Kurnool Syndicate Bank Officers Forgot Keys After Filling Money in ATM Machine- Sakshi
Sakshi News home page

దొంగల చేతికి తాళాలు ఇవ్వడం అంటే ఇదేనేమో..

Published Tue, Sep 7 2021 9:39 AM | Last Updated on Tue, Sep 7 2021 12:21 PM

Officers Who Put Money In ATM Machine Forgot To Lock It In Kurnool District - Sakshi

ఏటీఎం మిషన్‌ మీద కీ ఉన్న దృశ్యం

దొంగల చేతికి తాళాలు ఇవ్వడం అంటే ఇదేనేమో.. ఏటీఎంలో డబ్బు పెట్టిన అధికారులు, ఆ తర్వాత మిషన్‌ తాళాలు కూడా అక్కడే మరచిపోయారు. ఈ సంఘటన డోన్‌లో చోటు చేసుకుంది.

డోన్‌ టౌన్‌: దొంగల చేతికి తాళాలు ఇవ్వడం అంటే ఇదేనేమో.. ఏటీఎంలో డబ్బు పెట్టిన అధికారులు, ఆ తర్వాత మిషన్‌ తాళాలు కూడా అక్కడే మరచిపోయారు. ఈ సంఘటన డోన్‌లో చోటు చేసుకుంది. ఇటీవల పట్టణంలో ఎస్‌బీఐ ఏటీఎంను దొంగలు కొల్లగొట్టిన ఘటన సంచలనం సృష్టించింది. తాజాగా మరో సంఘటన చర్చనీయాంశంగా మారింది.

స్థానిక రాజ్‌ థియేటర్‌ సమీపంలోని సిండికేట్‌ బ్యాంక్‌ అధికారులు సోమవారం మధ్యాహ్నం డాక్టర్‌ పోచా ప్రభాకర్‌రెడ్డి క్లినిక్‌ ఎదురుగా ఉన్న సిండికేట్‌ ఏటీఎంలో డబ్బులు పెట్టి తాళాలు వేశారు. అయితే మిషన్‌కు సంబంధించిన తాళాలు అక్కడే మరచిపోయారు. డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు వచ్చిన ఓ వ్యక్తి తాళాలు గుర్తించి బ్యాంక్‌ అధికారులకు అప్పగించారు. ఒక వేళ దొంగల చేతికి తాళాలు చిక్కి ఉంటే మరో చోరీ జరిగి ఉండేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. 

ఇవీ చదవండి:
ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు 
ఎచ్చెర్ల టీడీపీ ‘కళా’విహీనం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement