atm machine
-
ఏటీఎంలో చిరిగిన నోట్లు వస్తే.. ఆర్బీఐ రూల్స్ తెలుసా?
ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసే సమయంలో కొన్ని సార్లు చిరిగిన నోట్లు వస్తుంటాయి. ఈ చిరిగిన నోట్లను బయట దుకాణదారులకు ఇస్తే తీసుకోరు. దీంతో ఆందోళన మొదలవుతుంది. ఇప్పుడు ఏం చేయాలనే ప్రశ్న మెదులుతుంది. మీకు కూడా అలాంటి సంఘటన జరిగితే చింతించాల్సి పని లేదు. చిరిగిన నోట్లను సులభంగా మార్చుకోవచ్చు.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం.. ఏటీఎం నుంచి చిరిగిన నోట్లు బయటకు వస్తే వాటిని మార్చేందుకు బ్యాంకు నిరాకరించకూడదు. నోట్లను మార్చుకోవడానికి బ్యాంకులో సుదీర్ఘ ప్రక్రియ ఉండదు. నిమిషాల్లో నోట్లు మార్చుకోవచ్చు. చిరిగిన నోట్లు ఏ ఏటీఎం నుండి వచ్చాయో ఆ ఏటీఎంకి లింక్ చేసిన బ్యాంక్‌కి తీసుకెళ్లి డబ్బు విత్‌డ్రా చేసిన తేదీ, సమయం, విత్ డ్రా చేసిన ఏటీఎం వివరాలతో ఫారం నింపి అందజేయాలి.ఏటీఎంలో వచ్చినవే కాకుండా ఇతర చిరిగిపోయిన, పాడైపోయిన నోట్లను కూడా బ్యాంక్ బ్రాంచ్ లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాల్లో సులభంగా మార్చుకోవచ్చు. అయితే దీనికి పరిమితిని నిర్ణయించారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి ఒకసారికి గరిష్టంగా 20 నోట్లను మార్చుకోవచ్చు. అలాగే వాటి విలువ రూ. 5000 మించకూడదు. మార్పిడి చేసుకునే చిరిగిన, పాడైన నోట్లపై ముఖ్యమైన సమాచారం కచ్చితంగా ఉండాలి.దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అత్యాధునిక నోట్ సెట్టింగ్ మెషీన్లతో బ్యాంకులోని నోట్ల నాణ్యతను తనిఖీ చేస్తుందని తెలిపింది. దీంతో చిరిగిన లేదా దెబ్బతిన్న నోట్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ ఖాతాదారుడికి ఏటీఎం నుంచి చిరిగిన నోట్లు వస్తే, బ్యాంకుకు చెందిన ఏదైనా బ్రాంచ్‌కైనా వెళ్లి వాటిని మార్చుకోవచ్చు. -
కొత్త ఫీచర్: చేతిలోని క్యాష్.. ఈజీగా అకౌంట్లోకి..
యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాక డిజిటల్ చెల్లింపుల్లో ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులు వస్తున్నాయి. ఎవరికి నగదు పంపాలన్నా యూపీఐ యాప్‌ల ద్వారా క్షణాల్లో పంపించేస్తున్నాం. మరి క్యాష్ డిపాజిట్ అయితే ఏం చేస్తాం.. నేరుగా సంబంధిత బ్యాంకుకు వెళ్లి అకౌంట్లో వేయడమో లేదా ఆ బ్యాంకు ఏటీఎం మెషీన్లో డిపాజిట్ చేయడమో చేస్తాం. కానీ బ్యాంకుతో సంబంధం లేకుండా కేవలం యూపీఐ యాప్‌తో ఏ బ్యాంకు ఖాతాకైనా భౌతిక నగదును డిపాజిట్ చేసే అవకాశం ఉంటే బాగుంటుంది కదా.. అలాంటి కొత్త ఫీచర్ ఇప్పుడు వచ్చింది.ఏ బ్యాంక్ ఖాతాకైనా..యూపీఐ ఇంటర్ఆపరబుల్ క్యాష్ డిపాజిట్ (UPI-ICD) అనే కొత్త ఫీచర్ ఏటీఎంలలో నగదు డిపాజిట్ చేసే విధానాన్ని మరింత సులువుగా మార్చనుంది. ఈ వినూత్నమైన ఫీచర్లో ఏ యూపీఐ యాప్‌ను ఉపయోగించైనా, ఏ బ్యాంక్ ఖాతాలోకైనా నగదును డిపాజిట్ చేయవచ్చు. యాక్సిస్ బ్యాంక్, యూనియన్ బ్యాంకులకు చెందిన ఎంపిక చేసిన ఏటీఎంలలో ప్రస్తుతానికి ఈ ఫీచర్ అందుబాటులో ఉన్నప్పటికీ, సమీప భవిష్యత్తులో మరిన్ని బ్యాంకులు ఈ సౌలభ్యాన్ని అందించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఈ బ్యాంకులో ఎఫ్డీ.. మంచి వడ్డీ!డిపాజిట్ ఇలా.. » యూపీఐ-ఐసీడీని సపోర్ట్ చేసే అధునాతన నగదు రీసైక్లర్ మెషీన్లతో కూడిన ఏటీఎంలను గుర్తించండి.» మీ యూపై యాప్‌ని తెరిచి ఏటీఎం స్క్రీన్‌పై వచ్చే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి.» మీరు డిపాజిట్ చేయాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేసి, లబ్ధిదారు ఖాతాను ఎంచుకోండి.» డిపాజిట్ స్లాట్‌లో నగదు పెట్టండి.» వివరాలను ధ్రువీకరించి యూపీఐ పిన్ ఉపయోగించి లావాదేవీని పూర్తి చేయండి.ప్రయోజనాలు» నగదు తక్షణమే లబ్ధిదారుల ఖాతాకు జమవుతుంది.» ఏటీఎం నగదు రీసైక్లర్ యంత్రం డిపాజిట్ చేసిన నోట్ల ప్రామాణికతను ధ్రువీకరిస్తుంది.» ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ.50,000 డిపాజిట్ చేసేందుకు వీలు.» మొత్తం ప్రక్రియ డిజిటల్‌గా జరగుతుంది. ఎలాంటి కార్డ్స్, భౌతిక స్లిప్‌ల అవసరం ఉండదు.» ఇతర యూపీఐ లావాదేవీల మాదిరిగానే వీటికీ భద్రత ఉంటుంది. -
వామ్మో! ఏటీఎం నుంచి విషపూరిత పాము పిల్లలు: షాకింగ్ వీడియో
అసలే పెద్ద నోటు రూ. 2000 రద్దుతో ఇబ్బందులు పడుతున్న వారికి మరో షాకింగ్ న్యూస్. ఏటీఎంలోంచి కరెన్సీ నోట్లకు బదులు పాము పిల్లలు బయటకు రావటం కలకలం రేపింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ షాకింగ్ వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఉత్తరాఖండ్ నైనిటాల్ జిల్లాలోని రామ్‌నగర్ కోసీ రోడ్డులో ఉన్న ఎస్బీఐ ఏటీఏంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బుధవారం (మే24,2023) ఏటీఎంకు మనీ విత్‌డ్రా కోసం వెళ్లాడు ఒక వ్యక్తం. విత్ డ్రాయల్ ప్రాసెస్ పూర్తియ్యాక డబ్బులు ఎదురు చూస్తుండగా ఒక పాముపిల్ల బయటకు వచ్చింది. దీంతో అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే ఏటీఎం సెక్యూరిటీ గార్డు ద్వారా సంబంధిత అధికారులు సమాచారం అందించారు. దీంతోపాటు సేవ్ ది స్నేక్ అండ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు చంద్రసేన్ కశ్యప్ కూడా సమాచారం అందించాడు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న బ్యాంకు అధికారులు.. ఏటీఎంను తెరిచారు. ఈ క్రమంలో ఏటీఎం మెషీన్లో ఏకంగా పది పాము పిల్లల్ని గుర్తించారు చంద్రసేన్. అంతేకాదు అవి విషపూరిత పాములని కూడా తెలిపారు. వాటిని సురక్షితంగా అడవిలో విడిచిపెట్టారు. ఏటీఎంను తాత్కాలింగా మూసివేసినట్టు తెలుస్తోంది. -
ఏటీఎం కార్డ్ మెషిన్లో ఇరుక్కుపోయిందా.. జాగ్రత్త!
