిషన్ నిరంతర నిఘా కొనసాగించనుంది. ఇందుకోసం ప్రత్యేక షాడో బృందాలు వారి వెన్నంటే తిరగనున్నాయి. ప్రచారానికి సంబంధించి అభ్యర్థులు ఖర్చును తక్కువగా చూపినా షాడో టీమ్‌లు ఇచ్చే సమాచారం ఆధారంగా అదనపు ఖర్చును వారి ఖాతాల్లోనే జమ చేయనున్నారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా అదనపు ఖర్చు చేసినట్లు తేలితే గెలుపొందినా వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయనున్నారు. ఎన్నికల కమిషన్ నూతనంగా రూపొందించిన నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేగా బరిలో ఉన్న అభ్యర్థులు 28 లక్షలకు మించి ఖర్చు చేయడానికి వీలు లేదు. ప్రచార ఖర్చులపై నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటాయి. వీడియో విజువల్స్ ధ్వారా వివిధ పార్టీల ర్యాలీలు, బహిరంగ సభల నిర్వహణను చిత్రీకరించనున్నారు. అభ్యర్థులకు తెలియకుండా ఈ ‘షాడో’ టీంలు పని చేస్తాయి. లెక్కలు తప్పు చూపించిన సమయంలో.. షాడో టీంల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా మిగతా నగదును ఆయా అభ్యర్థుల లెక్కల్లో జమ చేయనున్నారు.ర్యాలీలు, సభలు నిర్వహించే క్రమంలో అభ్యర్థుల ఫొటోలు ఉంటే.. ఖర్చు వారి ఖాతాలోకి వెళ్లనుంది. కేవలం పార్టీ పేరుతో ప్రచారం చేసుకుంటే మాత్రం ఖర్చుకు పరిమితి లేదు. అభ్యర్థులకు ప్రత్యేక నోట్‌బుక్ ... ప్రచారానికి సంబంధించి ఖర్చుల వివరాలను నమోదు చేసేందుకు ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఎలక్షన్ కమిషన్ రూపొందించిన ప్రత్యేక నోట్బుక్కును అందించనున్నారు. అందులో రోజువారి ఖర్చు, బ్యాంకు లావాదేవీలతోపాటు తదితర వివరాలను అందులో పొందుపరచాల్సి ఉంటుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత రూ.28 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లు నిర్ధారణ జరిగితే.. గెలుపొందినప్పటికీ వారి అభ్యర్థిత్వం రద్దు చేయనున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు సైతం నిబంధనలకు మించి ఖర్చు పెట్టినట్లు తేలితే ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసే అవకాశం కూడా ఉంది. రూ.50 వేలకు మించితే లెక్క చూపాల్సిందే.. జిల్లా పరిధిలోని నర్సంపేట నియోజకవర్గంలో మూడు చోట్ల చెక్‌పోస్ట్‌లు, పరకాల నియోజకవర్గంలో రెండు చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసి వాహనాలను నిరంతరం తనిఖీ చేస్తున్నారు. సామాన్య పౌరులు సైతం అవసరాల నిమిత్తం రూ.50 వేల వరకు వెంట తీసుకెళ్లడానికి మాత్రమే వీలుంది. ఆ డబ్బులు తనిఖీల్లో పట్టుబడినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అంతకు మించి ఒక్క రూపాయి ఎక్కువగా తీసుకున్నా ఆ డబ్బులకు సంబంధించి పూర్తి వివరాలు తనిఖీ అధికారులకు చూపించాల్సి ఉంటుంది. లేదంటే అధికారులు ఆ డబ్బును సీజ్ చేసి ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగిస్తారు. బ్యాంకు లావాదేవీలపై నిఘా... బ్యాంకు లావాదేవీలపై కూడా ఎన్నికల అధికారులు నిరంతరం నిఘా వేయనున్నారు. రోజువారీగా బ్యాంకు లావాదేవీలు చేసే వ్యక్తుల వివరాలను లీడ్‌బ్యాంకు మేనేజర్ ద్వారా ఎన్నికల అధికారులకు బ్యాంకు మేనేజర్లు చేరవేయనున్నారు. ఎన్నికల కోడ్ పూర్తయ్యే వరకు రూ.500 డ్రా చేసినా, డిపాజిట్ చేసినా నిఘా ఉండబోతుంది. ముఖ్యంగా రూ.10 లక్షలు, ఆ పైన నగదు లావాదేవీలను చేసే వారి పూర్తి వివరాలను ఇప్పటికే అధికారులు బ్యాంకర్ల నుంచి సేకరిస్తున్నారు. ఏటీఎంలో నగదు వేసే వాహనాలపై సైతం నిఘా ఉండనుంది. ఏటీఎంలో నగదు వేసే ఆయా ఏజెన్సీల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. -
త్వరలో పట్టాలపైకి స్మార్ట్‌కోచ్
రైలు ప్రయాణాన్ని మరింత సుఖవంతం, సురక్షితం చేయడం కోసం భారతీయ రైల్వే త్వరలో ‘స్మార్ట్ కోచ్’లను ప్రవేశపెట్టనుంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద రాయబరేలిలోని మోడరన్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ స్మార్ట్ కోచ్‌లను తయారు చేస్తున్నారు. అత్యాధునిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం మేళవించిన 100 స్మార్ట్ బోగీలను త్వరలోనే పట్టాలపైకి ఎక్కించనున్నారు. నమూనా బోగీనొకదాన్ని తయారు చేశారు కూడా. స్మార్ట్‌కోచ్ ప్రత్యేకతలేంటంటే... నిఘా కెమెరాలు: ప్రతి బోగీలో 6 సీసీ కెమెరాలుంటాయి. అవి బోగీలో పరిస్థితిని అనుక్షణం రికార్డు చేస్తాయి. కంట్రోల్ సెంటర్లో ఈ రికార్డింగులను పరిశీలిస్తారు. వాటర్ లెవల్ ఇండికేటర్: రైలు కంపార్ట్మెంట్లలో నీళ్లు ఏ మేరకు అందుబాటులో ఉన్నాయన్నది దీని ద్వారా పరిశీలిస్తారు. సగానికంటే తక్కువ నీళ్లు ఉన్నట్టు తేలితే తర్వాత వచ్చే వాటరింగ్ స్టేషన్‌కు సమాచారం వెళ్తుంది. వచ్చే స్టేషన్లో నీళ్లు నింపుతారు. డిజిటల్ డెస్టినేషన్ బోర్డు: రైలు వేగం, రాబోయే స్టేషను పేరు, అది ఎంత దూరంలో ఉంది. ఎప్పటిలోగా ఆ స్టేషన్‌ను చేరుకోవచ్చు, ఆలస్యం ఏమైనా ఉందా.. అన్న వివరాలను ప్రయాణికులకు తెలియజేస్తారు. ముందుగా రికార్డు చేసిన ఈ సమాచారాన్ని జీపీఎస్ ద్వారా వెల్లడిస్తారు. వైఫై: బోగీలో ఏర్పాటు చేసే వైఫై ద్వారా ప్రయాణికులు తమ సెల్ఫోన్లో సినిమాలు, వీడియోలు వీక్షించవచ్చు. పాటలు వినొచ్చు. వీడియో గేములు ఆడుకోవచ్చు. తమ ప్రయాణ అప్డేట్స్ కూడా తెల్సుకోవచ్చు. రెండో తరం స్మార్ట్ కోచ్‌లలో బోగీలలో గాలి నాణ్యతను కొలిచే, స్వచ్ఛమైన గాలిని పంపే వ్యవస్థలు, ఫేస్ డిటెక్షన్, ఫైర్–స్మోక్ డిటెక్టర్లు లాంటి పరికరాలను ఏర్పాటు చేస్తారు. అనుకోని ప్రమాదాలు జరిగితే ప్రయాణికులను అత్యవసరంగా ఖాళీ చేయించేందుకు ఏర్పాట్లున్నాయి. టాయ్లెట్లలో ఎవరైనా ఉన్నారో లేదో తెల్సుకోవడానికి, ఫిర్యాదు చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్నీ అందుబాటులోకి తేనున్నారు. కోచ్ డయాగ్నస్టిక్ సిస్టమ్ రైలు చక్రాలు, బేరింగ్లు, పట్టాల పరి స్థితిని ఈ వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. సెన్సార్ మానిటర్లతో సేకరించే ఈ సమాచారాన్ని జీపీఎస్/జీపీఆర్‌ఎస్‌ల ద్వారా కేంద్రీయ సర్వర్‌కు పంపుతారు.అక్కడి నిపుణులు సమాచారాన్ని విశ్లేషించి తగిన చర్యలు తీసుకుంటారు. -
పరీక్షా కేంద్రాల్లో నిఘా
భువనేశ్వర్ : విద్యా బోధన, పరీక్షల నిర్వహణలో నిరంతరం సంస్కరణలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి కనబరుస్తుంది. రాష్ట్ర విద్యార్థుల్ని మేధావంతులుగా ఆవిష్కరించి జాతీయ స్థాయి పోటీ, ప్రవేశ పరీక్షల్లో ఉన్నత ఫలితాల్ని సాధించేలా చేయడం ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. తాజాగా పరీక్ష కేంద్రాల్లో పారదర్శకత పట్ల దృష్టి సారించింది. కాపీలు ఇతరేతర అక్రమాలకు చెక్ పెట్టేందుకు తాజా నిర్ణయం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల్ని ఏర్పాటు చేస్తారు. హై స్కూల్ సర్టిఫికెటు(హెచ్ఎస్సి), +2 శ్రేణి ఆర్ట్సు, సైన్సు, కామర్సు విభాగాల వార్షిక పరీక్షా కేంద్రాల్లో ఈ మేరకు ఏర్పాటు చేసేందుకు లాంచనంగా నిర్ణయించారు. 2018–19 విద్యా సంవత్సరం నుంచి తాజా విధానం అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభమయింది. బోర్డుల ఆధ్వర్యంలో రాష్ట్ర పాఠశాలలు–సామూహిక విద్యా విభాగం నిర్ణయం మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల్ని ఏర్పాటు చేస్తారు. ఈ ఏర్పాట్లను అనుబంధ నిర్వాహక సంస్థలు చేస్తాయని విభాగం కార్యదర్శి ప్రదీప్త మహాపాత్రో మంగళవారం తెలిపారు. రాష్ట్ర మాధ్యమిక విద్యా బోర్డు(బీఎస్ఈ), ఉన్నత మాధ్యమిక విద్యా మండలి(సీహెచ్ఎస్ఈ) వర్గాలకు ఆదేశాల్ని జారీ చేసినట్టు ఆయన వివరించారు. ఈ సంస్థలు ఖరారు చేసిన పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల్ని ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేసినట్టు తెలిపారు. మాల్ ప్రాక్టీసు నివారణ పరీక్షా కేంద్రాల్లో మాల్ ప్రాక్టీసు నివారణకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేంద్రాల్లో పరీక్షల నిర్వహణలోపారదర్శకత చోటు చేసుకుని విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పరీక్ష కేంద్రాల్ని కాపీ రహిత కేంద్రాలుగా ప్రకటించడమే ధ్యేయంగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు యోచన కార్యాచరణలో పెడుతున్నట్టు కార్యదర్శి వివరించారు. విభాగం ఆదేశాల మేరకు రాష్ట్ర మాధ్యమిక విద్యా బోర్డు(బీఎస్ ఈ), ఉన్నత మాధ్యమిక విద్యా మండలి(సీహెచ్ఎస్ఈ) రాష్ట్రవ్యాప్తంగా పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం అనివార్యంగా పేర్కొన్నారు. -
కరెన్సీ వాన కురిపించిన ఏటీఎం
షాంఘై : ఆకాశం నుంచి బంగారం, వజ్రాలు, ప్లాటీనం లాంటి విలువైన వస్తువుల జారీ విమానం రన్‌వే మీద పడడం ఈ మధ్యే చూశాం కదా. ఆ దృశ్యం మరవకముందే చైనాలో మరో విస్తుగొల్పే సంఘటన చోటు చేసుకుంది. చైనాలోని ఒక ఏటీఎం నుంచి నోట్లు ప్రవాహంలా బయటకు వస్తున్నాయి. ఆశ్చర్యం గొల్పే ఈ సంఘటన ఈ నెల 6న చైనాలోని నింగ్బో పట్టణంలో చోటుచేసుకుంది. జరిగిన ఈ సంఘటన అంతా ఏటీఎం బూత్ సర్వేలైన్ సీసీ టీవీ కెమరాలో రికార్డైంది. ఒక్క నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో ఓ రెండు సెకన్లపాటు ఏటీఎం నుంచి వందలాది నోట్లు బయటకు వచ్చాయి. వీటి విలువ సుమారు 3వేల యువాన్లు (500 వందల అమెరికన్ డాలర్లు). ఏటీఎం మిషన్‌లో ఓ చిన్న సమస్య తలెత్తడంతో ఈ సంఘటన జరిగినట్టు తెలిసింది. ఆ సమయంలో ఆ దారిలో వెళ్తున్న ఓ జంట ఈ జాక్‌పాట్‌ను కొట్టేశారు. నేలపై పడివున్న నోట్లను గమనించి, వాటిని తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు. సీసీటీవీలో రికార్డయితే పోలీసులు పట్టుకుంటారనే ఉద్దేశ్యంతో, వారు ఎక్కడ కూడా తల పైకెత్తలేదు. అందువల్ల సీసీటీవీ కెమెరాల్లో వారి ముఖాలు సరిగా రికార్డవ్వలేదు. అయితే వారి దగ్గర్నుంచి నగదును వెనక్కి రప్పించడం కోసం, ఆ ఇద్దరిన్నీ ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు తమ ప్రయత్నాలను ప్రారంభించారు. -
కరెన్సీ వాన కురిపించిన ఏటీఎం
-
నిఘా నేత్రం.. కట్టుదిట్టం
అలంపూర్ రూరల్ : ప్రజాభద్రతే లక్ష్యంగా పోలీస్‌శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని, అందులో భాగంగానే అలంపూర్ స్టేషన్ పరిధిలో 23 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించామని కలెక్టర్ రజత్‌కుమార్‌సైని, ఎస్పీ విజయ్‌కుమార్ అన్నారు. గురువారం అలంపూర్ పోలీస్‌స్టేషన్‌లో వారు సీసీల కెమరాలను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో పోలీస్ యంత్రాంగం పనితీరు ఎంతో బాగుందని ప్రజలనుంచి ప్రశంసలు వస్తున్నాయని, శాంతి భద్రతల విషయంలో అందరికీ ఒకేగాడిన పెడుతున్నామన్నారు. ఇకపై నియోజకవర్గ కేంద్రంలో జరిగే ప్రతి కదలికను పోలీసులు గమనిస్తూనే ఉంటారని తెలిపారు. నివేదన యాప్ జిల్లా ప్రజల కోసమే తీసుకొచ్చామని, ఏ సమస్య అయినా క్లిప్పింగ్‌లు, ఫొటోలు పంపిస్తే పరిష్కరిస్తామన్నారు. అనంతరం నేతాజీ ఫ్రెండ్స్ చైతన్య సేవాసమితి కార్యదర్శి వెంకట్రామయ్య శెట్టి ఆధ్వర్యంలో నాయకులు కలెక్టర్, ఎస్పీలను మెమోంటోలతో గౌరవించారు. కార్యక్రమంలో డీఎస్పీ సురేందర్‌రావు, డీఆర్వో వేణుగోపాల్‌రావు, సీఐ రజిత, ఎస్ఐ వాసా ప్రవీన్‌కుమార్ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రణాళికా బద్ధ్దంగా చదివితేనే ఉత్తమ గ్రేడ్ గద్వాల అర్బన్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదివితే మంచిమార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారని కలెక్టర్ రజత్‌కుమార్‌సైని అన్నారు. గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలుర, ఆనంద నిలయంలో కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థులకు దుప్పట్లు, తివాచీలు అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పరీక్షలంటే ఆందోళనకు గురికావద్దని, ఏకాగ్రతతో చదివితే సత్ఫలితాలు వస్తాయన్నారు. ఉన్నత చదువులకు పదవ తరగతి తొలిమెట్టని, తల్లిదండ్రుల కలలు, ఆకాంక్షలను నెరవేర్చేలా కష్టపడి చదవాలన్నారు. వార్డెన్లు కూడా టెన్త్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మెనూ ప్రకారం నాణ్యతతో భోజనం పెట్టించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ హాస్టళ్ల అధికారి రాములు పాల్గొన్నారు. సమగ్ర నివేదిక తయారుచేయాలి : జోషి సాక్షి, గద్వాల: సమగ్ర భూ సర్వే అనంతరం రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు తయారు చేసి ఇవ్వాల్సి ఉన్నందున జిల్లాలో ఖాతానెంబర్లు, ఫొటోలు, ఆధార్‌కార్డు నెంబర్లు అన్నీ సరిపోయేటట్లు సమగ్ర నివేదిక తయారు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్‌జోషి ఆదేశించారు. గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సచివాలయం నుంచి కలెక్టర్లతో మాట్లాడారు. మార్చిలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేసేవరకు ఎలాంటి పొరపాట్లు లేకుండా నివేదికలు కంప్యూటరీకరించి పంపాలన్నారు. కాన్ఫరెన్స్‌లో ప్రత్యేక కార్యదర్శి రాజేశ్వర్ తివారి, ప్రత్యేక కలెక్టర్ కరుణ, సంయుక్త కలెక్టర్ సంగీత పాల్గొన్నారు. దళారుల ఆటలు కట్టించండి : పార్థసారధి గద్వాల అర్బన్: కంది పంట రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పించి ఎఫ్‌సీఐ, హాకా సంస్థల ద్వారా కొనుగోలు చేస్తుంటే దళారులు అక్రమాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని జీఏడీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్లతో సమీక్షించారు. ప్రభుత్వం కందులకు రూ.5,450 మద్దతు ధర కల్పిస్తోందని, దళారులు గోదాముల్లో నిల్వ ఉంచిన కందులు, ఇతర రాష్ట్రాల నుండి తెచ్చిన కందులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలతో అమ్ముతున్నట్లు తెలిసిందని, తక్షణమే దాడులు నిర్వహించి వారి ఆట కట్టించాలని ఆదేశిం చారు. అనంతరం కలెక్టర్ రజత్‌కుమార్‌సైని వివరాలు వెల్లడించారు. జిల్లాలో 1.5లక్షల క్వింటాళ్ల కందులు దిగుబడి కాగా దాదాపు 50శాతం కందులను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేశామని తెలిపారు. వీసీలో జిల్లా సంయుక్త కలెక్టర్ సంగీత, మార్కెట్ శాఖ అధికారిణి పుష్పలత, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందునాయక్ పాల్గొన్నారు. -
పాదయాత్రపై నిఘా నేత్రం
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టింది. పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు, చివరకు నారాయణ కళాశాల విద్యార్థులతో పాటు పార్టీ నేతలు కొందరు జగన్ పాదయాత్రపై రోజూ నివేదికలు తయారుచేస్తున్నారు. ఆ నివేదికలను ఆయా శాఖల ఉన్నతాధికారులు సీఎం చంద్రబాబుకు పంపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. వాటిపై సీఎం చంద్రబాబు ప్రతి రోజూ రాత్రి ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నట్లు తెలిసింది. వైఎస్ జగన్ ప్రజా సంకల్పం పేరుతో ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సుమారు మూడు వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన పాదయాత్రలో రోజూ రీజనల్ ఇంటెలిజెన్స్ ఆర్ఐవో నరహరి పాల్గొంటున్నారు. వైఎస్ జగన్ వెళ్లే ప్రాంతానికి ముందుగానే ఆయన చేరుకుని అక్కడ పరిస్థితులను స్వయంగా పరిశీలించడంతో పాటు ప్రజా స్పందనపై ఆరా తీస్తున్నారు. అక్కడక్కడా ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం కనిపించింది. ఆయా ప్రాంతాల్లో వైఎస్ జగన్ పాదయాత్ర ముగిశాక కూడా జనం ఏమనుకుంటున్నారనే దానిపై వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఎస్పీ స్థాయి అధికారి అయిన నరహరితో పాటు మరికొందరు అధికారులు జనంలో కలిసి సీఎం చంద్రబాబు ప్రభుత్వం పట్ల ఎవరెవరు ఏమనుకుంటున్నారనేదానితో పాటు వైఎస్ జగన్ ఇస్తున్న హామీలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. నిఘా కెమెరాలతో పోలీసులు పాదయాత్ర మొదటిరోజు కనిపించని నిఘా కెమెరాలు మూడో రోజు నుంచి పోలీసుల చొక్కాలకు వేలాడుతూ కనిపించాయి. వైఎస్ జగన్ పాదయాత్రకు వస్తున్న అనూహ్య స్పందన చూసి ప్రభుత్వం నిఘాను పెంచింది. యాత్రకు ఏయే వర్గాల ప్రజలు వస్తున్నారు? ఎవరెవరు జగన్‌ను కలుస్తున్నారు? తదితర వివరాలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను నేరుగా చూసేందుకు ప్రభుత్వం పోలీసుల ఖాకీ చొక్కాలకు నిఘా కెమెరాలను ఏర్పాటు చేసింది. కెమెరాలను తగిలించుకున్న పోలీసులు వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్దకు వచ్చే జనాన్ని చిత్రీకరిస్తున్నారు. టీడీపీ నాయకులు ఎవరైనా వైఎస్ జగన్‌ను కలుస్తున్నారా? అనే విషయం తెలుసుకునేందుకు ఈ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు కర్నూలుకు చెందిన ఓ సీనియర్ నాయకుడు తన అనుచరులతో చెప్పినట్లు తెలిసింది. మరోవైపు డ్రోన్ కెమెరాలతో బహిరంగ సభ దృశ్యాలతో పాటు పాదయాత్రలో భారీగా తరలివస్తున్న జనాలను చిత్రీకరిస్తున్నారు. అమరావతిలో ‘లైవ్’ బహిరంగ సభతో పాటు రోజూ పాదయాత్రకు పోటెత్తుతున్న జనాన్ని డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరిస్తున్నదంతా సచివాలయంలో ప్రభుత్వ పెద్దలు నేరుగా ‘లైవ్’లో చూస్త్ను్నట్లు ఓ అధికారి చెప్పారు. ఇంటెలిజెన్స్ అధికారులు, పోలీసులు జగన్ పాదయాత్రపై రోజూ సాయంత్రానికల్లా నివేదిక సిద్ధం చేసి ఆయా శాఖల ఉన్నతాధికారులకు చేరవేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా నారాయణ విద్యా సంస్థల్లోని కొందరు విద్యార్థులను సైతం వినియోగిస్తున్నట్లు తెలిసింది. వీరు సేకరించిన సమాచారాన్ని నేరుగా మంత్రికే పంపుతున్నట్లు ప్రొద్దుటూరులో శనివారం రాత్రి జరిగిన వైఎస్ జగన్ బహిరంగసభ వద్ద చర్చించుకోవడం కనిపించింది. సీఎంకు నివేదిక.. వివిధ శాఖలు, ప్రైవేటు వ్యక్తులు జగన్ పాదయాత్రపై సేకరించి అమరావతికి పంపిన నివేదికను ఉన్నతాదికారులు సీఎం చంద్రబాబుకు చేరవేస్తున్నారు. రోజూ తెప్పించుకుంటున్న నివేదిక, వీడియోలను సీఎం స్వయంగా చూడటంతో పాటు.. వివరాలు అడిగి తెలుసుకుంటున్నట్లు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఆ నివేదికపై రోజూ రాత్రి ఉన్నతాధికారులతో సీఎం సమీక్షిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరుల్లో జరిగిన భారీ బహిరంగ సభలకు, పాదయాత్రకు అనూహ్యంగా వచ్చిన జనం, వారి నుంచి సేకరించిన అభిప్రాయాలపై శుక్ర, శనివారాల్లో సీఎం సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకత.. దానికిగల కారణాలపై విశ్లేషించినట్లు ఓ అధికారి చెప్పారు. -
ఈ కెమెరాలకు చిక్కారో ఇక అంతే
మాస్కో : ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కొనడానికి ఆయా దేశాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగిస్తున్నాయి. ప్రధానంగా ఆయా సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు దర్యాప్తు కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతోంది. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో సరైన ఫలితాలు రావడం లేదని మాస్కో కొత్త ప్రయోగానికి నాంది పలికింది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు దర్యాప్తు బృందాలు తీవ్రవాదులను, క్రిమినల్స్ ను గుర్తించడానికి పోలీసులు సాధారణంగా సీసీ కెమెరాల ఫుటేజీని విశ్లేషిస్తుంటారు. సీసీ ఫుటేజీల సమాచారంలో అనేక సందర్భాల్లో క్రిమినల్స్ ను గుర్తించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే జన