ఆకాశం నుంచి బంగారం, వజ్రాలు, ప్లాటీనం లాంటి విలువైన వస్తువుల జారీ విమానం రన్‌వే మీద పడడం ఈ మధ్యే చూశాం కదా. ఆ దృశ్యం మరవకముందే చైనాలో మరో విస్తుగొల్పే సంఘటన చోటు చేసుకుంది. చైనాలోని ఒక ఏటీఎం నుంచి నోట్లు ప్రవాహంలా బయటకు వస్తున్నాయి. ఆశ్చర్యం గొల్పే ఈ సంఘటన ఈ నెల 6న చైనాలోని నింగ్బో పట్టణంలో చోటుచేసుకుంది. జరిగిన ఈ సంఘటన అంతా ఏటీఎం బూత్ సర్వేలైన్ సీసీ టీవీ కెమరాలో రికార్డైంది. ఒక్క నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో ఓ రెండు సెకన్లపాటు ఏటీఎం నుంచి వందలాది నోట్లు బయటకు వచ్చాయి