మీ ఏటీఎం కార్డు ఎప్పుడైనా మెషిన్లో ఇరుక్కుపోయిందా.. ఇలాంటప్పుడు మీరేం చేస్తారు.. తోటివారిని సాయం అడుగుతారు. మెషిన్లో ఏదో సమస్య వచ్చిందిలే అనుకుని బ్యాంకును సంప్రదిస్తారు.ఇలాంటి సందర్భంలోనే మోసగాళ్లు పొంచి ఉంటారు. సాయం చేసే నెపంతో కార్డులు మార్చి డబ్బులు కాజేస్తారు. కాపలా లేని ఏటీఎం సెంటర్ల వద్ద ఇలాంటి మోసగాళ్లు మాటు వేస్తున్నారు. ఏటీఎం మెషిన్లలో సమస్య కారణంగా ఇబ్బంది పడుతున్న కార్డుదారులను ఏమార్చి వారి కార్డులను క్లోనింగ్ చేయడమో మార్చేయడమో చేసి వారి కష్టార్జితాన్ని దోచేస్తున్నారు. ఈ మోసం ఇక్కడితో ఆగిపోదు. మీ కార్డ్‌ని మార్చేసిన కేటుగాళ్లు ఆ కార్డును ఉపయోగించి అకౌంట్లోని డబ్బు మొత్తాన్ని నిమిషాల వ్యవధిలో కొట్టేస్తున్నారు. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం. ఇదీ చదవండి: ఏటీఎం చార్జీలు.. జీఎస్టీ కొత్తరూల్! మే 1 నుంచి అమలయ్యే కీలక మార్పులు ఇవే.. ఇటువంటి అనేక ముఠాలు దేశంలోని అనేక ప్రాంతాలలో సంచరిస్తున్నాయి. డబ్బులు విత్‌డ్రా చేయడానికి ఏటీఎం మెషిన్లో కార్డ్ పెట్టి పిన్ ఎంటర్ చేసిన తర్వాత డబ్బు బయటకు రాగానే ఏటీఎం కార్డ్ మెషిన్లో ఇరుక్కుపోతుంది. ఏటీఎం స్క్రీన్‌పై అకౌంట్ బ్యాలెన్స్, ఫోన్ నంబర్, ఇతర వివరాలు కన్పిస్తాయి. మెషిన్లో ఏదో సమస్య తలెత్తిందని మీరు గ్రహించేలోపే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు లోపలికి ప్రవేశిస్తారు. వారిలో ఒకరు మిమ్మల్ని మాటల్లో పెడతారు. మరొకరు మీ కార్డును వేరే కార్డుతో మార్చేసి కాజేసి అక్కడి నుంచి ఉడాయిస్తారు. తర్వాత కొద్ది సమయానికే డబ్బు విత్ డ్రా చేసినట్లు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్సెమ్మెస్‌లు వస్తాయి. భయాందోళనకు గురైన కస్టమర్లు బ్యాంకుకు కాల్ చేసినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే జరగాల్సిన మోసం అప్పటికే జరిగిపోయి ఉంటుంది. కార్డ్ డియాక్టివేషన్ అనేది చాలా శ్రమతో కూడుకున్న ప్రక్రియ. ఎందుకంటే అటువంటి సమస్యలను పరిష్కరించడానికి బ్యాంకులకు ప్రత్యేక వ్యవస్థ అంటూ ఏమీ ఉండదు. అనేక మంది బాధితులు ఇలాంటి మోసాలకు గురైన కస్టమర్లు చాలా మందే ఉన్నారు. ఢిల్లీలో ఒక సీనియర్ జర్నలిస్ట్ నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంకు వెళ్లగా తన కార్డ్ మెషిన్లో ఇరుక్కుపోయింది. సహాయం చేసే నెపంతో దుండగులు తన ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ డెబిట్ కార్డ్‌ను ప్రభుత్వ రంగ బ్యాంకు కార్డుతో మార్చేశారు. ఘటన జరిగిన 10 నిమిషాల్లోనే తన మొబైల్లో విత్‌డ్రా నోటిఫికేషన్లు రావడంతో మోసపోయానని గ్రహించి వెంటనే బ్యాంక్ కస్టమర్ కేర్ సెంటర్‌కు ఫోన్ చేసి కార్డ్ బ్లాక్ చేయాలని కోరాడు. అయినా అకౌంట్ నుంచి డబ్బు పోవడం ఆగలేదు. ఎందుకంటే కార్డ్ డీయాక్టివేట్ చేసేందుకు సమయం పట్టింది. అలాగే తూర్పు ఢిల్లీలో జరిగిన మరో ఘటనలో ఓ గృహిణి ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏటీఎంకి వెళ్లింది. ఆమె కార్డ్ కూడా ఇలాగే ఇరుక్కుపోయింది. ఆ కార్డును మోసగాళ్లు మార్చేసి షాపింగ్ చేశారు. ఆమె వెంటనే ఫిర్యాదు చేసినా దాదాపు రూ.1 లక్ష కోల్పోయిన తర్వాత ఆ కార్డ్ డీయాక్టివేట్ అయింది. ఇలాంటి మోసాలు జరగినప్పుడు ఏకకాలంలో బ్యాంక్ బ్రాంచ్ని సంప్రదించి, సైబర్ క్రైమ్ బ్రాంచ్‌కు ఫిర్యాదు చేస్తే మీ డబ్బును తిరిగి పొందడంలో సహాయపడతారని ఆర్బీఐ చెబుతోంది. అయితే బ్యాంకులు మాత్రం ఈ పిన్ నంబర్ మోసగాళ్లకు తెలిసి ఉండవచ్చని ఎప్పుడూ చెప్పే సమాధానమే చెబుతాయి. ఇక సైబర్ క్రైమ్ బ్రాంచ్ వద్ద ఇలాంటి కేసులు వేలల్లో ఉంటాయి. 65,893 మోసాలు ఆర్బీఐ డేటా ప్రకారం.. ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లకు సంబంధించి 2021-22లో 65,893 మోసాలు జరిగాయి. కస్టమర్లు నష్టపోయిన డబ్బు రూ.258.61 కోట్లు. మోసగాళ్లు రోజుకో కొత్త మార్గాన్ని కనిపెట్టి కస్టమర్లను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు నివారించడానికి డిజిటల్, తక్కువ నగదు లావాదేవీలను ప్రోత్సహించడానికి ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదీ చదవండి: Aunkita Nandi: రెండు అద్దె కంప్యూటర్లతో రూ.100 కోట్ల వ్యాపారం! ఈ బెంగాలీ అమ్మాయి సంకల్పం మామూలుది కాదు.. -
గుడ్ న్యూస్: ఏటీఎం కార్డ్ లేకుండా క్యాష్ విత్‌డ్రా.. ఇలా చేస్తే సరిపోతుంది!
న్యూఢిల్లీ: గతంలో బ్యాంకులోని మన నగదుని తీసుకోవాలంటే.. అయితే బ్యాంకుకు వెళ్లాలి లేదా ఏటీం( ATM) మెషిన్‌కు వెళ్లి డెబిట్ కార్డ్‌తో కావాల్సినంత డబ్బులను డ్రా చేసుకోవాలి. కానీ నేటి డిజిటల్ యుగంలో, మీరు డెబిట్ కార్డ్ లేకుండా కూడా ఏటీఎం మెషీన్ నుంచి డబ్బును తీసుకోవచ్చు. దీని కోసం మీకు మీ మొబైల్ మాత్రమే అవసరం. చాలా రోజుల నుంచి ఈ బ్యాంకింగ్ సర్వీస్ నడుస్తోంది. అసలు ఇలాంటి సర్వీస్ ఒకటి ఉందని చాలా మందికి కూడా తెలియదు. డబ్బులు డ్రా చేసేందుకు.. ఏటీఎం అక్కర్లేదు ఇప్పటికే చాలా బ్యాంకులు తమ కస్టమర్లకు కార్డు లేకుండానే డబ్బు తీసుకునే వెసులుబాటును కల్పిస్తున్నప్పటికీ.. తాజాగా రిజర్వ్ బ్యాంక్ తన పరిధిని మరింత పెంచింది. ఈ సౌకర్యం కోసం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) ఉపయోగించనుంది. డెబిట్ కార్డ్ లేకుండా ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే, మీరు తప్పనిసరిగా స్మార్ట్‌ఫోన్‌ని కలిగి ఉండాలి. మీ స్మార్ట్‌ఫోన్‌లో భీం(BHIM), పేటీఎం (Paytm), గూగుల్‌పే (GPay), ఫోన్‌పే (PhonePe) మొదలైన యాప్‌లను ఉపయోగించి ద్వారా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇలా ఫాలో అయితే సరిపోతుంది.. ఏటీఎం సెంటర్లోకి వెళ్లి కార్డ్ లేకుండా డబ్బు విత్‌డ్రా చేసుకునే ఆప్షన్‌ను ఎంచుకోండి. మీరు యూపీఐ ద్వారా గుర్తింపును అందించే ఎంపికను చూస్తారు. ఆ తర్వాత మీ మొబైల్లో యూపీఐ యాప్‌ని ఓపెన్ చేసి, మీ ముందు కనిపిస్తున్న QR కోడ్‌ను స్కాన్ చేయండి. ఇక్కడి నుంచి ప్రక్రియ మునుపటి మాదిరిగానే ఉంటుంది. మీకు కావలసిన డబ్బును ఎంటర్ చేయండి ఆ తర్వాత విత్‌డ్రా చేసుకోండి. కార్డ్ లెస్ క్యాష్.. ప్రయోజనాలు ఇవే కార్డు లేకుండా నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయం కార్డు స్కిమ్మింగ్, కార్డ్ క్లోనింగ్ వంటి మోసాలను నిరోధించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా, మీరు కార్డును మీ వద్ద ఉంచుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మీ స్మార్ట్‌ఫోన్ ఈ పనులన్నింటినీ చేస్తుంది. చదవండి: కొత్త ఏడాదిలో యూజర్లకు షాక్.. నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ షేర్ చేస్తే పైసలు కట్టాలి! -
దొంగల తెలివి...ఏటీఎం మిషన్నే తవ్వేందుకు యత్నం: వీడియో వైరల్
Thieves can go to any extent: ఇటీవలే బిహార్‌లో ఒక దొంగల ముఠా స్టీల్ బ్రిడ్జ్‌ని దొంగలించిన సంటన గురించి విన్నాం. అంతేందుక ఒక దొంగ ఒక మహిళ దృష్టి మరల్చడానిక హఠాత్తుగా డ్యాన్స్ చేసి రోలెక్స్ వాచ్‌ని ఎత్తుకుపోయిన సంగతి తెలిసిందే. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి డబ్బులు కోసం ఏటీఎం మిషన్‌ని ఎత్తుకుపోవాలనుకున్నాడు. మహారాష్ట్రలోని సాంగ్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్లే...మహారాష్ట్రాలోని దొంగలు డబ్బులు కోసం ఏకంగా ఏటీఎం మిషన్‌ని తవ్వేందుకు యత్నించారు. అందుకోసం ఏకంగా ఎక్స్‌కవేటర్‌ని ఉపయోగించారు. ఈ ఘటన చూస్తే డబ్బలు కోసం ఎంతకైన తెగిస్తారు దొంగలు అన్నట్లుగా ఉంది. అయితే ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు దొంగల ధైర్యాన్ని చూసి ఫిదా అవ్వడమే కాకుండా నిరుద్యోగం, ధరల పెరుగుదల కారణంగా ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటాయంటూ... ట్వీట్ చేశారు. JCB Crane used to steal #ATM Machine in Maharshtra#Robbery pic.twitter.com/CSLn3nQohS — శంకర్ ముదిరాజ్ (@Gsk339) April 24, 2022 (పిల్లలను తుపాకితో బెదిరిస్తున్న దుండగుడి వీడియోలు వైరల్) -
సిబ్బంది నిర్వాకం: ఏటీఎంలో డబ్బులు పెట్టి ... తాళం మరిచారు..
సాక్షి, రెబ్బెన(ఆదిలాబాద్): ఇంటికి తాళం వేస్తేనే.. పడిందో లేదో అని ఒకటికి రెండు సార్లు సరిచూసుకుంటారు. కానీ రూ.లక్షలు నిల్వ ఉంచే ఏటీఎంకు సిబ్బంది తాళంచెవులు అలాగే వదిలేశారు. రెబ్బెన మండలంలోని గోలేటి టౌన్షిప్లో గల నంబర్ వన్ ఏటీఎంలో డబ్బులు పెట్టిన సిబ్బంది తాళంచెవులు తీసుకువెళ్లటం మాత్రం మర్చిపోయారు. ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వచ్చిన వ్యక్తి ఏటీఎంకు తాళంచెవులు ఉండటం చూసి వెంటనే నిర్వాహకులకు సమాచారం అందించాడు. తాపీగా వచ్చిన సిబ్బంది తాళంచెవులు పట్టుకుని వెళ్లిపోయారు. ఏటీఎంకే తాళం వదిలి వెళ్లిన వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: నాలుగు రోజులుగా ఠాణాలో పందెం కోళ్లు! -
దొంగల చేతికి తాళాలు ఇవ్వడం అంటే ఇదేనేమో..