బాహుళ్యం ఎక్కువగా ఉన్న చోట కూడళ్లలో సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు, లేదా తీవ్రవాదులు ప్రధానంగా ఎయిర్ పోర్టుల నుంచి వెలుపలికి వస్తున్న సందర్భాలను విశ్లేషించాల్సిన సమయాల్లో సీసీ ఫుటేజీతో అంత స్పష్టత రావడం లేదని మాస్కో ఈ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు సీసీ కెమెరాల్లో ప్రధానంగా మునుషుల ముఖాలను సులభంగా (ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ) గుర్తించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అనుమానిత వ్యక్తి ముఖాన్ని ఇట్టే తెలిపే ఈ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సీసీ కెమెరాలను ఇప్పుడు మాస్కో విరివిగా ఏర్పాటు చేయడం ప్రారంభించింది. మాస్కో నగరంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1,70,000 వేల ఇలాంటి సర్వెలెన్స్ కెమెరాలను అమర్చాలని నిర్ణయించింది. మాస్కో సెక్యూరిటీ నెట్ వర్క్ 2012 నుంచి మిలియన్ల కొద్ది వీడియో పుటేజీలను కలిగి ఉంది. అయితే ఈ ఫుటేజీతో క్రిమినల్స్ ను గుర్తించడం సాధ్యమయ్యేపని కాదని కొత్తగా ఫేషియల్ రికగ్నిషన్ సెక్యూరిటీ కెమెరాలను వినియోగించడం ప్రారంభించిందని, దీనివల్ల ఆయా నేరాల దర్యాప్తులో ఎంతో పురోగతి ఉంటుందని 'జిన్హువా' కథనం. తీవ్రవాదంపై పోరులో భాగంగా ఆధునిక టెక్నాలజీ వినియోగం వల్ల రష్యా ఇప్పటికే అనేక చిక్కుముడులను విప్పిందని, ఈ ఏడాది మొదటి అర్థభాగంలో తీవ్రవాదులు దాడులకు ప్రయత్నించిన దాదాపు 12 సందర్భాలను ముందస్తుగా గుర్తించి నిరోధించగలిగిందని రష్యన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం పేర్కొంది. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని రష్యాకు ఎన్ టెక్ లాబ్ అనే స్టార్టప్ కంపెనీ సమకూర్చింది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో వ్యక్తుల ముఖాలను కచ్చితంగా గుర్తించగలుగుతున్నాయని యూఎస్ కామర్స్ డిపార్ట్ మెంట్, యునివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ లు సర్టిఫై కూడా చేసినట్టు రష్యన్ ప్రాసిక్యూటర్ జనరల్ నివేదిక పేర్కొంది. ఇలా ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ కలిగిన సెక్యూరిటీ కెమెరాలను ప్రయోగాత్మకంగా అమర్చిన రెండు నెలల్లోనే టెర్రరిస్టుల వాంటెడ్ జాబితాలో ఉన్న ఆరుగురు తీవ్రవాదులను గుర్తించి అరెస్టు చేయడం జరిగింది. అయితే, ఈ టెక్నాలజీ సెక్యూరిటీ కెమెరాల ఖర్చు ఎక్కువగా ఉన్నందున కేవలం అతిముఖ్యమైన ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే అమర్చుతున్నారు. -
పుష్కరాల్లో సీసీ కెమెరాలలతో నిఘా
-
నిఘా పక్షులు...!
ఉడుత, చెట్టు కొమ్మపై కూర్చున్న పక్షి, ఎగురుతున్న మరో పక్షి... వీటిని చూసి ఏవో కళాఖండాలనుకుంటున్నారా? కాదు.. ఇవి వివిధ రకాల పక్షులు, జంతువుల రూపంలో ఉన్న నిఘా కెమెరాలు. నిఘా కోసం అక్కడ కెమెరా పెట్టారని అందరికీ తెలిసేలా దాన్ని ఏర్పాటు చేస్తే ఎలా అని ఇటలీకి చెందిన ‘పార్సన్’ అనే సంస్థ భావించింది. ఫలితమే ఈ వినూత్న డిజైన్ల వింత కెమెరాలు. ఏదో అందం కోసం పెట్టుకున్నారనుకుంటారు తప్ప.. అది నిఘా కెమెరా అని ఎవరికీ తెలిసే చాన్సే ఉండదు. ఐడియా బావుంది కదూ..!