డోన్ టౌన్: దొంగల చేతికి తాళాలు ఇవ్వడం అంటే ఇదేనేమో.. ఏటీఎంలో డబ్బు పెట్టిన అధికారులు, ఆ తర్వాత మిషన్ తాళాలు కూడా అక్కడే మరచిపోయారు. ఈ సంఘటన డోన్‌లో చోటు చేసుకుంది. ఇటీవల పట్టణంలో ఎస్బీఐ ఏటీఎంను దొంగలు కొల్లగొట్టిన ఘటన సంచలనం సృష్టించింది. తాజాగా మరో సంఘటన చర్చనీయాంశంగా మారింది. స్థానిక రాజ్ థియేటర్ సమీపంలోని సిండికేట్ బ్యాంక్ అధికారులు సోమవారం మధ్యాహ్నం డాక్టర్ పోచా ప్రభాకర్‌రెడ్డి క్లినిక్ ఎదురుగా ఉన్న సిండికేట్ ఏటీఎంలో డబ్బులు పెట్టి తాళాలు వేశారు. అయితే మిషన్‌కు సంబంధించిన తాళాలు అక్కడే మరచిపోయారు. డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు వచ్చిన ఓ వ్యక్తి తాళాలు గుర్తించి బ్యాంక్ అధికారులకు అప్పగించారు. ఒక వేళ దొంగల చేతికి తాళాలు చిక్కి ఉంటే మరో చోరీ జరిగి ఉండేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇవీ చదవండి: ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు ఎచ్చెర్ల టీడీపీ ‘కళా’విహీనం..! -
కస్టమర్లపై కాసుల వర్షం
-
వైరల్: 100 విత్‌డ్రా చేస్తే.. రూ. 500
సాక్షి, అమరచింత: సాధారణంగా మనం ఏటీఎంకు వెళ్లి.. అన్నీ సరిగా నొక్కితేనే కావాల్సిన డబ్బులు వస్తాయి. అలాంటిది ఈ ఏటీఎంలో మాత్రం ఏకంగా కావాల్సిన దాని కంటే ఐదింతలు ఎక్కువ వచ్చింది. వనపర్తి జిల్లా అమరచింతలో రెండేళ్ల క్రితం ప్రైవేట్ సంస్థకు చెందిన ఇండియా–1 ఏటీఎంను ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం రూ.100 విత్‌డ్రా కోసం కొడితే ఏకంగా రూ.500 బయటకు రావడంతో ఖాతాదారులు వరుస కట్టారు. రూ.రెండు వేల విత్‌డ్రా కోసం యత్నిస్తే రూ.10 వేలు రావడంతో అవాక్కయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు వచ్చి డబ్బులు డ్రా చేసుకోవడంతో జనసందోహం నెలకొంది. పెట్రోలింగ్‌కు వచ్చిన పోలీసులు అక్కడ గుంపులుగా ఉన్న వారిని చెదరగొట్టి ఆరా తీసి, ఏటీఎంకు తాళం వేసి నిర్వాహకులకు సమాచారమిచ్చారు. వంద నోట్ల స్థానంలో రూ.500 నోట్లు పెట్టడం వల్లే.. రెండు రోజులకోసారి ఈ ఏటీఎంలో నగదును నిల్వ చేయడానికి వస్తున్న సిబ్బంది తప్పిదం వల్లే ఇలా జరిగిందని బయటపడింది. రూ.100 నోట్ల కట్టల స్థానంలో రూ.500 నోట్లను పెట్టారు. దీంతో రూ.100 విత్‌డ్రా కోసం నొక్కితే రూ.500 వచ్చా యని నిర్వాహకులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇలా కొన్ని గంటల్లోనే రూ.5,80,000 అదనంగా విత్‌డ్రా అయ్యాయని తేలింది. చివరకు సీసీకెమెరాల ఆధారంగా ఏటీఎం కార్డు, ఖాతా నంబర్లు సేకరించి డ్రా చేసుకున్న అధిక మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఫోన్లలో ఖాతాదా రులకు సమాచారం ఇచ్చారు. చివరకు రూ.1.2 లక్షలు రికవరీ చేశారు. కాగా, ఈ వ్యవహారంలో ఏటీఎం సిబ్బందికి ఖాతాదారులు సహకరించాలని లేదంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటా మని ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. -
ఏటీఎంను ఎత్తుకెళ్లిన దుండగులు
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. కలెక్టరేట్ చౌరస్తాలో ఏటీఎంను ఎత్తుకెళ్లిన దుండగులు.. క్యాష్ బాక్సును ధ్వంసం చేసి నగదు అపహరించారు. ఏటీఎం మిషన్‌ను సావర్గమ్ ప్రాంతంలో దుండగులు పడేశారు. నిందితులను అంతర్రాష్ట్ర దొంగలుగా పోలీసులు గుర్తించారు. నిందితుల ఆచూకీ కోసం నాలుగు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటన వివరాలను డీఎస్పీ వెంకటేశ్వరరావు ‘సాక్షి’కి వివరించారు. (చదవండి: వేధింపులపై పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్) ఈ దొంగల ముఠా మొదట.. సోనార్ బజార్ ప్రాంతంలో వైష్ణవి జ్యువెలరీలో చోరీ చేయడానికి యత్నం చేశారని ఆ ప్రయత్నం విఫలమైందని.. అక్కడి నుండి కలెక్టర్ చౌరస్తాలో ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారని తెలిపారు. తాళ్లతో కట్టి.. టవేరా వాహనంలో ఏటీఎం మిషన్‌ను ఎత్తుకెళ్లారని డీఎస్పీ వెల్లడించారు. (చదవండి: శిగం ఊగుతుందని..) -
ఎస్బీఐ ఏటీఎంకు మొబైల్ తీసుకెళ్లండి!
ఎస్బీఐ ఏటీఎంలలో రూ.10వేలు, అంతకు మించి చేసే డెబిట్ కార్డు నగదు ఉపసంహరణలకు ఓటీపీ నమోదు చేయడం అన్నది ఇకపై 24 గంటల పాటు అమల్లోకి రానుంది. ప్రస్తుతానికి రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల మధ్య ఎస్బీఐ ఏటీఎంల్లో రూ.10వేలకు మించి చేసే ఉపసంహరణలకు కస్టమర్ల మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఇవ్వడం తప్పనిసరిగా అమల్లో ఉంది. రాత్రి వేళల్లో మోసాలకు తావు లేకుండా ఉండే ఉద్దేశ్యంతో ఈ ఏడాది జనవరిలో ఈ సదుపాయాన్ని ఎస్బీఐ తీసుకొచ్చింది. ఇది మంచి ఫలితాలను ఇవ్వడంతో ఈ నెల 18 నుంచి రోజులో అన్ని వేళల్లోనూ (24గంటల పాటు) రూ.10వేలు అంతకుమించి చేసే నగదు ఉపసంహరణలకు పిన్ నంబర్‌తోపాటు ఓటీపీ నమోదు చేయాల్సి ఉంటుందని ఎస్బీఐ ప్రకటించింది. ఎస్బీఐ కార్డుదారులకు ఉచితంగా క్రెడిట్ స్కోరు! న్యూఢిల్లీ: ఎస్బీఐ క్రెడిట్ కార్డు దారులకు క్రెడిట్ స్కోరు తెలుసుకునే సదుపాయం కల్పించనున్నామని సంస్థ ఎండీ, సీఈవో అశ్విని కుమార్ తివారీ తెలిపారు. ‘‘అమెరికాలో మాదిరిగా రెండు మూడు అంశాలను ఇక్కడ ప్రవేశపెట్టాలనుకుంటున్నాను. క్రెడిట్‌కార్డు దారులకు వారి ఖాతా నుంచి క్రెడిట్ స్కోరు తెలుసుకునే సదుపాయం ఇందులో ఒకటి. అకౌంట్లో లాగిన్ అయినప్పుడు తమ క్రెడిట్ స్కోరు ఎంతో ఎటువంటి ఖర్చు లేకుండా తెలుసుకోవచ్చు. అమెరికాలో ఇది సర్వ సాధారణం. దీని ద్వారా అన్ని సమయాల్లోనూ తమ క్రెడిట్ స్కోరు ఏ విధంగా మార్పులు చెందుతుందో తెలుసుకోవచ్చు. కస్టమర్ అనుకూలమైన ఈ చర్యను వెంటనే అమలు చేయాల్సి ఉంది. దీనిపై మా బృందంతో చర్చించాను’’ అని వివరించారు. ‘‘ రిటైలర్ స్థాయిలో ఈ విధమైన స్కీమ్‌పై పని చేయాలనకుంటున్నాము. ఇప్పటికే ఎస్బీఐ కార్డ్ కో బ్రాండెడ్ విభాగంలో 14 ఒప్పందాలను కలిగి ఉంది. మరింత పెంచాలనుకుంటున్నాము. కస్టమర్ల సేవల విస్తృతిపై దృష్టి సారించాము’’ అని తివారీ తెలిపారు. -
ఏటీఎం మిషన్లే వీరి టార్గెట్
సాక్షి, గజ్వేల్ : జల్సాలకు అలవాటు పడిన నలుగురు యువకులు సులువుగా డబ్బు సంపాదించాలని చోరీ బాట పట్టారు. పథకం ప్రకారం రెండు సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. మూడోసారి ఎలాగైనా డబ్బు దొంగిలించాలని పక్కా ప్రణాళిక రూపొందించుకొని ఓ ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారు. గజ్వేల్‌లో అనుమానాస్పదంగా తిరుగుతూ గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు శుక్రవారం పట్టుబడ్డారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధి ప్రజ్ఞాపూర్ చౌరస్తా జగదేవ్‌పూర్ రోడ్డులో ఉన్న ఏటీఎం మిషన్‌ను ఎత్తుకెళ్లినట్లు పోలీసుల విచారణలో తెలుసుకున్నట్లు గజ్వేల్ ఏసీపీ నారాయణ వెల్లడించారు. ప్రజ్ఞాపూర్‌లోని తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ చోరీ వివరాలు తెలిపారు. గజ్వేల్ పట్టణంలోని పిడిచెడ్ రోడ్డులో శుక్రవారం తెల్లవారు జామున ఐడీబీఐ ఏటీఎం వద్ద ఆటోలో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ గస్తీ నిర్వహిస్తున్న క్రైమ్ పార్టీ పోలీస్ కానిస్టేబుళ్లకు కనిపించారు. వారిని తనిఖీ చేయడంతో ఆటోలో గడ్డపార, సుత్తి, రాడ్, కటింగ్ ప్లయర్ ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకపోవడంతో వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేశారు. ములుగు మండలం తున్కిబొల్లారం ఆర్అండ్ఆర్ కాలనీలో నివాసముంటున్న బైలంపూర్‌కు చెందిన ఆటో డ్రైవర్లు బొమ్మ స్వామి, బొమ్మ ఐలేని అలియాస్ ఐలేష్ అన్నదమ్ములు. బొమ్మ స్వామి ఆటో(టీఎస్ 26టీ 2021)ను తన గ్రామం నుంచి గజ్వేల్‌కు నడుపుతుంటారు. వీరికి గజ్వేల్ పట్టణంలోని ఢిల్లీవాల హోటల్ సమీపంలో నివాసముండే పెయింటర్ రాయపోల్ మండలం మంతూర్ గ్రామానికి చెందిన తంగలపల్లి నవీన్ అలియాస్ నవీన్‌కుమార్, వడ్డేపల్లికి చెందిన అయ్యగల్ల నవీన్‌తో పరిచయం ఏర్పడింది. ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే పథకం పన్నారు. ఏటీఎంల్లో డబ్బులు ఉండి సెక్యూరిటీ ఉండని వాటిని చోరీ చేసేందుకు ప్లాన్ వేసుకున్నారు. ఈ క్రమంలో జూన్ 11న తుర్కపల్లి దగ్గరలోని మురహరిపల్లి ఏటీఎం వద్దకు స్వామి ఆటోలో ఐలేష్, తంగలపల్లి నవీన్, అయయగల్ల నవీన్, గంగొల్ల ప్రశాంత్ వెళ్లి సీసీ కెమెరాల వైర్లను తొలగించారు. ఏటీఎం మిషన్‌ను పగలగొట్టి డబ్బులు దొంగిలించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. మళ్లీ రెండోసారి జూన్ 22న రాత్రి సమయంలో గౌరారం బస్టాప్ సమీపంలో ఉన్న ఏటీఎం సీసీ కెమరాల వైర్లను తొలగించారు. మిషన్‌ను పగలగొట్టేందుకు ప్రయత్నించి మరోసారి విఫలయ్యారు. రెండు సార్లు ప్రయత్నించి విఫలం కావడంతో జూన్ 26వ తేదీన స్వామి, ఐలేష్, తంగలపల్లి నవీన్, అయ్యగల్ల నవీన్ సమావేశమయ్యారు. మూడోసారి ఎలాగైనా చోరీ చేయాలని పక్కా ప్లాన్ వేసుకున్నారు. ఈ క్రమంలో ముందుగా ప్రజ్ఞాపూర్‌కు వచ్చి జగదేవ్‌పూర్ రోడ్డులో బెంగుళూరు కేంద్రంగా నడిచే ఇండియా వన్ ఏటీఎం సెంటర్ వద్ద రెక్కి నిర్వహించారు. అదే రోజు రాత్రి సీసీ కెమెరాలను తొలగించి వెళ్లారు. 27న ఆటోలో ఏటీఎం సెంటర్‌కు వచ్చి ఏటీఎం మిషన్‌ను రాడ్లతో పెకిలించారు. మిషన్‌ను ఆటోలో వేసుకొని రింగురోడ్డు మీదుగా గౌరారం మార్స్ కంపెనీ పక్కన ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఏటీఎం మిషన్‌ను పగలగొట్టి అందులో ఉన్న రూ. 4,98,800 నగదును పంచుకున్నారు. అయితే బొమ్మ స్వామి 2015లో గజ్వేల్‌లో దొంగతనం చేసిన కేసులో, అతడి తమ్ముడు ఐలేష్ ములుగు అత్యాచారం కేసులో అరెస్టయి జైలుకు వెళ్లారు. ఇక దొంగిలించిన డబ్బు పంచుకోగా అందులో రూ. 28 వేలు ఖర్చుచేశారు. వీరి నుంచి రూ.470 లక్షల నగదు, ఆటో, దొంగతనానికి ఉపయోగించిన గడ్డపార, సుత్తి, రాడ్‌ను పోలీసులు స్వాధీనం చేసున్నారు. ఏటీఎం మిషన్ చోరీకి గురైనట్లు జూన్ 29న దుద్దెడకు చెందిన గున్నాల నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చోరీ కేసు చేధించి దొంగలను పట్టుకోవడంలో కీలకపాత్ర వహించిన గజ్వేల్ సీఐ ఆంజనేయులు, అదనపు సీఐ మధుసూదన్‌రెడ్డి, ట్రాఫిక్ సీఐ నర్సింహారావు, టాస్క్‌ఫోర్స్ సీఐ ప్రసాద్, సీసీ కెమెరా టీం సభ్యులు పరంధాములు, ఏఎస్ఐ సంధాని, క్రైంపార్టీ హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య, పోలీస్ కానిస్టేబుళ్లు యాదగిరి, సుభాష్‌ను రివార్డుతో అభినందించినట్లు తెలిపారు. -
ఫోన్ చేస్తే చాలు.. ఇంటికే ఏటీఎం
చిలకలపూడి (మచిలీపట్నం): ప్రజల సౌలభ్యం కోసం గ్రామాల్లో మొబైల్ ఏటీఎంలను ఏర్పాటు చేసినట్లు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో బ్యాంకు నుంచి సొమ్ము విత్ డ్రా చేసేందుకు ఇబ్బందులు పడుతున్న గ్రామీణ ప్రజలకు తమ బ్యాంకు ద్వారా ఏర్పాటు చేసిన మొబైల్ ఏటీఎంలను అందుబాటులో ఉంచుతామన్నారు. (తగినంత నగదు ఉండేలా చూసుకోండి..) ఇందుకోసం ఆయా గ్రామాల ప్రజలు సంబంధిత సహకార సంఘ కార్యదర్శికి సమాచారం అందిస్తే వెంటనే మొబైల్ ఏటీఎంలను పంపిస్తామన్నారు. విజయవాడ, నూజివీడు డివిజన్లకు సంబంధించి 99496 88340, గుడివాడ, మచిలీపట్నం డివిజన్లకు సంబంధించి 99496 88362కు ఫోన్ చేసి సమాచారం అందించిన వెంటనే మొబైల్ ఏటీఎంలను పంపిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. (క్వార్టర్ @ 300) చదవండి: అమ్మ ఎవరికైనా అమ్మే..! చదవండి: అడ్మిన్.. తస్మాత్ జాగ్రత్త! -
మాయమైన ఏటీఎం మిషన్ లభ్యం
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని దండగులు అపహరించుకు వెళ్లిన ఏటీఎం మిషన్ ఆచూకీ లభించింది. కంది మండలం చేర్యాల గ్రామ శివారులో ఇండి క్యాష్ ఏటీఎం మిషన్‌ను పోలీసులు సోమవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో జాతీయ రహదారి పక్కనున్న ఓ షటర్లో రెండు ఇండిక్యాష్ ఏటీఎంలలో ఆదివారం తెల్లవారుజామున ఒక ఏటీఎంను ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో ఓ ఖాతాదారుడు ఏటీఎంలో నగదు డ్రా చేసేందుకు వెళ్లగా అక్కడ ఒకటే ఏటీఎం మిషన్ ఉండటంతో పోలీసులకు సమాచారం అందించాడు. కాగా దుండగులు ఎత్తుకెళ్లిన ఏటీఎంలో 2,27,000 నగదు ఉందని పోలీసులు తెలిపారు. -
ఏటీఎం మిషిన్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు
సాక్షి, సంగారెడ్డి : జిల్లాలోని రుద్రారం గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎం మిషిన్‌ను ఎత్తుకెళ్లిపోయారు. జాతీయ రహదారి పక్కన ఉన్న ఇండీ క్యాష్ ఏటీఎంలో చోరీకి పాల్పడిన దుండగులు ఏటీఎం మిషన్‌ను ఎత్తుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న పఠాన్‌చెరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం సహాయంతో విచారణ చేపట్టారు. గతంలో శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపురం గ్రామంలోనూ ఏటీఎం మిషిన్‌ను దొంగలెత్తుకెళ్లారు. అనంతరం జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి పంటపొలాల్లో ఏటీఎం మిషన్‌ను పడేసి వెళ్లారు. చదవండి : పొలాల్లో ప్రత్యక్షమైన ఏటీఎం మిషిన్ -
పొలాల్లో ప్రత్యక్షమైన ఏటీఎం మిషన్
సాక్షి, శ్రీకాకుళం : ఏసీ గదుల్లో, సీసీ ఫుటేజీ కనుసన్నల్లో ఉండాల్సిన ఏటీఎం మిషన్ పంట పొలాల్లో పూర్తిగా ధ్వంసమై లభించిన ఘటన పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలకు సమీపంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే...పలాస మండలం లక్ష్మీపురం గ్రామానికి సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి పంటపొలాల్లో ఏటిఎం మిషన్ సోమవారం దర్శనమిచ్చింది. ఉదయం పంట పొలాలకు వచ్చిన రైతులు మిషన్‌ను గుర్తించి కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కాశీబుగ్గ సీఐ ఆర్.వేణుగోపాలరావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన ఈ ఘటనపై ఎస్పీ అమ్మిరెడ్డికి సమాచారం అందించగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని రహదారులను అలెర్ట్ చేసి తనిఖీలు చేపట్టారు. అనంతరం ఘటనా స్థలానికి రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి బ్రాహ్మణతర్లా ఎస్బీఐ మేనేజర్, సిబ్బిందిని తీసుకోచ్చి పరిశీలించగా అది ఎస్బీఐ ఏటీఎం మిషన్‌గా గుర్తించారు. దీంతో పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలలో ఉన్నటువంటి 19 బ్యాంకులు, 24 ఏటీఎం మిషన్లను, పరిసర ప్రాంతాలకు చెందిన ఏటీఎంలను పరిశీలించారు. పలాసకు క్లూస్ టీమ్ రాక జాతీయ రహదారి పక్కన పంట పొలాల్లో ఉన్నటువంటి ఏటీఎం విడిభాగాలను ఎవ్వరూ తాకకుండా స్థానికులు రక్షణ కల్పించడంతో శ్రీకాకుళం నుంచి క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని వేలి ముద్రలను సేకరించారు. మిషన్‌ను వాహనంలో తీసుకొచ్చి పడివేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే శనివారం నాడు ఎచ్చెర్లలో జరిగిన ఏటీఎం చోరీలో మాయమైన క్యాష్ మిషన్ ఇదేనేమో అని అనుమానిస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
కరెన్సీ వాన కురిపించిన ఏటీఎం
-
ఏకంగా ఏటీఎం మెషీన్ ఎత్తుకెళ్లారు
-
ఏటీఎం దొంగలు.. పోలీసులకు సవాల్
-
అప్పు కోసం యాప్ చాలు!
► లేదంటే ఏటీఎంకు వెళితే సరి! ► పోటీ నేపథ్యంలో కస్టమర్ల చెంతకే ‘రుణ’ సేవలు ► ప్రైవేటు బ్యాంకులు, ఆర్థిక సంస్థల ఆఫర్ ► వాటితో జతకట్టి స్టార్టప్‌లూ రంగంలోకి... ఒకప్పుడు రుణం కావాలంటే చెప్పులు అరిగిపోయేలా బ్యాంకులో లేకపోతే ఆర్థిక సంస్థల చుట్టూనో తిరగాల్సి వచ్చేది. కానీ ఆ రోజులు పోయాయి. ఇప్పుడంతా ‘రుణం తీసుకోండి’ అంటూ వెంటపడే రోజులు. ‘బ్యాంకు వరకూ రావక్కర్లేదు ఏటీఎం మెషీన్ నుంచే దరఖాస్తు చేసుకుంటే చాలు. అదే రోజు రుణం మొత్తం ఖాతాలో జమ అవుతుంది’ ఇదీ తాజాగా బ్యాంకులిస్తున్న ఆఫర్. మీ దగ్గర స్మార్ట్‌ఫోన్ ఉంటే చిటికెలో రుణాలిచ్చే ఫైనాన్షియల్ యాప్స్ కూడా ఎన్నో వచ్చేశాయి. ఆ వివరాలివిగో... ఏటీఎంల నుంచే... ప్రైవేట్ రంగంలో అతిపెద్ద బ్యాంకు ఐసీఐసీఐ... ఇటీవలే ఏటీఎంల ద్వారా రూ.15 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను మంజూరు చేసే వినూత్న విధానాన్ని ప్రారంభించింది. కాకపోతే అందరికీ కాకుండా తన బ్యాంకులో వేతన ఖాతాలున్న ఎంపిక చేసిన కొందరికే తొలుత దీన్ని పరిమితం చేసింది. రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని సూచించే క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉన్నవారికి ఈ అవకాశం కల్పించింది. తర్వాత కాలంలో మరింత మందికి ఈ విధంగా రుణాలు మంజూరు చేసే అవకాశాన్ని పరిశీలిస్తామనీ తెలిపింది. అర్హత కలిగిన వారు ఏటీఎంలో ఏదైనా లావాదేవీ నిర్వహించిన తర్వాత స్క్రీన్‌పై రుణానికి సంబంధించిన సందేశం కనిపిస్తుంది. ఓకే చెబితే చాలు! కస్టమర్ ఖాతాలో రుణం జమవుతుంది. ఏటీఎం స్క్రీన్‌పైనే రుణ వడ్డీ రేటు, ఈఎంఐ, ప్రాసెసింగ్ ఫీజు వివరాలన్నీ కనిపిస్తాయి. ఇక హెచ్డీఎఫ్సీ బ్యాంకు సైతం నెట్‌బ్యాంకింగ్ నుంచే పర్సనల్ లోన్ తీసుకునే సదుపాయాన్ని అందిస్తోంది. బ్యాంకుల్లో రుణం లభించాలంటే క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉండాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఒకవేళ మీకు క్రెడిట్ హిస్టరీ లేకున్నా, లేదా బ్యాంకుతో దీర్ఘకాలిక అనుబంధం లేకున్నా సులభంగా రుణం కావాలనుకున్నా స్టార్టప్ యాప్‌లను సంప్రదించాల్సిందే. ఎర్లీశాలరీ డాట్ కామ్, లోన్‌ట్యాప్ ఇటువంటివే. యాప్ ఉంటే చాలు ఎటువంటి రుణ చరిత్రలేని కస్టమర్లను స్టార్టప్‌లు తమ వ్యాపార విస్తరణకు ప్రధాన లక్ష్యంగా చేసుకుంటున్నాయి. కాకపోతే వివిధ రకాల అంశాల ఆధారంగా రుణ అర్హతను తేల్చేస్తాయి. దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించడం, స్నేహితుల జాబితా, వారి ఖర్చుల తీరు, బ్యాంకు ఖాతా స్టేట్మెంట్ ఆధారంగా ఆర్థిక సామర్థ్యం, చరిత్రను విశ్లేషించి చూస్తాయి. ఎర్లీశాలరీ డాట్‌కామ్ అయితే ఒక రోజు నుంచి ఒక నెల కాలానికి పర్సనల్ లోన్స్‌ను మంజూరు చేస్తోంది. యాప్ ద్వారా రుణ దరఖాస్తును పూర్తి చేసి, కేవైసీ పత్రాలను జత చేసిన తర్వాత, అర్హత ఉంటే కొన్ని గంటల్లోపే రుణం మంజూరు అవుతుంది. కేవైసీ అన్నది మొదటిసారి మాత్రమే. ఒకసారి కేవైసీ ఇచ్చి, పర్సనల్ లోన్ తీసుకుని ఉన్నవారు, ఆ తర్వాత ఎప్పుడు రుణం కావాలన్నా అప్పటికప్పుడే పొందొచ్చు. దరఖాస్తుదారుల్లో 35% మంది కొత్తగా రుణాలు తీసుకుంటున్నవారే ఉంటున్నారని ఎర్లీశాలరీ సహ వ్యవస్థాపకుడు మెహరోత్రా తెలిపారు. ఇక లోన్‌ట్యాప్ అయితే రూ.5 లక్షల్లోపు రుణం ఆఫర్ చేస్తోంది. ఒక రోజు నుంచి ఐదేళ్ల వ్యవధికి రుణాన్ని తీసుకోవచ్చు. ఈ సంస్థ అందించే రుణం క్రెడిట్‌కార్డును పోలి ఉంటుంది. రుణం తీసుకున్న తర్వాత కనీస మొత్తం చెల్లించి, మిగిలిన రుణంపై వడ్డీ చెల్లిస్తే సరిపోతుందని లోన్‌ట్యాప్ సీఈవో సత్యం తెలిపారు. ఇతర సంస్థలు సైతం ఇక క్యుబెరా డాట్ కామ్ వంటి మధ్యవర్తిత్వ సంస్థలు కూడా ఉన్నాయి. ఈ సంస్థ ఆర్బీఎల్ బ్యాంక్, పేసెన్స్తో జతకట్టి రుణాలను ఆఫర్ చేస్తోంది. ఇండియా ఇన్ఫోలైన్ ఫైనాన్స్ కూడా ఈ తరహాలోనే పనిచేస్తోంది. క్యుబెరా, పేసెన్స్ సంస్థల నుంచి రుణాలు తీసుకుంటున్న వారిలో పెద్ద బ్యాంకుల ఖాతాదారులు సైతం ఉంటున్నారు. రుణ మంజూరులో ఉన్న వెసులుబాటే అందుకు కారణం. ఒకసారి కస్టమర్‌కు రుణాన్ని మంజూరు చేసి వారితో అనుబంధం ఏర్పడితే ఇక ఆ తర్వాత ఇన్‌స్టంట్‌గానే రుణాన్ని అందిస్తున్నట్టు పేసెన్స్ వ్యవస్థాపకుడు సయాలి కరంజ్‌కార్ తెలిపారు. అయితే, రుణాలు తీసుకోవడంలో ఉన్న ఈ సౌలభ్యాన్ని చూసి రుణ ఉచ్చులో చిక్కుకోవద్దని ఆర్థిక పండితులు సూచిస్తున్నారు. రుణం చెల్లించడంలో విఫలమైతే అవి క్రెడిట్ బ్యూరోకు సమాచారం చేరవేస్తాయి. దీంతో ఆ తర్వాత ప్రైవేటు సంస్థల వద్ద కూడా రుణం లభించడం కష్టతరమవుతుంది. అత్యవసరమైతేనే అత్యవసర పరిస్థితుల్లోనే ఈ తరహా సంస్థల నుంచి రుణాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకానీ, సాధారణ ఖర్చుల కోసం రుణాన్ని ఆశ్రయించి చిక్కులు తెచ్చుకోవద్దంటున్నారు. వ్యయాలు నియంత్రించుకోలేని పరిస్థితుల్లోనే సాధారణ వ్యక్తులు ఎక్కువ సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందుల్లో పడుతుంటారని హెచ్చరిస్తున్నారు. ఒకసారి రుణం తీసుకున్న తర్వాత మరోసారి తిరిగి రుణం తీసుకోకుండా ఉండడం కష్టమేనని సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మల్హార్ మజుందార్ పేర్కొన్నారు. -
కుర్రాడికి చిర్రెత్తింది!
ఇటు పోలీస్ చలాన్లు అటు నో క్యాష్ ఏటీఎంలు ►అసహనంతో ఏటీఎంల అద్దాలు ధ్వంసం ►హనం స్వాధీనం చేసుకున్న పోలీసులు ►చలాన్ సొమ్ము చెల్లించడానికి ►ఏటీఎంల చుట్టూ తిరిగినా దొరకని డబ్బు హైదరాబాద్: ఓవైపు ట్రాఫిక్ పోలీసుల చలాన్.. కట్టడానికి వెళ్తే.. వెక్కిరిస్తున్న నో క్యాష్ బోర్డులు.. అంతే.. ఓ కుర్రాడికి చిరెత్తుకొచ్చింది..2 ఏటీఎం కేంద్రాల అద్దాలను ధ్వంసం చేశాడు. ఈ ఉదంతం మంగళవారం సుల్తాన్‌బజార్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాహనాలపై స్పెషల్ డ్రైవ్స్ ప్రారంభించారు. సంతోష్‌నగర్‌కు చెందిన విద్యార్థి అమీర్ ఖాన్(21) తన వాహనంపై వస్తూ కోఠి ఉమెన్స్ కాలేజ్ వద్ద ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. పీడీఏ మిషన్‌లో తనిఖీ చేసిన పోలీసులు ఆ వాహనంపై రూ.505(నాలుగు చలాన్లు) పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అమీర్ హెల్మెట్ ధరించకపోవడం, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ లేకపోవడంతో మరో రూ.1,300 స్పాట్లో వడ్డించారు. జరిమానా మొత్తం రూ.1,805 చెల్లించి వాహనాన్ని తీసుకువెళ్లాలని సూచించారు. ఈ–చలాన్ ప్రతిని తీసుకున్న అమీర్ దాన్ని చెల్లించడానికి అవసరమైన డబ్బు కోసం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఏటీఎంల చుట్టూ తిరిగాడు. 20 చోట్ల ప్రయత్నించినా డబ్బు దొరకలేదు. తిరిగి ఉమెన్స్ కాలేజీ వద్దకు వచ్చిన అమీర్.. అక్కడి ఇండిక్యాష్, ఫెడరల్ బ్యాంక్ ఏటీఎంల్లోకి వెళ్లాడు. అక్కడా ‘నో క్యాష్’బోర్డు కనిపించడంతో తీవ్ర అసహనానికి గురై కాలితో వాటి అద్దాలను ధ్వంసం చేశాడు. ఈ క్రమంలో అమీర్ కాలికి తీవ్రగాయమైంది. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు అమీర్‌ను అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించగా వైద్యులు ఐదు కుట్లు వేశారు. అక్కడి నుంచి అతడిని సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు ప్రజా ఆస్తుల విధ్వంసక చట్టంలోని 427 ప్రకారం నిందితుడిపై కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ పోలీసులు చలాన్ చెల్లించమంటూ వేధించడం, ఏటీఎం కేంద్రాల్లో డబ్బు లేకపోవడంతోనే తాను అసహనానికిలోనై ఏటీఎం కేంద్రాన్ని ధ్వంసం చేశానని అమీర్ మీడియాతో చెప్పాడు. కార్డు ద్వారానూ చెల్లించవచ్చు మూడు అంతకంటే ఎక్కువ ఈ–చ లాన్లు పెండింగ్‌లో ఉంటేనే వాహనాన్ని స్వాధీనం చేసుకుంటున్నాం. జరిమానా మొత్తాన్ని పోలీసులు నగదుగా తీసుకోరు. ఈ–సేవ, మీ–సేవ కేంద్రాలతో పాటు ఆన్లైన్ ద్వారా చెల్లించే ఆస్కారం ఉంది. అక్కడ నగదే కాదు డెబిట్/క్రెడిట్ కార్డులు సైతం వినియోగించవచ్చు. వాహన చోదకులు ఆన్లైన్లో తనిఖీ చేసుకోవడం ద్వారా తమ వాహనంపై జారీ అయిన ఈ–చలాన్లు ఎన్నో తెలుసుకోవచ్చు. ఎప్ప టికప్పుడు వాటిని క్లియర్ చేస్తే ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో ఇబ్బందులు ఉండవు. – ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ డీసీపీ -
డబ్బులు రాలేదని.. ఏటీఎం పగలగొట్టాడు
ఏటీఎంలలోంచి డబ్బులు రాకపోవడంతో ప్రజల్లో అసహనం, అసంతృప్తి తీవ్రమవుతున్నాయి. గడిచిన నాలుగు రోజులుగా ఎక్కడా ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా అవ్వకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో ఎక్కడ తిరిగినా డబ్బు దొరక్కపోవడంతో అసహనానికి గురైన ఓ యువకుడు ఏకంగా ఏటీఎంలపై తమ ఆవేశాన్ని వెళ్లగక్కాడు. కోఠి ఉమెన్స్ కాలేజీ బస్ స్టాప్ సమీపంలో ఉన్న ఫెడరల్ బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవడానికి వచ్చిన ఓ యువకుడు ఆ ఏటీఎంలో డబ్బు లేకపోవడంతో ఆగ్రహంతో ఏటీఎంను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నించినా డబ్బులు రాకపోవడంతో ఆగ్రహంతో దాని అద్దాలను పగులగొట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి.. ఏటీఎంను పాడుచేయడానికి ప్రయత్నిస్తున్నఅమీర్ ఖాన్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసులు ప్రశ్నించినప్పుడు అమీర్ ఖాన్ చెప్పిన విషయం మరో కొత్త వివాదానికి కారణమైంది. ట్రాఫిక్ పోలీసులు వేధించడం వల్లే తాను ఏటీఎంను ధ్వంసం చేశానని అతడు చెప్పాడు. పెండింగులో ఉన్న చలాన్ మొత్తం అప్పటికప్పుడే చెల్లించాలంటూ తన వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారని, తన చేతిలో డబ్బులు లేకపోవడంతో పలు ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నించినట్లు చెప్పాడు. ఎన్నిచోట్ల తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోనే ఏటీఎంను ధ్వంసం చేయడానికి ప్రయత్నించానన్నాడు. -
డబ్బులు రాలేదని.. ఏటీఎం పగలగొట్టాడు
-
ఏటీఎం బద్దలు కొట్టి చోరీకి యత్నం
-
ఏటీఎం బద్దలు కొట్టి చోరీకి యత్నం
హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీ మాదన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ధోబీఘాట్ చౌరస్తాలో ఉన్న స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఏటీఎంను బద్దలుకొట్టి నగదు చోరీ చేసేందుకు దుండగులు యత్నించారు. ఈ సంఘటన సోమవారం వేకువజామున జరిగింది. స్థానికుల సమాచారం మేరకు క్లూస్ టీమ్ పోలీసులు ఏటీఎంను పరిశీలించారు. నగదు చోరీ అయిందా లేదా అన్న విషయం తెలియరాలేదు. బ్యాంకు అధికారులు పరిశీలించి చోరీ జరిగిందా లేదా అనే విషయాన్ని నిర్థారించనున్నారు. -
ఆ లోపాలే ‘క్యాష్’!
చిరుద్యోగుల ఆధీనంలో రూ. కోట్ల నగదు పక్కాగా లేని ఆడిటింగ్ స్వాహా చేస్తున్న ఉద్యోగులు ‘ఆర్సీఐ కేసు’ యాజమాన్యానికీ భాగస్వామ్యం సిటీబ్యూరో: 2012లో లోయర్ ట్యాంక్‌బండ్‌లోని సీఎంఎస్ కార్యాలయంలో రూ.2.6 కోట్లు... 2014లో నెల్లూరు కేంద్రంగా పని చేస్తే సంస్థలో రూ.57 లక్షలు... 2015లో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సంస్థ నుంచి రూ.31 లక్షలు... తాజాగా ఆర్సీఐ సంస్థలో రూ.9.98 కోట్లు... వివిధ బ్యాంకులకు చెందిన ఏటీఎం మిషీన్లలో నగదు నింపే బాధ్యతలు నిర్వర్తిస్తున్న కస్టోడియన్లు స్వాహా చేసిన మొత్తాలివి. ఆయా సంస్థల్లో ఉన్న వ్యవస్థాగత లోపాలే వీరికి కలిసి వస్తున్నాయని పోలీసులు గుర్తించారు. వీటినే క్యాష్ చేసుకున్న నిందితులు భారీగా నగదు పక్కదారి పట్టింస్తున్నారని చెప్తున్నారు. ప్రజాధనం దుండగుల పాలవుతున్నా... ఆయా బ్యాంకులు మాత్రం సంస్కరణలపై దృష్టి పెట్టడంలేదు. ఆర్సీఐ ఫ్రాడ్‌లో కస్టోడియన్లతో పాటు ఏకంగా యాజమాన్యం పాత్ర వెలుగులోకి రావడంతో అధికారులే అవాక్కయ్యారు. ఔట్సోర్సింగ్ చేతుల్లో నగదు భర్తీ... ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ ఏటీఎంల్లో నగదును నింపే కాంట్రాక్టును ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ కేంద్రాలుగా నడిచే ప్రైవేట్ సంస్థలకు ఔట్సోర్సింగ్ పద్ధతిలో కాంట్రాక్టుకు అప్పగిస్తున్నాయి. ఈ పని చేయడానికి ఆయా సంస్థలు అనేక మందిని ఉద్యోగులుగా నియమించుకుంటున్నాయి. వీరిలో కస్టోడియన్లుగా పిలిచే ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకం. వీరు బ్యాంకులకు చెందిన కేంద్రాల నుంచి కోట్ల రూపాయలు తమ సంస్థల వాహనాల్లో తీసుకొచ్చి, ఆ మొత్తాన్ని ఆయా బ్యాంకుల ఏటీఎం సెంటర్లలోని మిషీషన్లలో డిపాజిట్ చేస్తుంటారు. గతం తెలీదు.. నిఘా లేదు... కస్టోడియన్లుగా చేరే ఉద్యోగుల పూర్తి వివరాలు ఏటీఎంలో డబ్బు నింపే కాంట్రాక్టు పొందిన సంస్థలు తమ వద్ద ఉంచుకోవడం గానీ, వారి గత చరిత్రను పరిశీలించడంగానీ చేయడం లేదు. అలాగే వారి కార్యకలాపాలపై నిఘా ఉంచట్లేదు. ఫలితంగానే నేరం వెలుగులోకి వచ్చినా.. నిందితులను పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. ఓ బృందం బ్యాంక్ నుంచి సదరు వాహనంలో ఎంత మొత్తం తీసుకుని బయలుదేరింది. ఎంత మొత్తం కార్యాలయంలో అప్పగించింది అనే అంశాలు కేవలం మాన్యువల్‌గా పుస్తకాల్లో లేదా కంప్యూటర్లో నమోదు చేస్తున్నారు. అలాగే, ఈ డబ్బులో ఎంత మొత్తం ఏటీఎం సెంటర్లో డిపాజిట్ చేశారనేది కూడా మాన్యువల్‌గానే రికార్డు చేస్తున్నారు తప్ప.. డిపాజిట్ చేసిన మొత్తాన్ని సాంకేతికంగా లెక్కించే మెకానిజంను ఆయా సంస్థలు ఇప్పటి వరకూ అందిపుచ్చుకో లేదు. అంతర్గత విచారణతో జాప్యం... ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపిన కస్టోడియన్లు డ్యూటీ దిగిన తర్వాత మళ్లీ వెళ్లి ఏటీఎంలను తెరిచినా గుర్తించే పరిజ్ఞానం బ్యాంకుల వద్ద ఉండట్లేదు. దీనిని ఆసరా చేసుకొని కస్టోడియన్లు ఏటీఎంల్లో అవసరమైన డబ్బు డిపాజిట్ చేశామని నమ్మిస్తూ కోట్ల రూపాయలు గోల్మాల్ చేస్తున్నా కాంట్రాక్టు సంస్థలు వెంటనే గుర్తించలేకపోతున్నాయి. అప్పుడప్పుడు జరిగే ఆడిటింగ్‌లో అసలు విషయం బయటకు వచ్చినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అంతర్గత విచారణ పేరుతో జాప్యం చేస్తున్నాయి. ఇవన్నీ పూర్తయ్యాక పోలీసులను ఆశ్రయిస్తుండటంతో దర్యాప్తు క్లిష్టంగా మారుతోందని అధికారులు చెప్తున్నారు. ఈసారి ఏకంగా యాజమాన్యంతో కలిసి... ఏటీఎంల్లో నగదు గోల్మాల్ చేస్తున్న కస్టోడియన్లు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి తొలినాళ్లలో కేవలం ఒకటి రెండు రోజుల సర్దుబాటు కోసం నగదు పక్కదారి పట్టించడం, ఆ తరవాత స్వాహా చేయడం పరిపాటిగా మారిందని పోలీసులు అంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో జరిగిన కేసునే తీసుకుంటే తొలుత ఏటీఎంల్లో నగదు డిపాజిట్ చేసిన కస్టోడియన్లు ఆ తర్వాత వెళ్లి మిషీన్లు ఓపెన్ చేసి, ఆ నగదును స్వాహా చేశారు. వీరిని కనిపెట్టే మెకానిజం, సీసీ కెమెరాలు ఉన్నా... కాంట్రాక్ట్ సంస్థల నిఘా లేకపోవం, నిర్లక్ష్యం వల్ల వెంటనే విషయం బయటకు రాలేదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఆర్సీఐ సంస్థ విషయానికి వస్తే తొలుత సంస్థకు చెందిన కీలక వ్యక్తులే కస్టోడియన్ల ద్వారా నగదు పక్కదారి పట్టించారు. దీన్ని అదునుగా తీసుకుని ఉద్యోగులు ఆపై సొంతంగా స్వాహా చేశారు. ‘ఆర్సీఐ’పై పట్నాలోనూ కేసు... ఎస్బీఐ ఏటీఎంల్లో పెట్టాల్సిన నగదు గోల్‌మాల్‌కు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్సీఐ సంస్థపై బీహార్‌లోని పట్నాలోనూ కేసు నమోదైంది. ఆ నగరంలోని వివిధ బ్యాంకులకు చెందిన 770 ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపే బాధ్యతల్ని ఆర్సీఐ పర్యవేక్షిస్తోంది. ఇందులో కస్టోడియన్లుగా పని చేస్తున్న రాకేష్ రాయ్, రాహుల్ కుమార్, అవినాష్ కుమార్, రాజీవ్ కుమార్, ధర్మ్వీర్ కుమార్, చంద్రభాను కుమార్, అభిమన్యు కుమార్, అభిషేక్‌కుమార్, పప్పు కుమార్‌లు 27 ఏటీఎంల్లో పెట్టాల్సిన రూ.2.12 కోట్లు కాజేశారంటూ ఆర్సీఐ అధికారి చిన్మయ్ చందన్ పట్నాలోని డిఘా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ పోలీసులు ప్రాథమికంగా ఈనెల 10న తొమ్మిది మందిపైనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే నగరంలో వెలుగులోకి వచ్చిన వ్యవహారంతో డిఘా పోలీసులు అప్రమత్తమయ్యారు. పట్నాలోనూ ఆర్సీఐ యాజమాన్యమే ఫ్రాడ్ చేసి, కస్టోడియన్లపై నెడుతోందా? లేక కస్టోడియన్లతో కలిసి గోల్‌మాల్‌కు పాల్పడిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆర్సీఐ సంస్థపై మరికొన్ని రాష్ట్రాల్లోనూ కేసులు ఉన్నట్లు సీసీఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనూ ఆరా తీస్తున్నారు. -
ఏటీఎంను ధ్వసం చేసిన దుండగులు
కడప: వైఎస్సార్ జిల్లా జిల్లా కేంద్రం కడప నగరంలోని ప్రకాశ్‌నగర్‌లో ఆదివారం రాత్రి దొంగలు ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు. ఏటీఎం సెంటర్లోకి ప్రవేశించిన దొంగలు మొదట దానిని తెరిచేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అది ఎంతకూ తెరుచుకోకపోవడంతో ఏకంగా ఏటీఎం మిషన్‌ను ఊడబెరికే ప్రయత్నం చేశారు. అదికూడా సాధ్యపడకపోవడంతో పలాయనం చిత్తగించారు. స్థానికులు సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీం రప్పించి వివరాలు సేకరిస్తున్నారు. -
ఏటీఎం ధ్వంసం చేసిన దుండగులు
తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి మండల కేంద్రంలో ఓ ఏటీఎం కేంద్రాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రంలోని యల్లనూరు రోడ్డులో గల ఎస్బీఐ ఏటీఎం కేంద్రంలోకి చొరబడిన దుండగులు రెండు మిషన్లు పూర్తిగా ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. అయితే దుండగులు ఎంత నగదును ఎత్తుకెళ్లారనేది ఇంకా తెలియరాలేదు. -
ఎస్బీహెచ్ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం
వరంగల్: జిల్లాలోని మహబూబాబాద్ ఇల్లందు రోడ్డులో రాత్రి దోపిడీ దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. ఎస్బీహెచ్ ఏటీఎంలో నగదు చోరీకి యత్నించారు. నగదు దొంగలించేందుకు ప్రయత్నించినా తలపులు తెరుచుకోకపోవడంతో దుండగులు ఏటీఎం మిషన్‌ను పగులుగొట్టి వెళ్లినట్టు సమాచారం. -
ఎటిఎమ్ మెషీన్ లో ఉపయోగించిన ఆపరేటింగ్ సిస్టమ్?
1. The memory address of the first element of an array is called ___ a) floor address b) foundation address c) first address d) base address e) second address 2. The term "push" and "pop" is related to the ___ a) Array b) Lists c) Stacks d) All the above e) None of these 3. A data structure where elements can be added or removed at either end but not in the middle: a) Linked lists b) Deque c) Stacks d) Queues e) Bugs 4. Which of the following case does not exist in complexity theory? a) Best case b) Worst case c) Null case d) Average case e) Middle case 5. The operation of processing each element in the list is known as ___ a) Traversal b) Sorting c) Merging d) Inserting e) Layout 6. Human beings are referred to as Homo Sapiens, which device is called Sillico Sapien? a) Hardware b) Robot c) Computer d) Monitor e) RAM 7. A small or intelligent device is so called because it contains within it a ___ a) Computer b) Microcomputer c) Programmable d) Sensor e) Cursor 8. The Analytical Engine developed during First Generation of computers used ___ as a memory unit. a) Floppies b) RAM c) Counter Wheels d) Cards e) Wires 9. Which of the following devices is specially designed to forward packets to specific ports based on the packet's address? a) Switching hub b) Specialty hub c) Filtering hub d) Port hub e) Pin hub 10. What is the Operating System used in ATM machine? a) Windows XP b) Windows 7 c) Linux d) Windows 8.1 e) Windows XP or Linux based 11. BOSS is developed in which country? a) Japan b) USA c) UK d) India e) China 12. A system call is a method by which a program makes a request to the ____ a) Input Management b) Interrupt processing c) Output Management d) Operating system e) Operating Management 13. Which of the following is the older high-level (non-assembler) programming language? a) C b) LISP c) FORTRAN d) BASIC e) C++ 14. Which device is used as the standard pointing device in a Graphical User Environment? a) Keyboard b) Mouse c) Joystick d) Trackball e) Printer 15. The section of the CPU that is responsible for performing mathematical operations: a) Memory b) Register Unit c) Control Unit d) ALU e) None of the above 16. Which of the following might be used by a company to satisfy its growing communication needs? a) Front end processor b) Multiplexer c) Controller d) Concentrator e) All of the above 17. Microsoft .NET is ___ a) Open Source b) Closed Source c) Browser d) Middle Source e) All the above 18. Technical documentation is prepared by? a) Users b) Coders c) Mangers d) Marketing & sales people e) Students 19. Comments can be added using __ a) \comments b) /* */ c) // d) % e) $ 20. What are the three main types of computer programming languages? a) Machine language, assembly language, high level language b) Imperative language, functional language, declarative language c) COBOL, FORTRAN-77, C++ d) a and c e) None of these 21. Which of the following network access standard is used for connecting stations to a circuit-switched network? a) X.3 b) X.21 c) X.25 d) X.75 e) X.8 22. Which of the following is usually a special one-time operation that must be completed over a limited time period? a) Batch b) Patch c) Project d) Word e) File 23. The latest PC keyboards use a circuit that senses the movement by the change in its capacitance. What are these keyboards called? a) Capacitance keyboards b) Mechanical keyboards c) Qwerty keyboards d) Dvorak keyboards e) Normal keyboard 24. An IC contains 50 gates each of which consists of 6 components. Its belong to: a) VLSI b) LSI c) MSI d) SSI e) SSC 25. Controls of data communication deal with ___ a) the communication channel b) the computer c) terminals d) All of the above e) None of the above 26. Inventory is also referred to as: a) Stock b) Warehouse capacity c) Materials d) Materials in hand e) Storage 27. A server that can perform no other task besides network services is called ___ a) Uno server b) Dedicated server c) Committed server d) Service server e) Client server 28. What is the shortcut key of printing a document for computer having windows? a) Shift + P b) Alt + P c) Del + P d) Ctrl + Shift + P e) Ctrl + P 29. The processing of an application takes place between a client and a ___ processor. a) Front end b) Back end c) Middle end d) Only a and b e) a, b and c 30. ___ transforms one interface into another interface. a) Program b) Software c) Data d) File e) Data Base 31. What is the full form of CRT? a) Current Ray Tube b) Current Ray Technology c) Cathode Ray Tube d) Cathode Ray Technology e) Cat Ray Tube 32. The Analytical Engine developed during First Generation of computers used ___ as a memory unit. a) RAM b) Floppies c) Cards d) Counter Wheels e) ROM 33. Which of the following companies is a leader in manufacture of Hard Disk Drives? a) Samsung b) IBM c) Fujitsu d) Seagate e) Acer 34. ____ store data or information temporarily and pass it on as directed by the control unit? a) Address b) Register c) Number d) Memory e) None of these 35. In ___ mode, the communication channel is used in both directions at the same time? a) Full-duplex b) Simplex c) Half-duplex d) Duplex e) None of these 36. "New Comment" option can be found under ___ tab? a) Insert b) Data c) Review d) View e) File 37. Which key moves the cursor to the beginning of the next line of text? a) Shift b) Enter/ return c) Tab d) Backspace/ delete e) None of these 38. Identify the IP address from the following: a) 300.215.317.3 b) 302.215@417.5 c) 202.50.20.148 d) 202-50-20-148 e) 101.50. 2 0.148 39. Which one of the following is not a/an image/ graphic file format? a) PNG b) GIF c) BMP d) GUI e) None of these 40. In a client/ server model, a client program ___ a) asks for information b) provides information and files c) serves software files to other computers d) distributes data files to other computers e) All the above 41. Dot-matrix, DeskJet, Inkjet and Laser are all types of which computer peripherals? a) Keyboard b) Software c) Monitor d) Hardware e) Printer 42. What is the meaning of 'Hibern- ate' in Windows XP / Windows 7? a) Restart the computers in safe mode b) Restart the computers in normal mode c) Shutdown the computer terminating all the running applications d) Shutdown the computer without closing the running applications. e) None of these KEY 1) d; 2) c; 3) b; 4) c; 5) a; 6) c; 7) d; 8) c; 9) a; 10) e; 11) c; 12) d; 13) c; 14) b; 15) d; 16) e; 17) b; 18) b; 19) d; 20) a; 21) b; 22) c; 23) a; 24) c; 25) d; 26) a; 27) b; 28) e; 29) d; 30) b; 31) c; 32) d; 33) d; 34) b; 35) a; 36) c; 37) b; 38) c; 39) d; 40) a; 41) e; 42) d. -
ATM మిషన్నే ఎత్తేశారు..!
-
‘స్మార్ట్’ ఉంటే ...బ్యాంక్ మీ వెంటే
బిజినెస్ పని మీద చెన్నై వెళ్లాడు కార్తీక్. పని ముగించుకుని బైల్దేరేటప్పుడు చూసుకుంటే పర్సు ఖాళీగా ఉంది. సరే ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చులే అని అక్కడికి వెళ్లిన తర్వాత చూసుకుంటే అకౌంట్లో బ్యాలెన్స్ లేదంటూ వెక్కిరించింది ఏటీఎం మెషీన్. డబ్బులున్న ఎక్స్‌వైజడ్ అకౌంట్ కార్డు కాకుండా వేరే కార్డు తీసుకెళ్లినట్లు అప్పుడర్థమైంది అతనికి. రాత్రివేళ ఏం చేయాలి, ఎవరికి ఫోన్ చేయాలి అనుకుంటుంటే ఠక్కున ఆలోచన వచ్చింది. స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ ద్వారా తన బ్యాంకు వెబ్సైట్లోకి వెళ్లాడు. అందులోకి లాగిన్ అయి ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ కింద తనకు కావల్సిన మొత్తాన్ని ఎక్స్‌వైజడ్ అకౌంటులోకి బదలాయించాడు. కొన్ని నిమిషాలాగి ఏటీఎంలో నుంచి డ్రా చేసుకుని, వెనక్కి బైల్దేరాడు. మర్నాడు ఇంటికొస్తూ దారిలోనే ఎల్ఐసీ ప్రీమియంలు, ఇతరత్రా కట్టాల్సిన బిల్లులు కూడా ఫోన్ ద్వారానే కట్టేశాడు. ఇలా .. బ్యాంకింగ్ పనివేళలతో సంబంధం లేకుండా స్మార్ట్ఫోన్లు అరచేతిలోనే సర్వీసులు అందుబాటులోకి తెచ్చేస్తున్న వైనంపై ఈ వారం ధనం కథనం. ఎక్కడికైనా.. ఎప్పుడైనా వెంట తీసుకెళ్లగలిగే సౌకర్యం ఉన్న స్మార్ట్ఫోన్లు ప్రస్తుతం పర్సనల్ కంప్యూటర్ల స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. పోటీ అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఖాతాదారులకు చేరువయ్యేందుకు ఇప్పటికే నెట్ బ్యాంకింగ్ సదుపాయం అందిస్తున్న బ్యాంకులు తాజాగా స్మార్ట్ఫోన్లను కూడా ఆశ్రయిస్తున్నాయి. స్మార్ట్ఫోన్ల స్క్రీన్లు పరిమాణంలో చిన్నగా ఉంటాయి కనుక సాధారణ వెబ్సైట్లను చూడటానికి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. అందుకే.. స్మార్ట్ఫోన్లలోనూ పనిచేసే విధంగా ప్రత్యేక వెబ్సైట్లను (యాప్స్) రూపొందిస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... ఫ్రీడమ్ ప్లస్ పేరుతోనూ, ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్.. ఐసేఫ్ పేరిట, యాక్సిస్ బ్యాంక్.. యాక్సిస్ మొబైల్ పేరుతోను మొబైల్ బ్యాంకింగ్ యాప్స్‌ని అందిస్తున్నాయి. వీటి ద్వారా బ్యాంకు ఖాతాలో బ్యాలెన్సులు తెలుసుకోవడం మొదలు బిల్లుల చెల్లింపులు, మొబైల్ రీచార్జీలు, సినిమా టికెట్ల కొనుగోలు దాకా అన్ని రకాల సర్వీసులను ఈ యాప్స్ ద్వారా ఎంచక్కా చుట్టబెట్టేయొచ్చు. ఆండ్రాయిడ్.. విండోస్ యాప్స్ .. స్మార్ట్ఫోన్లు ఆండ్రాయిడ్, విండోస్, యాపిల్ ఐవోఎస్ అని వివిధ రకాల ఆపరేటింగ్ సిస్టమ్‌లతో పనిచేస్తున్నాయి. ఆయా ఆపరేటింగ్ సిస్టమ్‌లకు అనుగుణమైన యాప్స్‌ని బ్యాంకులు తయారుచేసుకుంటున్నాయి. వీటిని ఆండ్రాయిడ్ ఫోన్ అయితే గూగుల్ ప్లేస్టోర్ నుంచి, యాపిల్ ఫోన్ అయితే ఐస్టోర్ నుంచి ఫోన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మొబైల్ బ్యాంకింగ్ సర్వీసులు పొందేందుకు సదరు బ్యాంకులో రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ మాధ్యమంతో గానీ ఎస్ఎంఎస్ల రూపంలో గానీ లేదా ఏటీఎం సెంటర్ ద్వారా గానీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈమెయిల్ తరహాలోనే యాప్ లాగిన్ పేజీలో మీ ఐడీ, పాస్వర్డ్ టైప్ చేసి లాగిన్ అయి బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించవచ్చు. అందిస్తున్న సేవలు.. మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా మన ఖాతాల వివరాలు చిటికెలో తెలుసుకోవచ్చు. అలాగే చెక్కు బుక్ లాంటి వాటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ వంటి వ్యవస్థల ద్వారా మన ఖాతాలో ఉన్న డబ్బును ఇతర ఖాతాల్లోకి, ఇతరుల ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎన్ఈఎఫ్టీ మార్గంలో ట్రాన్స్ఫర్కి కొంత సమయం పట్టేస్తుంది కనుక.. తక్షణమే ట్రాన్స్ఫర్ కావాలంటే ఐఎంపీఎస్ పద్ధతిని ఉపయోగించుకోవచ్చు. ఈ రెండు విధానాల్లోనూ బ్యాంకులు స్వల్ప రుసుములు వసూలు చేస్తాయి. ఇవే కాకుండా కరెంటు, నీటి బిల్లులు, క్రెడిట్ కార్డుల బిల్లులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు మొదలైనవి కూడా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. ఇందుకోసం ఆయా సంస్థలను ముందుగా మన ఖాతాలకు అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు మొబైల్ ఫోన్, డీటీహెచ్ రీచార్జ్‌లను కూడా నేరుగా ఫోన్ యాప్ ద్వారా చేసుకోవచ్చు. సాధారణంగా ఈ సర్వీసులకు ఫోన్లో ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉండాలి. ఇంటర్నెట్ మాధ్యమం కాకుండా ఎస్ఎంఎస్లు పంపడం ద్వారా కూడా ఎంక్వైరీ సేవలు, రీచార్జ్‌లు, ఐఎంపీఎస్ వంటి సేవలు బ్యాంకులు అందిస్తున్నాయి. ఒకవేళ నగదు విత్‌డ్రా చేసుకోవాల్సి వచ్చిన పక్షంలో మనకు దగ్గర్లో ఏటీఎం సెంటర్లు ఎక్కడున్నాయో కూడా ఈ యాప్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. భద్రత ముఖ్యం.. మొబైల్ ద్వారా సులభంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు చేసేసినా.. గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇంటర్నెట్ ద్వారా వైరస్లు కూడా ఫోన్లో ప్రవేశిస్తుంటాయి. సైబర్ నేరగాళ్లు మీ డేటాను దొంగిలించే అవకాశాలూ ఉన్నాయి. అందుకే, మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు సురక్షితంగా ఉండేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. 1.వివిధ థర్డ్ పార్టీలు కూడా బ్యాంకుల పేరిట యాప్స్‌ని రూపొందిస్తుంటాయి. ఇలాంటివి కాకుండా మీ బ్యాంకు స్వయంగా రూపొందించిన యాప్‌ని మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. 2. ఒకవేళ మీ బ్యాంకుకి సంబంధించిన యాప్ గానీ లేకపోతే.. మొబైల్ యాంటీవైరస్ లేకుండా స్మార్ట్‌ఫోన్ ద్వారా బ్యాంకు వెబ్సైటును ఉపయోగించకుండా ఉండటం మంచిది. 3. బహిరంగ ప్రదేశాల్లో ఓపెన్ వైఫై నెట్‌వర్క్‌ల ద్వారా మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించకుండా జాగ్రత్తపడాలి. 4.ఎప్పటికప్పుడు యాప్స్‌ని, ఆపరేటింగ్ సిస్టం మొదలైన వాటిని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. 5. మెరుగైన మొబైల్ యాంటీవైరస్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. -
ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారు!
హిస్సార్: ఏటీఎం మిషన్ ను పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లడం లాంటి తరచుగా వార్తల్లో వింటుంటాం. కాని ఏకంగా ఏటిఎంనే మాయం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన హర్యానా హిస్సార్ లో మోడల్ టౌన్ మార్కెట్ లో జరిగింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎం ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని పోలీసులు తెలిపారు. ఈ ఏటిఎంకి కాపలాగా సెక్యూరిటీ సిబ్బంది లేరని, సీసీటీవీ కెమెరా అమర్చలేదని పోలీసులు తెలిపారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఏటీఎంను దొంగిలించారని పోలీసులు వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు ఫోరెన్సిక్ లాబరేటరీ నిపుణులు రంగంలోకి దిగారు. చేతి గుర్తుల ఆధారంగా దొంగల్ని పట్టుకునేందుకు ఫోరెన్సిక్ నిపుణుల ప్రయత్నాలు ప్రారంభించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
డబ్బుతో సహా ఏటీఎమ్ మిషన్‌ను ఎత్తుకెళ్లారు
జైపూర్: ఏటీఎమ్ మిషన్లలో డబ్బు దోచుకెళ్లడం.. రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లిన దాడి చేయడం వంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. రాజస్థాన్‌లో దొంగలు ఏకంగా ఏటీఎమ్ మిషన్నే ఎత్తుకెళ్లిపోయారు. ఇందులో దాదాపు 20 లక్షల రూపాయిలు ఉన్నట్టు అంచనా. సికర్ జిల్లాలో ఏర్పాటు చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎమ్ మిషన్ అపహరణకు గురైనట్టు శనివారం ఉదయం బ్యాంక్ సిబ్బంది గుర్తించారు. బ్యాంక్ కార్యాలయం కేబిన్‌లో దీన్నీ ఏర్పాటు చేశారు. ఏటీఎమ్ మిషన్‌లో డబ్బు ఎంత ఉందన్న విషయాన్ని బ్యాంక్ కచ్చితంగా వెల్లడించలేదు. అయితే 20 లక్షలు ఉండవచ్చని సికర్ ఎస్పీ హైదర్ అలీ చెప్పారు. ఏటీఎమ్ మిషన్ ఉంచిన గదిలో సీసీ కెమెరాలు లేవని తెలిపారు. -
గార్డును కట్టేసి ఏటీఎం దోపిడీకి యత్నం
బెంగళూరులో ఘటన సాక్షి, బెంగళూరు: బెంగళూరులో కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ జ్యోతి ఉదయ్‌పై దుండగుడి దాడిని మరవకముందే నగరంలో ఓ ఏటీఎం దోడీపీకి విఫలయత్నం జరిగింది. దోపిడీ దొంగ.. ఏటీఎం సెక్యూరిటీ గార్డును కట్టేసి లూటీకి ప్రయత్నించాడు. ఆదివారం వేకువజామున నగర శివారులోని హొంగసంద్రలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సందీప్ అనే దుండగుడు ఏటీఎం కేంద్రంలోకి చొరబడి సెక్యూరిటీ గార్డ షహబుద్దీన్‌పై వేట కొడవలితో దాడి చేసి బంధించాడు. ఏటీఎంలోని నగదు లూటీకి విఫలయత్నం చేశాడు. ఇంతలో బీట్ కానిస్టేబుల్ అటుగా రావడంతో ఏటీఎం కేంద్రం బయట బైక్‌పై హెల్మెట్ పెట్టుకుని ఉన్న మరో నిందితుడు ‘పోలీస్’ అంటూ అరిచాడు. దీంతో సందీప్ పారిపోవడానికి యత్నించగా, అప్పటికే కట్లు వదులు చేసుకున్న షహబుద్దీన్ అక్కడే ఉన్న కొడవలితో సందీప్‌ను వెంటాడి పట్టుకున్నాడు. సందీప్‌కు తోడుగా వచ్చిన నిందితుడు బైక్‌పై పారిపోయాడు. సందీప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, పారిపోయిన నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. లూటీ యత్నం దృశ్యాలు ఏటీఎంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయన్నారు. -
ఏటీఎం సొమ్ము రూ.70 లక్షలు స్వాహా
శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్: ఏటీఎం మిషన్‌లో డిపాజిట్ చేయాల్సిన సుమారు 70 లక్షలు స్వాహా చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. ఇందులో ఏటీఎంలో డబ్బు పెట్టే ఏజెన్సీ ఉద్యోగితో పాటు ఒక స్వర్ణవ్యాపారి కుమారుడు కూడా ఉన్నాడని తెలిసింది. డబ్బు తిరిగి చెల్లిస్తామని బ్యాంకు అధికారులకు చెప్పడంతో ఈ విషయం బయటకు తెలియలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో పూర్తి వివరాలు తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం మున్సిపాల్టీలో గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడిగి పని చేసిన వ్యక్తి కుమారుడు, పట్టణంలో జీటీ రోడ్డులో బంగారు దుకాణం వ్యాపారి కుమారుడు స్నేహితులు. శ్రీకాకుళం పట్టణంలోని ఒక బ్యాంకుతో పాటు మరి కొన్ని ప్రాంతాల్లోని బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో సొమ్ములు జమ చేసే సెక్యూరిటీ ఏజెన్సీలో కో ఆప్షన్ సభ్యుడి కుమారుడు కొంతకాలంగా పని చేస్తున్నాడు. ఏటీఎంలో డబ్బులు జమ చేసే విధి నిర్వహిస్తున్నాడు. అతని స్నేహితుడైన స్వర్ణవ్యాపారుడి కుమారుడు క్రికెట్ బెట్టింగ్‌లో చాలావరకు నష్టపోయాడు. అధిక మొత్తంలో అప్పులు చేయడంతో, వాటికోసం అప్పుల వాళ్లు బెదిరిస్తున్నారు. దీంతో ఏటీఎం ఏజెన్సీలో పని చేస్తున్న మిత్రుడికి బెట్టింగ్‌పై ఆశకలిగించాడు. తనకు సీసీఎల్ మ్యాచ్‌ల్లో క్రికెట్ బెట్టింగ్‌కు సంబంధించి అధిక మొత్తంలో డబ్బు వస్తుందని చెప్పాడు. తనకు డబ్బు ఇస్తే బెట్టింగ్ కడతానని, గెలిస్తే అందులో వాటా ఇస్తానని లేకపోతే తీసుకున్న సొమ్ముకు పది శాతం వడ్డీతో కలిపి ఇస్తానని చెప్పాడు. దీంతో ఆశపడిన మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడి కుమారుడు ఏటీఎంలో జమచేయాల్సిన డబ్బులో సుమారు రూ.70 లక్షలు మూడు విడతలుగా మిత్రుడికి ఇచ్చాడు. నెల రోజుల్లో ఈ సొమ్ముకు లెక్క చెప్పకపోతే బ్యాంకు అధికారులు గుర్తిస్తారని తెలిసినా బెట్టింగ్‌పై ఆశతో ఇందుకు పూనుకున్నాడు. బెట్టింగ్‌లో డబ్బులు రాకపోగా అసలు విషయం అధికారులకు తెలిసింది. బ్యాంకులో జమకావాల్సిన సొమ్ములో కొంత మొత్తం తగ్గడం గమనించి ఏజెన్సీకి ఫిర్యాదు చేశారు. దీనిపై పరిశీలించిన సెక్యూరిటీ ఏజెన్సీ వారు తమ వద్ద పని చేస్తున్న ఉద్యోగే ఈ పనిచేసినట్లు గుర్తించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బ్యాంకు అధికారులు సిద్ధం కాగా, స్వర్ణవ్యాపారి, మాజీ కో ఆప్షన్ సభ్యుడు వారితో రాజీ ప్రయత్నాలు ప్రారంభించారు. పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని, ఆ మొత్తం తాము చెల్లిస్తామని చెప్పడంతో బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో నిందితుల పేర్లు బయటకు రాలేదు. బ్యాంకు సిబ్బంది సాయంపై అనుమానాలు ఏజెన్సీ సొమ్ము జమచేస్తున్న పలు బ్యాంకుల్లో ఒక బ్యాంకు సిబ్బందికి ఈ విషయం ముందే తెలుసనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకు సిబ్బంది సహకారంతోనే అంత మొత్తంలో సొమ్మును సెక్యూర్టీ ఏజెన్సీకి తెలియకుండా తీసినట్టు తెలుస్తొంది. ఎప్పటికప్పుడు లావాదేవీలు చూడాల్సిన కొంతమంది సిబ్బంది కొంత మొత్తానికి ఆశపడి సహకారం అందించారని సమాచారం. దీనిపై ఇప్పటికైనా పోలీసులకు ఫిర్యాదు అందుతుందా అన్నది వేచి చూడాలి.